వేరుశనగ నూనె ప్రయోజనాలు..
వేరుశనగ నూనె మోనో అన్‌శాచురేటెడ్ (MUFA), పాలీ అన్‌శాచురేటెడ్ కొవ్వులను కలిగి ఉంటుంది. ఇవి గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తూ, మంచి కొలెస్ట్రాల్‌ను (HDL) పెంచుతాయి. ఇందులో విటమిన్ E అనే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ ఉండటంతో, కణాల రక్షణకు ఉపయోగపడుతుంది.
వేరుశనగ నూనె తేలికపాటి సువాసనతో ఉండి, వేపుళ్లు, తాలింపు, సలాడ్ డ్రెస్సింగ్ లాంటి వివిధ వంటలకూ ఉపయోగపడుతుంది. అయితే, కొంతమంది వ్యక్తులకు వేరుశనగ అలెర్జీ ఉండే అవకాశం ఉంది. అలాంటి వారు ఈ నూనె వాడటాన్ని నివారించాలి. కొబ్బరి నూనెతో పోలిస్తే తక్కువగానే ఉన్నా, దీనిలో కొంత మేర సంతృప్త కొవ్వులు ఉండటం వల్ల దీన్ని కూడా మితంగా వాడటం మంచిది.