తమిళనాడులోని సాంప్రదాయ కళలకు పేరుగాంచిన తంజావూరు, రుచికరమైన వంటకాలకు కూడా ఫేమస్. అలాంటి ప్రత్యేకమైన వంటకాల్లో ఒకటి కొబ్బరి శోధి ఒకటి. ఈ ప్రత్యేకమైన వంటకాన్ని ఆ ప్రాంత ప్రజలు బాగా ఇష్టపడతారు.
పులుసు, రసం వంటి సాధారణ వంటకాల కంటే ఇది చాలా రుచికరంగా ఉంటుంది. కొబ్బరి పాలు, పచ్చి మసాలా దినుసులు కలపడం వల్ల అద్భుతమైన వాసన వస్తుంది.
కావలసిన పదార్థాలు:
కొబ్బరిపాలు: 1 కప్పు (గట్టిగా), వేడి నీరు – 1 1/2 కప్పులు, మునగకాయ – 1 (తరిగినది), చిన్న ఉల్లిపాయలు – 10 (నలిపినవి), పచ్చిమిర్చి – 3, అల్లం – 1 అంగుళం ముక్క, బంగాళదుంప - 1, క్యారెట్ - 1, బీన్స్ - 5-6, ముసూరిపప్పు లేదా తూర్ దాల్ - ¼ కప్పు, వెల్లుల్లి - 2 రెబ్బలు (ఒకటి ముద్దగా, మరొకటి చిన్న ముక్కలుగా), పసుపు - ¼ చెంచా, ఉప్పు - రుచికి తగినంత, నువ్వుల నూనె లేదా సాధారణ నూనె - 1 టేబుల్ స్పూన్, కరివేపాకు - 1 రెబ్బ, కరివేపాకు, మిరియాలు, జీలకర్ర, కాస్తా మెంతులు (తాలింపు కోసం), నిమ్మరసం - 1 టీస్పూన్
తయారీ విధానం:
ముసూరిపప్పును 1 కప్పు నీటితో కుక్కర్‌లో ఉడికించి మెత్తగా మష్ చేయాలి. తరిగిన బంగాళదుంప, క్యారెట్, బీన్స్‌ను 1 కప్పు నీటితో పసుపు, ఉప్పు వేసి 5-7 నిమిషాలు మగ్గించాలి. తర్వాత పాన్‌లో నూనె వేడి చేసి, కరివేపాకు, మిరియాలు, జీలకర్ర, మెంతులు వేసి వేయించాలి. ఇప్పుడు ఉల్లిపాయ, అల్లం, వెల్లుల్లి వేసి వేయించాలి. ఉడికించిన కూరగాయలు, మాష్ చేసిన పప్పు వేసి కలపాలి. గట్టిగా చేసిన కొబ్బరిపాలు జోడించి, మిశ్రమాన్ని మరికొద్దిసేపు మరిగించాలి. చివరిగా గట్టిగా చేసిన కొబ్బరిపాలు, నిమ్మరసం వేసి, స్టౌ ఆఫ్ చేయాలి.
కొబ్బరి శోధి వడ్డించే విధానాలు:
అన్నంతో వేడిగా వడ్డించవచ్చు. దోశ, ఇడ్లీ వంటి వాటితో కలిపి తినవచ్చు. కొద్దిగా నిమ్మరసం కలిపితే వాసన, రుచి పెరుగుతుంది.
ఆరోగ్య ప్రయోజనాలు:
కొబ్బరి పాలు మంచి కొవ్వు, ఫాస్పరస్ ను అందిస్తాయి. పెసర పప్పు, జీర్ణక్రియకు మంచిది. పసుపు, రోగనిరోధక శక్తిని పెంచుతుంది. మునగకాయ, ఇనుము అధికంగా ఉండటం వల్ల ఆరోగ్యానికి మంచిది.