Ambani:నడి రోడ్డు మధ్యలో భార్యకు ప్రపోజ్ చేసిన ముఖేష్ అంబానీ, క్రేజీ లవ్ స్టోరీ

Published : May 21, 2025, 11:32 AM ISTUpdated : May 21, 2025, 11:50 AM IST

నీతా ఒక స్కూల్ లో టీచర్ గా పని చేస్తూ ఉండేవారు. ఇక.. ఆ సమయంలో ముఖేష్ రియలన్స్ సామ్రాజ్యాన్ని విస్తరించే పనిలో ఉన్నారు. 

PREV
15
ముకేష్-నీతా ప్రేమ కథ

మన దేశంలోనే కుబేరుడు, రియలన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీకి పరిచయం అవసరం లేదు. ఆయన వ్యాపారవేత్తగా, మన దేశంలోనే అత్యంత సంపన్నుడిగా అందరికీ సుపరిచితమే. ఆయన భార్య నీతా అంబానీ కూడా.. తరచూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. అయితే, ఈ జంట మొదటిసారి ఎలా కలిశారు? ముఖేష్ మొదటిసారి ఎలా ప్రపోజ్ చేశారు? వారి ప్రేమ కథ ఎలా మొదలైందో తెలుసుకుందాం..

25
నీతాని ఎక్కడ కలిశారు?

నీతా గుజరాత్ లో ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టి పెరిగారు.ఆమె చిన్నతనం నుంచే భరతనాట్యంలో శిక్షణ పొందారు.ఒకసారి ఒక సాంస్కృతిక కార్యక్రమంలో నీతా ఒక నృత్య ప్రదర్శన ఇచ్చారు. ఆ సమయంలోనే అక్కడికి వ్యాపార దిగ్గజం ధీరూభాయ్ అంబానీ తన భార్య కోకిలాబెన్ లతో కలిసి వచ్చారు. నీతా డ్యాన్స్ ధీరూభాయ్ అంబానీ, కోకిలాబెన్ లకు అమితంగా నచ్చేసింది.

35
ఎలా ప్రపోజ్ చేశారంటే..?

వెంటనే తమ కుమారుడు ముఖేష్ కి ఇచ్చి వివాహం చేయాలి అని అనుకున్నారు. ఈ విషయాన్ని నీతాకు ఫోన్ చేసి చెప్పారు. అయితే, నీతా మాత్రం ఎలాంటి సమాధానం చెప్పకుండా ఫోన్ పెట్టేయడం విశేషం. అప్పటికి నీతా ఒక స్కూల్ లో టీచర్ గా పని చేస్తూ ఉండేవారు. ఇక.. ఆ సమయంలో ముఖేష్ రియలన్స్ సామ్రాజ్యాన్ని విస్తరించే పనిలో ఉన్నారు.

మొదటిసారి ముఖేష్, నీతా కలిసినప్పుడే.. ముఖేష్ ఆమెకు ప్రపోజ్ చేశారట. అది కూడా సినిమాటిక్ స్టైల్ ప్రపోజ్ చేయడం విశేషం. ఇద్దరూ కలిసి కారులో ముంబయిలోని పెద్దర్ రోడ్డు వైపు బయటకు వెళ్లినప్పుడు.. వారు వెళ్తున్న కారును రోడ్డు మధ్యలో ఆపేశారు. ట్రాఫిక్ కూడా జామ్ అయ్యింది.అప్పుడే తమ మనసులోని మాటను ముఖేష్ బయట పెట్టారు. అయితే, సడెన్ ప్రపోజ్ కి నీతా భయపడిందట. ఆమె మౌనంగా ఉండటంతో..సమాధానం చెప్పే వరకు కారు స్టార్ట్ చేయను అని సరదాగా అన్నారు.

45
పెళ్లి తర్వాత..

1985లో, ముఖేష్ , నీతా వివాహం చేసుకున్నారు, ప్రేమ, కుటుంబం , ఉమ్మడి ఆకాంక్షల ప్రయాణాన్ని ప్రారంభించారు. సంవత్సరాలుగా, వారు ఒక విజయవంతమైన సామ్రాజ్యాన్ని మాత్రమే కాకుండా, తమ పిల్లలైన ఆకాష్, ఇషా , అనంత్ అంబానీలతో బలమైన కుటుంబాన్ని కూడా నిర్మించుకున్నారు.

55
భర్తకు తగిన భార్య..

ప్రతి సవాలులో తన వెన్నంటే నిలిచినందుకు ముఖేష్ అంబానీ తన భార్యకు తరచుగా క్రెడిట్ ఇస్తారు. అతను ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాపార సంస్థలలో ఒకదానిని నడిపిస్తుండగా, నీతా అంబానీ దాతృత్వం, విద్య , క్రీడలలో తనదైన గుర్తింపును సంపాదించుకున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories