Fridge Organization Tips: ఫ్రిడ్జ్ లో స్టోర్ చేయకూడని ఫ్రూట్స్, వెజిటెబుల్స్..

Published : Mar 03, 2026, 03:37 PM IST

Fridge Organization Tips: ఫుడ్ ను తాజాగా ఉంచేందుకు ఫ్రిడ్జ్ ఉపయోగపడుతుందని అందరికీ తెలుసు. అలా అని దొరికిన ప్రతీది పెట్టేస్తే దాని సహజ గుణం, రుచి పాడవుతుంది. ఒక్కోసారి విషతుల్యం అయ్యే ఛాన్స్ ఉంది. ఫ్రిడ్జ్ లో పెట్టకూడని ఫ్రూట్స్, వెజిటెబుల్స్ ఏంటి? 

PREV
16
ఫ్రిడ్జ్ లో ఏ ఏ ఫుడ్ పెట్టాలి? ఏ ఫుడ్ పెట్టకూడదు?

ఫ్రిడ్జ్ ఏమీ డస్ట్ బిన్ కాదు..దొరికింది ప్రతీది పెట్టడానికి. అవసరమైనవే పెట్టుకోవం చాలా ఉత్తమం. ఇంకా ఫ్రిడ్జ్ లో ఫుడ్ పెట్టకపోవడమే మంచిది. కానీ అందరికీ అలవాటు అయిపోయింది కాబట్టి దాన్ని మార్చడం ఇప్పుడు కష్టమే.ప్రతి పండు, ప్రతి కూరగాయను ఫ్రిడ్జ్‌లో పెట్టడం మంచిదని భావించడం తప్పు. కొన్ని ఫ్రూట్స్, వెజిటెబుల్స్ కూలింగ్ టెంపరేచర్ లో తన సహజ రుచి, గుణాలు కోల్పోతాయి. మరికొన్ని త్వరగా పాడైపోతాయి కూడా. ఫ్రిడ్జ్ లో ఏ ఏ ఫుడ్ పెట్టాలి? ఏ ఫుడ్ పెట్టకూడదనేది తెలుసుకోవాలి.

26
అరటిపండ్లు నల్లగా అయిపోతాయి

అరటిపండ్లు చల్లని వాతావరణంలో త్వరగా నల్లగా అయిపోతాయి. ఫ్రిడ్జ్‌లో పెడితే వాటి తొక్క నల్లబడుతుంది, లోపలి భాగం కూడా మెత్తగా మారుతుంది. అందుకే అరటిపండ్లను గది ఉష్ణోగ్రతలోనే ఉంచాలి.

36
కూలింగ్ వల్ల టమోటాలు రుచిని కోల్పోతాయి

టమోటాలు కూడా ఫ్రిడ్జ్‌లో పెట్టకూడదు. చల్లదనం వల్ల టమోటాల రుచి తగ్గిపోతుంది. అవి లోపల గట్టిగా ముద్దలా మారే అవకాశం ఉంది. టమోటాలను గది ఉష్ణోగ్రతలో ఉంచితేనే సహజ రుచి, టెక్స్చర్ కాపాడుతుంది.

46
ఆలూలోని కార్బోహైడ్రేట్లు చక్కెరగా మారిపోతాయి

బంగాళాదుంపలు ఫ్రిడ్జ్‌లో పెట్టడం వల్ల వాటిలోని కార్బోహైడ్రేట్లు చక్కెరగా మారుతాయి. దీని వల్ల వండినప్పుడు రుచి మారుతుంది. అలాగే ఉల్లిపాయలు కూడా ఫ్రిడ్జ్‌లో తేమ కారణంగా పాడవుతాయి. వాటిని గాలి తగిలే ప్రదేశంలో నిల్వ చేయడం మంచిది.

56
వెల్లుల్లి మొలకెత్తే అవకాశం

వెల్లుల్లి కూడా ఫ్రిడ్జ్‌లో పెట్టకూడదు. చల్లని వాతావరణంలో అది మొలకెత్తే అవకాశం ఉంటుంది. అలాగే గుమ్మడికాయ, దోసకాయ వంటి కొన్ని కూరగాయలు ఎక్కువ చల్లదనంలో మెత్తబడిపోతాయి.

66
కట్ చేశాకే ఫ్రిడ్జ్ లో పెట్టాలి

పుచ్చకాయను కోయకముందు ఫ్రిడ్జ్‌లో పెట్టడం అవసరం లేదు. కోసిన తర్వాత మాత్రం ఫ్రిడ్జ్‌లో ఉంచాలి. అలాగే మామిడి పండ్లు పండే వరకు బయటే ఉంచాలి. పండిన తర్వాత మాత్రమే ఫ్రిడ్జ్‌లో పెట్టాలి.

ప్రతి ఆహార పదార్థానికి నిల్వచేసే విధానం ఉంటుంది. అలా చేయకపోతే రుచి, పోషకాలు తగ్గిపోతాయి. కాబట్టి ఫ్రిడ్జ్‌లో పెట్టే ముందు మంచిదో, కాదో తెలుసుకోండి. సరైన విధంగా నిల్వ చేస్తే ఆహారం ఎక్కువకాలం తాజాగా ఉంటుంది, వృథా తగ్గుతుంది, ఆరోగ్యం కాపాడుతుంది.

Read more Photos on
click me!

Recommended Stories