Tea and Pakoda: వర్షం పడుతున్నప్పుడు వేడి వేడి టీతో పాటు కరకరలాడే పకోడీ తినడానికి చాలా మంది ఇష్టపడుతారు. ఈ కాంబినేషన్ సూపర్ గా ఉన్నా.. ఆరోగ్యానికి మాత్రం మంచిది కాదట. ఇంతకీ టీతో పకోడి తింటే ఏమౌతుంది ? అనే విషయాలు తెలుసుకుందాం.
వర్షాకాలంలో వేడి వేడి టీతో పాటు కరకరలాడే పకోడీలు, బజ్జీలు తింటుంటే.. ఆ ఆనందమే వేరు. పకోడీలను చాయ్‌తో కలిసి తింటే.. అవి మరింత రుచిగా ఉంటాయి. చిన్నపిల్లల నుంచి పెద్దవారిదాకా అందరికీ ఈ కాంబినేషన్ ను ఇష్టపడుతారు. దీని క్రిస్పీ స్వభావం, రుచికరమైన మసాలా సువాసన వల్ల ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది. అయితే.. ఇవి ఎక్కువగా తీసుకుంటే జీర్ణ సమస్యలు వస్తాయట. వర్షాకాలంలో టీ, పకోడీ ఎక్కువగా తింటే ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం ఉంటుందో తెలుసుకుందాం..
26
జీర్ణ సమస్యలు
వర్షాకాలంలో ఎక్కువగా టీ తాగడం వల్ల డీహైడ్రేట్ రావొచ్చు. ఎందుకంటే టీలో ఉండే కెఫీన్ నీటి శాతాన్ని తగ్గిస్తుంది. ఖాళీ కడుపుతో టీ తాగడం ఆమ్లతను పెంచి జీర్ణ సమస్యలకు దారితీస్తుంది, వర్షాకాలంలో ఇది మరింత సమస్యకరంగా మారవచ్చు.
36
ట్రాన్స్ ఫ్యాట్ పెరుగుతుంది
వర్షాకాలంలో బోండా, పకోడీలు (నూనెల్లో వేయించిన ఆహారపదార్థాలు) తరచూ తినడం వల్ల ట్రాన్స్‌ఫ్యాట్ శరీరంలో పెరిగి, కొవ్వు పేరుకుపోతుంది. తద్వారా గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది. కాబట్టి వీటిని మితంగా తీసుకోవడం ఉత్తమం.
వర్షాకాలంలో తేమ కారణంగా బ్యాక్టీరియా, ఫంగస్ వేగంగా వ్యాప్తి చెందుతాయి. ఇలాంటి సమయంలో రోడ్డు పక్కన లేదా బహిరంగ ప్రదేశాల్లో అమ్మే పకోడీలు తింటే విరేచనాలు, ఇతర ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది.
56
బరువు పెరగడం:
పకోడీల్లో ఎక్కువ నూనె, కార్బోహైడ్రేట్లు ఉండటంతో శరీరంలో కొవ్వు పెరుగుతుంది, ఇది బరువు పెరగడానికి, బద్ధకానికి దారితీస్తుంది. అలాగే టీతో పాటు తీసుకునే అధిక చక్కెర కూడా శరీర బరువును పెంచే ప్రధాన కారణాల్లో ఒకటి. కాబట్టి వర్షాకాలంలో వీటిని మితంగా తీసుకోవడం మంచిది.
66
ఇవి ప్రయత్నించండి.
వర్షాకాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనుకుంటే.. పాల టీకి బదులుగా హెర్బల్ టీ లేదా గ్రీన్ టీ తాగడం మంచిది.
నూనెలో వేయించిన బోండా, పకోడీలకు బదులుగా తవ్వలో వేయించిన లేదా గ్రిల్ చేసిన హెల్తీ స్నాక్స్‌ను తినండి.
సీజనల్ పండ్లు, వేరుశెనగ, పప్పులాంటి పోషకాహారంతో కూడిన ఆహారం తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరిగి, ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ పొందవచ్చు.