రెసిపీ చూద్దాం.
పాన్‌లో నూనె వేసి ఎండుమిర్చి, వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. తర్వాత టమాటా ముక్కలు, చింతపండు వేసి మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి.
చల్లారిన తర్వాత ఉప్పు వేసి మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేయాలి. మరో పాన్‌లో కొద్దిగా నూనె వేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకుతో తాలింపు చేసి చట్నీలో కలపాలి. అంతే టమాట చట్నీ రెడీ.