Cancer Fighting Fruits: ఈ మధ్య కాలంలో దేశంలో క్యాన్సర్ కేసులు క్రమంగా పెరుగుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే, క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకునే శక్తి మనకు ప్రకృతిలో దొరికే కొన్ని పండ్లలో ఉంది. ఆ 6 సూపర్ ఫ్రూట్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
ఇవి తింటే క్యాన్సర్ పారిపోవాల్సిందే.. ఆ సిక్స్ సూపర్ ఫ్రూట్స్ ఏంటో తెలుసా?
ఈ రోజుల్లో హెల్త్ పట్ల కేర్ తీసుకోవడం చాలా అవసరం అయిపోయింది. లైఫ్‌స్టైల్ మారడం, పొల్యూషన్ పెరగడం వల్ల రకరకాల హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నాం. వాటన్నింటిలో అత్యంత ప్రమాదకరమైనది క్యాన్సర్. అయితే, మన డైలీ డైట్ లో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా ఈ మహమ్మారి బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు.
ప్రకృతి మనకు ప్రసాదించిన కొన్ని రకాల పండ్లలో క్యాన్సర్ కణాలతో పోరాడే అద్భుతమైన గుణాలు ఉన్నాయి. వాటిని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల క్యాన్సర్ రిస్క్‌ను చాలా వరకు తగ్గించుకోవచ్చు. ఆ పండ్లు ఏంటో, వాటి వల్ల కలిగే లాభాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
26
మామిడి పండ్లతో యాంటీ ఆక్సిడెంట్ల పవర్
పండ్లలో రా రారాజు అయిన మామిడి పండు కేవలం టేస్ట్ మాత్రమే కాదు, హెల్త్‌కు కూడా ఎంతో మేలు చేస్తుంది. మామిడి పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు చాలా ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి మన బాడీలోని ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి, కణాలు డ్యామేజ్ కాకుండా కాపాడుతాయి. క్యాన్సర్ కణాలు వృద్ధి చెందకుండా అడ్డుకోవడంలో ఈ యాంటీ ఆక్సిడెంట్లు కీలక పాత్ర పోషిస్తాయి. అందుకే సీజన్ వచ్చినప్పుడు మామిడి పండ్లను అస్సలు మిస్ అవ్వద్దు.
36
నేరేడు పండ్ల యాంటీ ప్రొలిఫెరేటివ్ గుణాలు
చిన్నగా, నల్లగా కనిపించే నేరేడు పండ్లలో బోలెడన్ని ఔషధ గుణాలు దాగున్నాయి. ముఖ్యంగా వీటిలో యాంటీ ప్రొలిఫెరేటివ్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఇవి శరీరంలో క్యాన్సర్ కణాలు అసాధారణంగా పెరగడాన్ని, ఒక చోట నుండి మరోచోటికి వ్యాపించడాన్ని సమర్థంగా నిరోధిస్తాయి. టేస్టీగా ఉండే ఈ నేరేడు పండ్లను తినడం వల్ల బాడీకి మంచి డిఫెన్స్ సిస్టమ్ దొరుకుతుంది.
ఆరోగ్యానికి ఉసిరి చేసే మేలు అంతా ఇంతా కాదు. ఇందులో విటమిన్-సి తో పాటు శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి బాడీ ఇమ్యూనిటీని పెంచడమే కాకుండా, క్యాన్సర్ కారకాలతో పోరాడుతాయి. అలాగే మారేడు పండు (బేల్ ఫ్రూట్) కూడా క్యాన్సర్‌ను నివారించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. శరీరంలోని టాక్సిన్స్‌ను తొలగించి, కణాల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో మారేడు పండులోని పోషకాలు తోడ్పడతాయి.
56
పనస పండులోని క్యాన్సర్ నిరోధక సీక్రెట్స్
చాలా మంది పనస పండును తినడానికి అంతగా ఇష్టపడరు. కానీ, దీని వల్ల కలిగే హెల్త్ బెనిఫిట్స్ తెలిస్తే అస్సలు వదలరు. పనస పండులో క్యాన్సర్ రాకుండా నిరోధించే ప్రత్యేక పోషకాలు, ఫైటోన్యూట్రియెంట్స్ ఉంటాయి. ఇవి జీర్ణవ్యవస్థను క్లీన్‌గా ఉంచడంతో పాటు, శరీరంలో ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గించి క్యాన్సర్ వచ్చే అవకాశాలను తగ్గిస్తాయి.
66
రేగుపండ్లతో బాడీకి ఫుల్ ఎనర్జీ అండ్ సేఫ్టీ
చిన్నప్పుడు మనమందరం ఎంతో ఇష్టంగా తిన్న రేగుపండ్లు కూడా క్యాన్సర్ నివారణలో బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. వీటిలో ఉండే ప్రత్యేక కాంపౌండ్స్ బాడీలోని హానికరమైన కణాలను నాశనం చేయడానికి హెల్ప్ చేస్తాయి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ఈ నేచురల్ ఫ్రూట్స్‌ను మీ డైలీ స్నాక్స్‌లో భాగంగా చేసుకుంటే క్యాన్సర్ మహమ్మారికి దూరంగా ఉండవచ్చు. కాబట్టి, లేట్ ఈ సూపర్ ఫ్రూట్స్‌ని మీ ఆహారంలో భాగం చేసుకోండి.