బియ్యం, పప్పు నాణ్యత...
దోశ కోసం బియ్యం, పప్పులను కొనుగోలు చేసేటప్పుడు అవి మరీ పాతవి కాకుండా చూసుకోండి. ఎందుకంటే.. మరీ పాతవి ఎంచుకోవడం వల్ల వాటిపై బ్యాక్టీరియా పేరుకుపోయే ప్రమాదం ఉంది. అంతేకాకుండా.. చాలా మంది బయట రెడీగా తయారు చేసి ఉన్న దోశ పిండి కొని తెచ్చుకొని ఇంట్లో దోశలు చేసుకుంటూ ఉంటారు. వాటిలో వాళ్లు నాణ్యమైన పప్పు, బియ్యం కలపకపోవచ్చు. కాబట్టి.. ఇంట్లో మీరే స్వయంగా పిండి తయారు చేసుకోవడం మంచిది. ఇక.. మీరు రుబ్బుకున్న పిండి పులుపు వాసన వస్తే అలాంటి పిండిని పారేయడమే మంచిది.
నాన్-స్టిక్ కోటింగ్‌ను తనిఖీ చేయండి
మీరు దోశలు వేయడానికి నాన్‌స్టిక్ పాన్ ఉపయోగిస్తుంటే, దాని కోటింగ్‌ను తప్పకుండా తనిఖీ చేయండి. టెఫ్లాన్ కోటింగ్ ఊడిపోతుంటే, వేడి చేసినప్పుడు అది మీరు వేసే దోశలోకి రసాయనాలను విడుదల చేసే అవకాశం ఉంది, ఇది ఆరోగ్యానికి హానికరం. అందువల్ల, నాన్ స్టిక్ ప్యాన్ కాకుండా ఐరన్ పాన్ లేదా పూర్తిగా చెక్కుచెదరని కోటింగ్ ఉన్న నాన్‌స్టిక్ పాన్‌ను ఉపయోగించడానికి ప్రయత్నించండి.
నూనె, నీటి స్వచ్ఛత
దోసె పిండిలో కలిపే నీరు, దోశ వేయడానికి ఉపయోగించే నూనె స్వచ్ఛమైన వాటిని మాత్రమే ఉపయోగించాలి. దోసె పిండిని ఎల్లప్పుడూ శుభ్రమైన నీటితోనే కలపండి. వాడే నూనె కూడా మంచిదై ఉండాలి. లేకపోతే.. ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంది.