Chicken: చికెన్ తినడం అంటే ఇష్టమా? మంచి ప్రోటీన్ సోర్స్ కదా అని రోజూ తింటున్నారా? అసలు చికెన్ రోజూ తినొచ్చా? ఎలా తింటే చికెన్ ఆరోగ్యానికి మంచిదో తెలుసా? నిపుణులు ఏమంటున్నారు?
Chicken: నాన్ వెజ్ ప్రియులకు చికెన్ అంటే ఎంత ఇష్టం ఉంటుందో స్పెషల్ గా చెప్పక్కర్లేదు. ప్రతిరోజూ చికెన్ పెట్టినా తినే వాళ్లు ఉంటారు. చికెన్ ప్రోటీన్ కి మంచి సోర్స్ . కాబట్టి.. దీనిని తినడం వల్ల ఎలాంటి నష్టం ఉండదు అనే అభిప్రాయం చాలా మందిలో ఉంటుంది. అయితే.. ఈ చికెన్ ఎలా తింటే మంచిది? దీనిని ఎలా వండి తినాలి? వారానికి ఎన్నిసార్లు తినాలి అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం...
24
ప్రోటీన్ కి మారుపేరు...
చికెన్ లో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. ఇది మన కండరాల నిర్మాణానికి, కణాల మరమ్మత్తుకు, రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. కోడి మాంసంలోని లీన్ ప్రోటీన్ సులభంగా జీర్ణమౌతుంది. శరీరానికి కావాల్సిన శక్తిని కూడా అందిస్తుంది. అయితే.. మనం చికెన్ వండే పద్ధతి విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. అధిక నూనె, మసాలాలు లేదా వేయించడం లాంటివి తినడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు.
పోషకాహార నిపుణులు చెప్పేదేమిటంటే.. చికెన్ ని తక్కువ నూనెలో గ్రిల్ చేయడం, ఉడకపెట్టడం లేదా ఆవిరి మీద ఉడికించడం ఉత్తమమైన మార్గం. ఇలా తినడం వల్ల శరీరంలో అదనంగా కొవ్వు చేరదు. మరోవైపు, చికెన్ వేయించడం లేదా ఎక్కువ నూనెలో వండటం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. ఫలితంగా గుండె జబ్బుల ప్రమాదం కూడా పెరుగుతుంది.
34
చికెన్ లో పోషకాలు...
చికెన్ లో విటమిన్ బి6, బి12, నియాసిన్, ఫాస్పరస్, సెలీనియం వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ఇవి శరీర జీవక్రియను నిర్వహించడానికి సహాయపడతాయి. మెదడు పనితీరు పెంచడంలో కూడా ఇవి ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. క్రమం తప్పకుండా వ్యాయామం చేసేవారికి చికెన్ ఒక మంచి ఆహారం.
చికెన్ ని అన్ని వయసుల వారు ఒకే పరిమాణంలో తీసుకోకూడదు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేని వారు వారానికి 2 నుంచి 3 రోజులు మితంగా చికెన్ తింటే సరిపోతుంది. మరీ ఎక్కువగా తినడం వల్ల శరీరంలో యూరిక్ యాసిడ్ పెరిగే అవకాశం ఉంది. అదేవిధంగా, కిడ్నీ లేదా కాలేయ సమస్యలు ఉన్నవారు చికెన్ ఎక్కువగా తినకపోవడమే మంచిది. వైద్యుల సలహా మేరకు మాత్రమే తినాలి.
చికెన్ తినేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయాలు....
చికెన్ తినేటప్పుడు కచ్చితంగా కొన్ని విషయాలు గుర్తించుకోవాలి. అందులో మొదటిది పరిశుభ్రత. పూర్తిగా కడగకుండా, సరైన ఉష్ణోగ్రత వద్ద ఉడికించకపోతే, ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది. అందువల్ల, సగం ఉడికినా లేదా పచ్చి చికెన్ ను ఎప్పుడూ తినకూడదు.