Cucumber: కీరదోస ను వీటితో మాత్రం కలిపి తినకూడదు, ఎందుకో తెలుసా?

వేసవిలో కీీరదోస తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ, కొన్ని ఆహార పదార్థాలతో కలిపి మాత్రం అస్సలు తినకూడదట. మరి, వేటితో కలిపి తినకూడదో తెలుసుకుందాం..

Best and Worst Foods to Eat with Cucumber for Health in telugu ram

Foods Not To Eat With Cucumber : ఎండాకాలం మొదలైపోయింది కాబట్టి రోజురోజుకు వేడి ఎక్కువ అవుతోంది. కాబట్టి వేడిని తట్టుకోవడానికి నీరు ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలు మీ డైట్‌లో చేర్చుకోండి. అలా మీరు ఎండాకాలంలో ఎక్కువగా తినాల్సిన వాటిలో ఒకటి కీర దోసకాయ. ఇందులో నీటి శాతం ఎక్కువ కాబట్టి శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది. దీన్ని మీరు పచ్చిగా లేదా సలాడ్‌లో వేసుకొని తినొచ్చు. కానీ  కీరదోసకాయని కొన్ని ఆహారాలతో కలిపి తినడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. తింటే జీర్ణ సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు కీరదోసకాయని ఏయే ఆహారాలతో కలిపి తినకూడదో  తెలుసుకుందాం.

Best and Worst Foods to Eat with Cucumber for Health in telugu ram

పెరుగు

కీీరదోసకాయని పెరుగుతో కలిపి తినడం మంచిది కాదు. ఎందుకంటే ఈ రెండింటి జీర్ణమయ్యే విధానం వేరుగా ఉంటుంది. అంటే దోసకాయలో నీళ్లు ఎక్కువగా ఉండటం వల్ల త్వరగా జీర్ణమవుతుంది. అదే పెరుగులో ప్రోటీన్, కొవ్వులు ఉండటం వల్ల జీర్ణం కావడానికి కాస్త సమయం పడుతుంది. ఇది కాకుండా కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి కడుపు సమస్యలు వస్తాయి. ఇంకా శరీర ఉష్ణోగ్రతలో తేడాలు వస్తాయి.


సిట్రస్ పండ్లు

కీరదోసకాయ, సిట్రస్ పండ్లు కలిపి తినడం మంచిది కాదు. అంటే నిమ్మ, నారింజ, ద్రాక్ష వంటి సిట్రస్ పండ్లు పుల్లగా ఉంటాయి. అదే సమయంలో కీరదోసకాయ చల్లగా ఉంటుంది. కాబట్టి ఈ రెండు కలిస్తే జీర్ణక్రియలో గందరగోళం ఏర్పడుతుంది. దీనివల్ల గుండెల్లో మంట, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి.

టమాట..

టమోటాతో కీరదోసకాయని ఎప్పుడూ కలిపి తినకూడదు. ఎందుకంటే ఈ రెండూ జీర్ణమయ్యే విధానం వేరుగా ఉంటుంది. అంటే కీరదోసకాయ త్వరగా జీర్ణమవుతుంది. టమోటాలో ఆమ్లం, విత్తనాలు ఉండటం వల్ల జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. కాబట్టి ఈ రెండింటినీ కలిపి తింటే ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలు వస్తాయి.

ముల్లంగి..

దోసకాయతో ముల్లంగిని ఎప్పుడూ కలిపి తినకూడదు. అది ఆరోగ్యానికి మంచిది కాదు. ఈ రెండింటినీ కలిపి తింటే శరీరంలో విటమిన్ సి స్థాయిని తగ్గిస్తుంది. ఇది కాకుండా కడుపులో అసౌకర్యంగా ఉంటుంది.

మాంసం:

దోసకాయతో మాంసం తినకూడదు. ఎందుకంటే మాంసంలో ప్రోటీన్లు, కొవ్వులు ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఇంకా మాంసంలో ఆమ్లత్వం ఉంటుంది. మరోవైపు దోసకాయ తేలికగా, త్వరగా జీర్ణమవుతుంది. కాబట్టి ఈ రెండింటినీ కలిపి తింటే కడుపు నొప్పి, జీర్ణ సమస్యలు వస్తాయి.

Latest Videos

vuukle one pixel image
click me!