తాళింపులో...
మీరు పప్పు లేదా ఏదైనా కూరగాయలు వండేటప్పుడు..తాళింపులో కొత్తిమీర కాడలు వేస్తే సరిపోతుంది. అయితే.. ఆ కొత్తిమీర కాడలను సన్నగా తరిగి.. నూనె వేడి చేయ్యగానే వేయాలి. ఇలా తాళింపులో కొత్తిమీర సన్నగా తరిగి వేయడం వల్ల కూరకు మంచి రుచి పెరుగుతుంది
చికెన్ మారినేషన్ లో...
చికెన్ కర్రీ లేదా బిర్యానీ వండేటప్పుడు మనం దానిని మారినేట్ చేస్తూ ఉంటాం. చికెన్ ని అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, మసాలాలతో మారినేట్ చేసేటప్పుడు దానిలో ఈ కొత్తిమీర కాడలను కూడా చేర్చాలి. డైరెక్ట్ గా కాకుండా.. ఈ కొత్తిమీర కాడలను మెత్తని పేస్టులా మార్చి చికెన్ లో వేసి మారినేట్ చేయాలి. ఇలా చేయడం వల్ల మీ చికెన్ కర్రీ రుచి హెల్దీగా మారడంతో పాటు.. రుచి రెట్టింపు అవుతుంది.