పన్నీర్ చాలా రుచిగా ఉంటుంది. రుచి మాత్రమే కాదు.. పోషకాలతో నిండి ఉంటుంది. పన్నీర్ లో ఉండే ప్రోటీన్, కాల్షియం శరీరాన్ని బలపరిచి, ఎముకలు, కండరాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. అందుకే పన్నీర్ ను శాకాహారులకు ఒక గొప్ప ఆరోగ్యకరమైన ఎంపికగా పరిగణిస్తారు. పన్నీర్ లో ప్రోటీన్, కాల్షియం, శారీరక అభివృద్ధికి అవసరమైన అనేక విటమిన్లు ఉంటాయి. ఇది పిల్లల పెరుగుదలకు, కండరాల అభివృద్ధికి , ఎముకల బలానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.
బరువు తగ్గాలి అనుకునేవారికి, ప్రోటీన్ అవసరం అనుకున్నవారు రోజూ ఈ పన్నీర్ తీసుకుంటూ ఉంటారు. ఈ పన్నీర్ మితంగా తీసుకోవడం వల్ల మన శరీరానికి శక్తి లభించి, ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది. తాజాగా ఉన్న పన్నీర్ గర్భిణీ స్త్రీలకు కూడా చాలా మేలు చేస్తుంది. కడుపులో పెరుగుతున్న బిడ్డకు అవసరమైన పోషకాలు అందిస్తుంది. మరి ఇన్ని ప్రయోజనాలు అందే ఈ పన్నీర్ ని కొందరు పొరపాటున కూడా తినకూడదు. ఎవరు తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం...