Published : Jun 15, 2025, 01:30 PM ISTUpdated : Jun 18, 2025, 11:17 AM IST
Milk Curdling: కొన్ని సందర్భాల్లో ఎంత జాగ్రత్త వహించిన పాలు విరిగిపోతాయి. అయితే.. విరిగిపోయిన పాలను బయటపడేసే కన్నా వాటిని అనేక రకాలుగా వినియోగించుకోవచ్చు. అనేక పద్ధతుల్లో తిరిగి వాటిని ఉపయోగించుకోవచ్చు. ఇంతకీ విరిగిన పాలతో ఏం చేస్తారో తెలుసుకుందాం.
పాలు విరిగిపోవడం అనేది ప్రతి ఇంట్లో జరుగుతూనే ఉంటుంది. కొన్ని సందర్భాల్లో పాలను వేడి చేస్తుంటే విరిగిపోతే.. మరికొన్ని సార్లు ఎండ కారణంగా కూడా పాలు విరిగిపోతాయి. పాలు విరిగిపోతే ఏం చేయాలి? ఆ పాలను ఎలా ఉపయోగించాలి?
26
అలా చేయకండి
వేసవిలో చాలాసార్లు పాలు కాచుతున్నప్పుడు విరిగిపోతాయి. దీంతో పాలు పాడైపోయాయని పారబోస్తారు, కానీ, వాటిని తిరిగి ఉపయోగించుకోవచ్చు. ఈ పాలలో చాలా పోషకాలు ఉంటాయి. కాబట్టి, వాటిని పారేయకండి. ఈ పాలను మీరు ఎలా ఉపయోగించుకోవచ్చో తెలుసుకుందాం.
36
నోరూరించే రెసిపీలు..
విరిగిన పాలను పారబోయడానికి బదులుగా వాటితో అన్నం వండుకోవచ్చు. ఒక వస్త్రం సహాయంతో పాలను వడగట్టి నీటిని వేరు చేయండి. ఇప్పుడు అన్నం వండేటప్పుడు ఆ నీటిని కలపండి. ఈ నీటితో వండిన తర్వాత, అన్నం చాలా రుచిగా ఉంటుంది. పాస్తా, నూడుల్స్ వండేటప్పుడు కూడా విరిగిన పాల నీటిని ఉపయోగించవచ్చు.
సాండ్‌విచ్‌లు తయారు చేయడానికి విరిగిపోయిన పాలను ఉపయోగించవచ్చు. విరిగిపోయిన పాలను వడకట్టి. నీరు, పాలను వేరు చేయండి. దీనికి టమాటా, ఉల్లిపాయ, మిరపకాయలు, కొత్తిమీర, మసాలాలు కలిపి వేయించండి. దాన్ని సాండ్‌విచ్ స్టఫింగ్‌గా వాడవచ్చు.
56
చపాతీలు
సాధారణంగా జనాలు విరిగిపోయిన పాలతో చీజ్ తయారు చేస్తారు. చీజ్ తయారీతో పాటు.. ఆ పాలను ఇతర ప్రయోజనాల కోసం కూడా ఉపయోగించవచ్చు. చపాతీలు చేసేటప్పుడు పిండిలో ఈ పాలను కలిపితే, పిండి చాలా మెత్తగా మారుతుంది. ఇలా చేసిన చపాతీల్లో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి.
66
రుచికరమైన వంటకాలు
విరిగిపోయిన పాలనుండి తీసిన నీటిని కూరల్లో కలపవచ్చు, ఇలా చేయడం వల్ల కూరగాయలకు రుచి పెరుగుతుంది. అందులో పోషక విలువలు కూడా పెరుగుతాయి. సూప్, సాస్ ల తయారీలో విరిగిపోయిన పాలను వాడవచ్చు. టమాటా సూప్, క్రీమీ పాస్తా సాస్ వంటి వంటకాలను మరింత రుచికరంగా చేయడానికి ఉపయోగిస్తారు.