Weight Loss: ఈ సూప్ తాగితే.. నెలరోజుల్లో బరువు తగ్గడం చాలా ఈజీ..!

Published : Mar 11, 2026, 01:02 PM IST

 Weight Loss: ఎన్ని ప్రయత్నాలు చేసినా బరువు తగ్గడం లేదని ఫీల్ అవుతున్నారా? అయితే.. నెల రోజుల పాటు.. ఒక సూప్ ఇంట్లో చేసుకొని తాగితే.. ఈజీగా బరువు తగ్గొచ్చు. 

PREV
13
Soup

బరువు తగ్గడానికి చాలా మంది చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా నోరు కట్టేసుకొని.. కడుపు మాడ్చుకుంటూ ఉంటారు. తిండి తినడం మానేస్తేనే బరువు తగ్గుతాం అని ఫీలౌతూ ఉంటారు. కానీ.. సరైన ఆహారం , సరైన సమయానికి తీసుకుంటూ.. లైఫ్ స్టైల్ లో మార్పులు చేసుకుంటే.. ఈజీగా బరువు తగ్గొచ్చని నిపుణులు చెబుతున్నారు.. ముఖ్యంగా.. ఈ డైట్ లో మునగాకు, వెల్లుల్లి కలిపి తయారు చేసే సూప్ తాగితే.. నెల రోజుల్లోనే మీ బరువులో తేడా చూడొచ్చు. మరి, ఆ సూప్ ఎలా తయారు చేసుకోవాలి? ఎలా తాగాలో ఇప్పుడు చూద్దాం...

23
బరువు తగ్గడానికి మునగాకు సూప్ ఎలా హెల్ప్ చేస్తుంది..?

ప్రోటీన్.. మునగాకు, మునక్కాయలు ఈ రెండింటిలో సూప్ కోసం మీరు ఏది తీసుకున్నా కూడా దీనిలో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. దీనిని తీసుకోవడం వల్ల ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉంటుంది. దీని వల్ల ఎక్కువసేపు ఆకలి వేయదు. దీని వల్ల.. ఇతర జంక్ ఫుడ్ తినాలనే కోరిక కలగదు. ఫలితంగా బరువు అదుపులో ఉంటుంది.

మెటబాలిజం.. ఈ మునగాకు సూప్ తాగడం వల్ల జీవక్రియ( మెటబాలిజం) వేగవతం చేస్తుంది. ఇది శరీరంలోని అదనపు ఫ్యాట్ కరిగించడంలో సహాయపడుతుంది.

లైట్ డిన్నర్.. రాత్రి పూట భారీ భోజనానికి బదులుగా ఈ తేలికపాటి సూప్ తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది.

33
సూప్ తయారీ విధానం...

కావాల్సిన పదార్థాలు..

ఒక కప్పు తాజా మునగాకు

4-5 వెల్లుల్లి రెబ్బలు

రుచికి సరిపడా ఉప్పు, మిరియాల పొడి

అవసరమైనన్ని నీళ్లు

సూప్ తయారీ విధానం...

ముందుగా ఒక గిన్నెలో మునగాకు, వెల్లుల్లి రెబ్బలను వేసి తగినన్ని నీళ్లతో బాగా ఉడికించండి.ఉడికిన తర్వాత వాటిని చల్లార్చి, బ్లెండర్‌లో వేసి మెత్తగా గ్రైండ్ చేయండి. ఈ మిశ్రమానికి కొంచెం ఉప్పు, మిరియాల పొడి , తగినన్ని నీళ్లు కలిపి మళ్లీ గిన్నెలో పోయండి. దీనిని సిమ్ లో పెట్టి... కొద్దిసేపు మరిగించాలి. సూప్ మరీ చిక్కగా అనిపిస్తే.. మరి కొంచెం నీళ్లు కలపొచ్చు.

ఈ సూప్ ఎలా తాగాలి..?

ఈ సూప్ ని మీరు ప్రతిరోజూ రాత్రి డిన్నర్ కి బదులు తాగొచ్చు. నెల రోజుల పాటు తాగితే చాలు మీ బరువులో తేడాను గమనించగలరు. ఈ సూప్ శరీరంలో కొవ్వును చాలా ఈజీగా కరిగించేస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories