Iron లోపం ఉంటే జుట్టు రాలే సమస్య పెరుగుతుంది. పాలకూర, బీట్‌రూట్, పప్పులు, కందులు వంటి ఆహారాలు ఐరెన్ అందిస్తాయి. అలాగే జింక్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా జుట్టు ఆరోగ్యానికి అవసరం. చేపలు, ఆక్రోట్లు, ఫ్లాక్స్ సీడ్స్ వంటి వాటిలో ఇవి ఉంటాయి.
జుట్టు ఆరోగ్యం కోసం ప్యాక్స్ , సప్లిమెంటరీలు తీసుకోవాల్సిన అవసరం లేదు. సమతుల్య ఆహారం, తగినంత నీరు, సరైన నిద్ర ఇవన్నీ కలిసి పనిచేస్తాయి. పైపై మెరుగులు కంటే శరీరం లోపలి పోషకాలు ముఖ్యం. కాబట్టి ప్రతిరోజూ సరైన విటమిన్లు, ప్రోటీన్ ఉన్న ఆహారం తీసుకుంటే మీ జుట్టు సహజంగా పొడవుగా, ఆరోగ్యంగా మారుతుంది.