Gulab Jamun Syrup: రసగుల్లా, గులాబ్ జామూన్, జిలేబీ తినేశాక సిరప్ పడేస్తున్నారా? అయితే ఇప్పుడు పడేయాల్సిన అవసరం లేదు. వాటితో రకరకాల రుచికరమైన వంటలు చేసుకోవచ్చు తెలుసా. అయితే ఎలా వాడాలో ఈ 4 సూపర్ టిప్స్ ట్రై చేయండి.
రసగుల్లా, గులాబ్ జామూన్, జిలేబీ తినేశాక సిరప్ పడేస్తున్నారా? అయితే ఇప్పుడు పడేయాల్సిన అవసరం లేదు. వాటితో రకరకాల రుచికరమైన వంటలు చేసుకోవచ్చు తెలుసా. శరబత్, హల్వా, పాయసం వంటి వాటిలో ఈ పాకాన్ని ఎలా వాడాలో ముందు తెలుసుకోవాలి. లేకపోతే ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఎలా వాడాలో
26
పాకం మళ్లీ వాడొచ్చు
రసగుల్లా లాంటి స్వీట్లు తిన్న తర్వాత పాకం మిగిలిపోవడం సహజం. చాలామంది దీన్ని పనికిరాదని పారేస్తారు. కానీ ఈ పాకం చాలా రుచిగా, తియ్యగా ఉంటుంది. దీన్ని సరైన పద్ధతిలో వాడితే, రకరకాల వంటకాల్లో ఉపయోగించవచ్చు. ఈ పాకాన్ని ఫ్రిజ్‌లో నిల్వ చేసుకుని వాడుకోవచ్చు.
36
నిమ్మరసం రుచిని పెంచుతుంది
మిగిలిన పాకాన్ని మీరు శరబత్ లేదా నిమ్మరసంలో కలుపుకోవచ్చు. ఒక గ్లాసులో ఈ తీపి పాకం పోసి, నిమ్మరసం, పుదీనా ఆకులు, ఐస్ ముక్కలు వేయండి. ఆ తర్వాత చల్లటి నీళ్లు కలిపితే చాలు. రుచికరమైన నిమ్మకాయ పానీయం సిద్ధం. కావాలంటే లస్సీలో కూడా ఈ పాకాన్ని వాడుకోవచ్చు.
మిగిలిన పాకాన్ని రవ్వ కేసరి లేదా పాయసం చేయడానికి కూడా ఉపయోగించవచ్చు. దీనివల్ల యాలకుల సువాసనతో పాటు మంచి తీపి కూడా వస్తుంది. ఈ పాకం వాడితే, అదనంగా పంచదార వేయాల్సిన అవసరం ఉండదు. అయితే, మరుగుతున్న పాలలో పాకం వేయకండి, పాలు విరిగిపోయే ప్రమాదం ఉంది. హల్వా లేదా పాయసం తయారయ్యాక చివర్లో పాకం కలపాలి.
56
పాన్‌కేక్స్‌లో పాకం వాడండి
మిగిలిన పాకాన్ని మళ్లీ వేడి చేసి పాన్‌కేక్స్, మాల్పువా, షాహీ టోస్ట్ లేదా బ్రెడ్‌పై వేసుకుని తినొచ్చు. శనగపిండితో బూందీ చేసి ఈ పాకంలో నానబెట్టినా ఓ రుచికరమైన స్వీట్ తయారవుతుంది. కొన్నిసార్లు పాకంలో రసగుల్లా ముక్కలు మిగిలిపోతాయి. కాబట్టి, వాడే ముందు పాకాన్ని వడకట్టుకోవడం మంచిది.
66
ఫ్రూట్ సలాడ్ లేదా పెరుగుతో కలపండి
మీకు తీపి పెరుగు లేదా ఫ్రూట్ సలాడ్ ఇష్టమైతే, రసగుల్లా పాకాన్ని అందులో కలుపుకోవచ్చు. దీనివల్ల అదనంగా పంచదార వేయాల్సిన పని ఉండదు, రుచి కూడా పెరుగుతుంది. పాకాన్ని ఫ్రిజ్‌లో పెట్టి చల్లగా అయ్యాకే వాడాలని గుర్తుంచుకోండి.