అల్లం, పుదీనా వాటర్ ను పరిగడుపున తాగితే ఈ సమస్యలన్నీ తగ్గిపోతాయ్

Published : Aug 27, 2025, 11:04 AM IST

అల్లం, పుదీనా రెండింటిలో మన ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ రెండిటినీ తీసుకోవడం వల్ల మనం ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి బయటపడతాం తెలుసా? 

PREV
16
పుదీనా అల్లం వాటర్

పుదీనా, అల్లం రెండింటినీ మనం ప్రతి కూరలో వేస్తాం. ఎందుకంటే ఇవి కూరలను టేస్టీగా చేస్తాయి. అలాగే కమ్మని వాసన వచ్చేలా చేస్తాయి. ఇంతేకాదు వీటిలో ఎన్నో ఔషదగుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మనల్ని దగ్గు, జలుబు, వాతం వంటి ఎన్నో చిన్నచిన్న అనారోగ్య సమస్యలను తగ్గించడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. 

ముఖ్యంగా అలసటను పోగొట్టడానికి, జీర్ణ వ్యవస్థను మెరుగుపర్చడానికి, కాలెయంలో విషాన్ని తొలగించడానికి ఈ అల్లం పుదీనా బాగా సహాయపడతాయి. అయితే ఇందుకోసం పుదీనా, అల్లంతో డ్రింక్ ను తయారుచేసి తాగాలి. దీన్ని ఎలా తయారుచేయాలి? దీన్ని తాగడం వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

26
అల్లం, పుదీనా ప్రయోజనాలు

పుదీనా, అల్లం రెండింటిలో ఎన్నో ఔషదగుణాలుంటాయి. అయితే ఈ రెండు కలిసినప్పుడు ఈ రెండింటి ప్రయోజనాలు మరింత పెరుగుతాయని నిపుణులు అంటున్నారు.

అల్లం ప్రయోజనాలు

అల్లంలో షోగాల్, జింజెరోల్ వంటి బయోయాక్టీవ్ సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన కాలెయాన్ని దెబ్బతినకుండా రక్షిస్తాయి. అలాగే కాలెయంలో మంటను తగ్గించడానికి సహాయపడతాయి. అంతేకాదు ఇది అల్సర్లను తగ్గించడానికి, జీర్ణక్రియను మెరుగుపర్చడానికి సహాయపడుతుంది. అలాగే కడుపు ఉబ్బరాన్ని తగ్గించే ఎంజైమ్లు అల్లంలో మెండుగా ఉంటాయి. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరాన్ని నిర్విషీకరణ చేస్తాయి.

36
పుదీనా ప్రయోజనాలు

పుదీనాలో మెంతోల్ ఉంటుంది. ఇది మన జీర్ణవ్యవస్థకు ఎంతగానో సహాయపడుతుంది. ఇది కాలెయాన్ని శుభ్రపరుస్తుంది. అలాగే కొవ్వును విచ్ఛిన్నం చేయడానికి, పిత్త ఉత్పత్తిని పెంచడానికి బాగా సహాయపడుతుంది. పుదీనా నోటి దుర్వాసనను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. అలాగే ఒత్తిడిని తగ్గిస్తుంది. అంతేకాదు ఇది జీర్ణక్రియను మెరుగుపర్చడానికి కూడా బాగా సహాయపడుతుంది.

46
అల్లం, పుదీనా వాటర్ ప్రయోజనాలు

అల్లం, పుదీనా నీళ్లను రెగ్యులర్ గా పరిగడుపున తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అవేంటంటే?

జీర్ణక్రియకు సహాయపడుతుంది

అల్లంలో ఉండే జింజెరాల్ పిత్త ఉత్పత్తిని పెంచుతుంది. దీంతో జీర్ణక్రియ మెరుగ్గా పనిచేస్తుంది. అలాగే కడుపు నొప్పి, గ్యాస్, అజీర్ణం వంటి జీర్ణ సమస్యలను తగ్గించడంలో ఈ డ్రింక్ చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది.

మెరుగైన జీవక్రియ

అల్లంలో థర్మోజెనిక్ లక్షణాలు మెండుగా ఉంటాయి. ఇవి జీవక్రియను పెంచడానికి సహాయపడతాయి. దీంతో మీ శరీరంలో కేలరీలు ఎక్కువగా బర్న్ అవుతాయి. దీంతో మీరు సులువుగా బరువు తగ్గుతారు. మీరు అల్లం, పుదీనా వాటర్ ను పరిగడుపున తాగితే మీ బరువు పెరిగే అవకాశం తగ్గుతుంది.

శోథ నిరోధక లక్షణాలు

పుదీనా, అల్లం రెండింటిలో శోథ నిరోధక లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు వంటి ఆర్థరైటిస్ సమస్యలను తగ్గించడానికి సహాయపడతాయి. అలాగే శరీరంలో మంటను తగ్గిస్తాయి. అంతేకాదు ఇవి మన మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపర్చడానికి సహాయపడతాయి.

56
ఇమ్యూనిటీ పవర్

పుదీనా, అల్లంలో మనల్ని ఆరోగ్యంగా ఉంచే విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజాలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి మన ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతాయి. దీంతో మన శరీరం ఇన్ఫెక్షన్లతో, వ్యాధులతో సమర్థవంతంగా పోరాడుతుంది. ఇమ్యూనిటీ వల్ల మనం ఎన్నో చిన్న చిన్న అనారోగ్య సమస్యలకు దూరంగా ఉంటాం.

హైడ్రేషన్

పుదీనా, అల్లం నీటిని తాగడం వల్ల మన శరీరం హైడ్రేట్ గా ఉంటుంది. దీనిలో కేలరీలు, చక్కెరలు ఉండవు. కాబట్టి వీటిని తాగితే ఆరోగ్యం బేషుగ్గా ఉంటుంది. మన శరీరం ఎంత హైడ్రేట్ గా ఉంటే మనం అంత హెల్తీగా ఉంటాం.

కాలేయ ప్రక్షాళన

పుదీనా, అల్లం నీళ్లు మన కాలెయంలో పేరుకుపోయిన మురికి, విషాన్ని బయటకు పంపడానికి సహాయపడుతుంది. అలాగే ఇది ఫ్యాటీ లివర్ సమస్యను తగ్గించడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది.

66
అల్లం-పుదీనా వాటర్ ను ఎలా తయారుచేయాలి?

కావాల్సిన పదార్థాలు తురిమిన చిన్న అంగుళం అల్లం ముక్క, ఒక గ్లాస్ వాటర్, 10-15 తాజా పుదీనా ఆకులు, చిటికెడు నల్ల ఉప్పు, 1/2 నిమ్మకాయ రసం

తయారుచేసే విధానం

ఈ వాటర్ ను తయారుచేయడానికి ఒక గిన్నె తీసుకోండి. ఇందులో నీళ్లు పోసి పుదీనా ఆకులు, అల్లం ముక్కను వేసి స్టవ్ పై పెట్టండి. ఈ వాటర్ సగం అయ్యాక స్టవ్ ను ఆపేయండి. దీన్ని వడకట్టి తాగండి. కావాలనుకుంటే మీరు దీంట్లో నిమ్మరసం, ఉప్పును కలుపుకుని తాగొచ్చు. అయితే దీన్ని మీరు ఉదయాన్నే పరిగడుపున తాగితే మంచి ఫలితాలను పొందుతారు.

Read more Photos on
click me!

Recommended Stories