జుట్టు, చర్మానికి పోషణ...
నమ్మడానికి కాస్త వింతగా అనిపించినప్పటికీ.. కోడిగుడ్లు ఉడికించిన నీరు మన జుట్టు, చర్మానికి మంచి పోషణ అందిస్తుంది. ఈ నీటిలోని ఖనిజాలు జుట్టు కుదుళ్లను బలపరచడానికి, చుండ్రు సమస్యను తగ్గించడానికి, జుట్టు మెరిచేలా, ఆరోగ్యంగా కనిపించేలా చేయడానికి కూడా సహాయపడుతుంది. గుడ్లు ఉడికించిన తర్వాత ఆ నీటిని చల్లారనిచ్చి.. తర్వాత దానితో హెయిర్ వాష్ చేయాలి. రెగ్యులర్ గా చేయడం వల్ల జుట్టు అందంగా మారుతుంది. ఈ నీటిని ఫేస్ కి టోనర్ గా వాడితే.. చర్మం కూడా అందంగా మారుతుంది.
పెంపుడు జంతువుల ఎముకలను బలపరుస్తుంది
ఈ నీరు మనుషులకే కాకుండా పెంపుడు జంతువులకు కూడా ప్రయోజనకరం. మీకు కుక్క లేదా పిల్లి ఉంటే, వాటి ఆహారంలో ఈ నీటిని కలపడం వల్ల వాటి ఎముకలు , దంతాలు బలపడతాయి. ఇది కీళ్ల నొప్పులు, కాల్షియం లోపాన్ని నివారించడానికి సహాయపడుతుంది.
ఈ జాగ్రత్తలు కచ్చితంగా పాటించాల్సిందే...
ఈ నీటి ప్రయోజనాలను పొందడానికి అత్యంత ముఖ్యమైన విషయం దాని స్వచ్ఛత. గుడ్ల పెంకుల నుండి మురికి నీటిలోకి రాకుండా ఉండటానికి, వాటిని ఉడకబెట్టే ముందు శుభ్రమైన నీటితో కడగాలి. మీరు దీనిని మొక్కలకు నీరు పోయడం కాకుండా ఇతర ప్రయోజనాల కోసం ఉపయోగిస్తుంటే, దానిని ఫ్రిజ్‌లో గాజు సీసాలో నిల్వ చేసి, 24 గంటలలోపు వాడండి. ఉడకబెట్టేటప్పుడు గుడ్లు నీటిలో పగిలిపోతే, ఆ నీటిని ఉపయోగించవద్దు.