Summer Drinks: ఇవి తాగితే చాలు..వేసవి అంతా కూల్ కూల్‍గా ఉండొచ్చు

Published : Mar 10, 2026, 11:23 PM IST

Summer Drinks:సమ్మర్‍లో శరీరం తరచూ వేడెక్కుతూ ఉంటుంది. నీళ్లు తాగినా కూడా ఫలితం ఉండదు. అలాంటప్పుడు కనిపించిన కూల్ డ్రింక్స్ తాగేస్తుంటారు. అలా కాకుండా ఈ 7 నేచురల్ ఫుడ్స్ తో మీ బాడీ వేసవిలోనూ కూల్ కూల్‍గా ఉంటుంది. 

PREV
16
చెరకు రసంతో శరీరానికి కూలింగ్

ఎండాకాలంలో వేడి కారణంగా అలసట, ఉక్కపోత, చికాకుతో ఇబ్బందిపడతాం. బయట వేడితో పాటు శరీరం కూడా సెగలు కక్కుతూ ఉంటుంది. మల మూత్ర విసర్జనలు కూడా వేడిగా అవుతుంది. ఒక్కోసారి మూత్రవిసర్జన చేసేటప్పుడు కూడా మంటగా అనిపిస్తుంది. ఈ సమయంలో శరీరానికి మంచి కూలింగ్, నేచురల్ డ్రింక్స్ చాలా అవసరం. ఇవి వేడి తగ్గించి, డీహైడ్రేషన్‍ని నివారిస్తాయి.

చెరకు రసం(షుగర్ కేన్): ఇది తాగిన వెంటనే కడుపు ఫుల్‍గా అనిపిస్తుంది. అంతేకాకుండా ఎనర్జీ వస్తుంది. నేచురల్ కూలింగ్ డ్రింక్‍లాగా పనిచేసి శరీరంలోని వేడి తగ్గించడంలో సహాయపడుతుంది.

26
తాటిముంజలతో అలసట తగ్గుతుంది

తాటి ముంజలో విటమిన్లు, నీరు పుష్కలంగా ఉంటాయి. దీనిని తినడం వల్ల శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. అంతేకాకుండా వేడి కారణంగా వచ్చే అలసట తగ్గుతుంది. 

36
కొబ్బరి నీరు(కోకోనట్ వాటర్)

కొబ్బరి నీరు ఎలక్ట్రోలైట్ డ్రింక్. శరీరానికి అవసరమైన లవణాలు, మినరల్స్ అందిస్తుంది. కూలింగ్ ఇస్తుంది. కడుపు నిండిన భావన కలుగుతుంది. రోజుకు లీటర్ కోకోనట్ నీళ్లు తాగినా చాలు.

సబ్జాగింజలు నీటిలో నానబెట్టి తాగాలి. శరీరంలోని వేడిని తగ్గించి, చల్లగా ఉంచతాయి. డైరెక్ట్ గా తాగలేకపోతే నిమ్మరసం, హనీ కలుపుకుని తాగితే ఇంకా మంచిది. 

46
మజ్జిగ ఒక నేచురల్ కూలింగ్ డ్రింక్

ఇందులో లాక్టిక్ ఆమ్లం ఉంటుంది. జీర్ణక్రియకు కూడా మంచివి. ఏ కాలంలోనైనా మజ్జిగ చాలా మంచిది. వేసవిలో ఇంకా బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. కాస్త జీరా పొడి కలుపుకుని తాగితే వెంటనే జీర్ణమవుతుంది.

56
పుచ్చకాయలో సుమారు 90% వాటర్

పుచ్చకాయలో సుమారు 90% వాటర్ ఉంటుంది. కాబట్టి శరీరానికి కావలసిన నీటిని అందిస్తుంది. కుదిరినప్పుడల్లా తినడం బెటర్. ఒకవేళ తియ్యగా లేకపోతే, కాసేపు ఫ్రిజ్‍లో పెట్టి తింటే తియ్యగా లేకపోయినా తినేయొచ్చు. లేదంటే..పెప్పర్, సాల్ట్ చల్లి తింటే ఇంకా అదిరిపోద్ది.

66
బ్యాగులో పెట్టుకోవడం ఉత్తమం

నిమ్మరసంలో విటమిన్ C అధికంగా ఉంటుంది. శరీరాన్ని రిఫ్రెష్ చేస్తుంది, డీహైడ్రేషన్ తగ్గిస్తుంది. బయటకు వెళ్లేటప్పుడు బయట దొరికే లెమన్ వాటర్ తాగడం కంటే...ఇంటి నుంచే ఒక బాటిల్‍లో పట్టుకోవడం ఉత్తమం.

ఈ సమ్మర్‍లో బయట దొరికే కూల్ డ్రింక్ కాకుండా ఇంట్లోనే నేచురల్ కూలింగ్ డ్రింక్స్ తాగండి. ఫ్రిజ్ లో నీళ్లు కాకుండా మట్టి కుండలో వాటర్ పెట్టుకుంటే చల్లగా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా మంచిది. 

Read more Photos on
click me!

Recommended Stories