Kitchen tips: తేనె, నూనె, కాఫీ పొడిలను ఫ్రిజ్ లో పెడితే ఏమవుతుందో తెలుసా?

కూరగాయలు, పండ్లు ఇతర ఆహార పదార్థాలు ఎక్కువకాలం ఫ్రెష్ గా ఉండడానికి మనం వాటిని ఫ్రిజ్ లో పెడుతుంటాం. కానీ కొన్ని రకాల ఫుడ్స్ ని ఫ్రిజ్‌లో అస్సలు పెట్టకూడదు. వాటిని ఫ్రిజ్ లో పెట్టి తింటే కొత్త సమస్యలు కొనుక్కున్నట్లే. మరి ఎలాంటి ఆహారాలను పొరపాటున కూడా ఫ్రిజ్‌ లో పెట్టకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.

కూరగాయలు, పండ్లు ఇతర ఆహార పదార్థాలు పాడవకుండా ఫ్రిజ్ సహాయపడుతుంది. కానీ అన్ని రకాల ఆహార పదార్థాలను ఫ్రిజ్ లో పెట్టడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. కొన్నింటిని అయితే అస్సలు పెట్టకూడదు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. దానివల్ల మేలు జరగకపోగా.. ఆరోగ్యానికి మరింత హాని కలుగుతుంది అంటున్నారు. మరి ఏ ఫుడ్స్ ని అస్సలు ఫ్రిజ్ లో పెట్టకూడదో ఇక్కడ చూద్దాం.

అరటి పండ్లు:

అరటిపండ్లను ఫ్రిజ్‌లో అస్సలు పెట్టకూడదు. అరటిపండుకు గది ఉష్ణోగ్రత అవసరం. వెచ్చని ఉష్ణోగ్రత పండును పక్వానికి తీసుకురావడానికి సహాయపడుతుంది. కాంతి, గాలి క్షీణించే ప్రక్రియను నెమ్మదిస్తుంది.

కాఫీ పొడి

కాఫీ పొడిని ఫ్రిజ్‌లో పెడితే వాసన, రుచి పోతుంది. సూర్యరశ్మి నేరుగా తగలని చీకటి ప్రదేశాల్లో కాఫీ పొడిని నిల్వ చేయాలి. కాఫీ పొడిని ఫ్రిజ్‌లో పెడితే ఫ్రిజ్‌లోని ఇతర ఆహారాలకు కూడా కాఫీ వాసన వస్తుంది.
 


తేనె

తేనెను ఫ్రిజ్‌లో పెట్టకూడదు. గట్టిగా మూసి ఉంచితే సరిపోతుంది. తేనెను ఫ్రిజ్‌లో పెడితే గడ్డకట్టే అవకాశం ఉంటుంది.

నూనె

ఏ రకమైన నూనెను ఫ్రిజ్‌లో పెట్టకూడదు. సాధారణ గది ఉష్ణోగ్రత నూనెను నిల్వ చేయడం ఉత్తమం. ఫ్రిజ్‌లో పెట్టడం వల్ల నూనె గడ్డకట్టిపోతుంది.
 

బంగాళదుంప

బంగాళాదుంపలను సూర్యరశ్మి ఎక్కువగా రాని చల్లని ప్రదేశాల్లో నిల్వ చేయాలి. ఫ్రిజ్‌లో పెట్టడం వల్ల బంగాళాదుంప రుచి తగ్గుతుంది.

ఉల్లిపాయ

ఉల్లిపాయలను కూడా ఫ్రిజ్‌లో పెట్టకూడదు. వీటిని ఎక్కువ వేడి తగలని చీకటి ప్రదేశాల్లో నిల్వ చేయడం ఉత్తమం. 
 

Latest Videos

click me!