Biryani vs Pulao: బిర్యానీ, పులావ్ అనే పేర్లు వింటే చాలా మంది ఇవి దాదాపు ఒకే రకమైన వంటకాలు అనుకుంటారు. కానీ వాస్తవానికి బిర్యానీ, పులావ్ మధ్య తయారీ విధానం నుంచి రుచి వరకు ఎన్నో తేడాలు ఉన్నాయి. ఇంతకీ ఆ తేడాలేంటో తెలుసా.?
చాలా మందికి పులావ్ అంటే వెజిటేరియన్, బిర్యానీ అంటే నాన్‌వెజ్ అనే అభిప్రాయం ఉంటుంది. కానీ అది సరైనది కాదు. పులావ్, బిర్యానీ రెండూ వెజ్, నాన్‌వెజ్ రూపాల్లో లభిస్తాయి. రెండింటిలోనూ బియ్యం, మసాలాలు, కూరగాయలు లేదా మాంసం ఉపయోగిస్తారు. అయితే వాటి తయారీ విధానం, మసాలాల వినియోగం, రుచి, వడ్డించే తీరు పూర్తిగా భిన్నంగా ఉంటాయి. అందుకే బిర్యానీని పులావ్‌తో పోల్చడం కంటే రెండింటి ప్రత్యేకతలను అర్థం చేసుకోవడం మంచిది.
26
పులావ్ తయారీ విధానం చాలా సులభం
పులావ్ తయారీలో సాధారణంగా బియ్యం, కూరగాయలు లేదా మాంసం, మసాలాలు అన్నింటినీ ఒకేసారి ఒకే పాత్రలో వేస్తారు. తర్వాత నీరు పోసి ఉడికిస్తారు. దీనిని "అబ్జార్ప్షన్ మెథడ్" అంటారు. అంటే వంట సమయంలో నీరు పూర్తిగా పదార్థాల్లో కలిసిపోతుంది. ఈ ప్రక్రియ తక్కువ సమయంలో పూర్తవుతుంది. మసాలాల వినియోగం కూడా పరిమితంగానే ఉంటుంది. అందువల్ల పులావ్ రుచి తేలికగా, సింపుల్‌గా ఉంటుంది. చాలా ప్రాంతాల్లో దీనిని కర్రీలు, దాల్ లేదా ఇతర సైడ్ డిష్‌లతో కలిపి తింటారు.
36
బిర్యానీ తయారీ ఒక కళలాంటిది
బిర్యానీ తయారీ మాత్రం చాలా క్లిష్టమైన ప్రక్రియ. ఇందులో ముందుగా బియ్యాన్ని కొంతవరకు ఉడికిస్తారు. అలాగే మాంసం లేదా కూరగాయలను మసాలాలతో వేరు వేరు సిద్ధం చేస్తారు. ఆ తర్వాత ప్రత్యేక పాత్రలో పొరలుగా అమర్చి వంట చేస్తారు. కింద బియ్యం, మధ్యలో మాంసం లేదా కూరగాయలు, పైభాగంలో మళ్లీ బియ్యం వేసి, వేయించిన ఉల్లిపాయలు, నెయ్యి, మసాలాలు కలుపుతారు. అనంతరం పాత్రను మూసివేసి తక్కువ మంటపై ఉడికిస్తారు. ఈ విధానాన్ని "దమ్ కుకింగ్" అని పిలుస్తారు. అందుకే బిర్యానీ తయారికి ఎక్కువ సమయం పడుతుంది.
బిర్యానీకి ప్రత్యేకమైన రుచి, సువాసన రావడానికి ఎన్నో రకాల మసాలాలు ఉపయోగిస్తారు. యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకులు, కొత్తిమీర, పుదీనా, డ్రై ఫ్రూట్స్ వంటి పదార్థాలు బిర్యానీని మరింత రుచికరంగా మారుస్తాయి. పులావ్‌లో మాత్రం మసాలాల వినియోగం తక్కువగా ఉంటుంది. అందువల్ల పులావ్ రుచి సున్నితంగా ఉంటే, బిర్యానీ ఘాటు, ఘుమఘుమలాడే సువాసనతో ఆకట్టుకుంటుంది.
56
మూలాలు, వడ్డించే విధానంలోనూ తేడా
చారిత్రకారుల అభిప్రాయం ప్రకారం బిర్యానీ మూలాలు పర్షియాలో ఉన్నాయి. "బిరియన్" అనే పర్షియన్ పదం నుంచి బిర్యానీ అనే పేరు వచ్చిందని చెబుతారు. మరోవైపు పులావ్ మధ్య ఆసియా ప్రాంతాల్లో పుట్టి తర్వాత ప్రపంచంలోని అనేక దేశాలకు విస్తరించింది. వడ్డించే విధానంలో కూడా తేడా ఉంది. పులావ్‌ను సాధారణంగా ఒక సైడ్ డిష్‌గా లేదా కర్రీతో కలిసి వడ్డిస్తారు. కానీ బిర్యానీ మాత్రం పూర్తి భోజనంగా భావిస్తారు. దీనికి రాయితా, సలాడ్, చట్నీ వంటి వాటిని మాత్రమే జత చేస్తారు.
66
బిర్యానీ, పులావ్ రెండింటికీ ప్రత్యేక స్థానం
బిర్యానీ, పులావ్ రెండూ రుచికరమైన వంటకాలే. కానీ ఇవి ఒకటే కాదు. పులావ్ సరళమైన వంటకం అయితే, బిర్యానీ మసాలాలు, పొరలు, దమ్ కుకింగ్‌తో తయారయ్యే ప్రత్యేక వంటకం. అందుకే బిర్యానీ అభిమానులు అసలైన బిర్యానీ రుచిని పులావ్‌తో పోల్చలేమని చెబుతుంటారు. తర్వాత ఎప్పుడైనా మీరు పులావ్ లేదా బిర్యానీ ఆర్డర్ చేసే ముందు ఈ తేడాలను గుర్తుంచుకోండి.