Milk Storage: ఇంట్లో చాలాసార్లు పాలు మురిగించిన వెంటనే ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తుంటారు. అయితే ఇది సరైన పద్ధతి కాదు. వేడి పాలను నేరుగా ఫ్రిడ్జ్‌లో పెట్టడం వల్ల కొన్ని సమస్యలు వస్తాయి. ఆ సమస్యలు ఆరోగ్యానికి, అలాగే ఫ్రిడ్జ్ పనితీరుకూ ప్రభావం చూపుతాయి.
చాలా మందికి పాలు మరిగించిన వెంటనే వాటిని ఫ్రిడ్జ్‌లో పెట్టేయడం అలవాటు. అలా చేస్తే త్వరగా చల్లారిపోతాయని ఇలా చేస్తారు. కానీ వాస్తవానికి వేడి పాలను నేరుగా ఫ్రిడ్జ్‌లో పెట్టడం మంచిది కాదు. ఇది పాల నాణ్యతపైనే కాదు, ఫ్రిడ్జ్ పనితీరుపై కూడా ప్రభావం చూపుతుంది.
25
ఇతర ఆహార పదార్థాలపై ప్రభావం
మొదటగా, వేడి పాలను నేరుగా ఫ్రిడ్జ్‌లో పెట్టితే ఫ్రిడ్జ్‌లోని లోపలి ఉష్ణోగ్రత ఒక్కసారిగా పెరుగుతుంది. ఫ్రిడ్జ్‌లో సాధారణంగా 2 నుంచి 5 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రత ఉంటుంది. కానీ వేడి పాలు పెట్టినప్పుడు లోపలి చల్లదనం తగ్గిపోతుంది. దాంతో ఫ్రిడ్జ్‌లో ఉన్న ఇతర ఆహార పదార్థాలపై కూడా ప్రభావం పడుతుంది. అవి త్వరగా పాడయ్యే అవకాశం ఉంటుంది.
35
ఆవిరి నీరు పాలలో కలిసి త్వరగా పాడయ్యే అవకాశం
రెండవది, వేడి పాలను మూత పెట్టి ఫ్రిడ్జ్‌లో పెట్టినప్పుడు ఆ పాత్రలో ఆవిరి ఏర్పడుతుంది. ఆ ఆవిరి చల్లబడిన తర్వాత నీటి బిందువులుగా మారుతుంది. ఇది పాలలో నీరు కలిసినట్టుగా మార్పు తీసుకురావచ్చు. దాంతో పాల రుచి కొద్దిగా మారుతుంది. కొన్ని సందర్భాల్లో పాలు త్వరగా పాడయ్యే అవకాశమూ ఉంటుంది. ముఖ్యంగా వేసవిలో ఇది ఎక్కువగా గమనించవచ్చు.
మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, వేడి ఆహారాన్ని నేరుగా ఫ్రిడ్జ్‌లో పెట్టడం వల్ల ఫ్రిడ్జ్ కాంప్రెసర్ ఎక్కువగా పనిచేయాల్సి వస్తుంది. దీని వల్ల విద్యుత్ వినియోగం పెరుగుతుంది. చివరకు అలాగే ఫ్రిడ్జ్ పనితీరు కూడా దెబ్బతింటుంది.
55
గది ఉష్ణోగ్రత వద్ద చల్లార్చాలి
అయితే పాలను బయట ఎక్కువసేపు ఉంచడం కూడా మంచిది కాదు. ముఖ్యంగా వేసవిలో గది ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నప్పుడు బ్యాక్టీరియా వేగంగా చేరుతుంది. కాబట్టి పాలను మరిగించిన తర్వాత గది ఉష్ణోగ్రతకు వచ్చే వరకు కొంతసేపు బయటే ఉంచాలి. పూర్తిగా చల్లారాక ఫ్రిడ్జ్‌లో పెట్టాలి. వేగంగా చల్లార్చాలనుకుంటే పాల గిన్నెను చల్లని నీళ్లలో కాసేపు ఉంచితే చల్లగా అయిపోతాయి.
ఒక్కమాటలో చెప్పాలంటే వేడి పాలను నేరుగా ఫ్రిడ్జ్‌లో పెట్టడం వల్ల ఫ్రిడ్జ్‌లోని ఇతర పదార్థాలు పాడవుతాయి. విద్యుత్ వినియోగం పెరుగుతుంది. పాలు విరిగిపోవడం, విషపూరితం అవ్వడం వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి కొద్దిసేపు చల్లారనిచ్చి తర్వాత ఫ్రిడ్జ్‌లో పెట్టడం చాలా ఉత్తమం. ఇది ఆరోగ్యానికి మంచిదే కాకుండా, మీ ఫ్రిడ్జ్ పాడవకుండా చూస్తుంది.