Hair Care: జుట్టు ఎక్కువగా రాలుతోందా? వీటికి దూరంగా ఉండడం మంచిది!

Published : May 30, 2025, 01:34 PM IST

జుట్టు ఎక్కువగా రాలడం సాధారణ విషయం కాదు. జుట్టు రాలడానికి చాలా కారణాలు ఉంటాయి. వాటిలో ముఖ్యమైంది ఆహారం. ఎక్కువగా జుట్టు రాలిపోతుంటే ఈ ఆహారాలకు దూరంగా ఉండటం మంచిది.

PREV
18
చక్కెర ఎక్కువగా తీసుకోవడం..

చక్కెర ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో ఇన్సులిన్ స్థాయిలు పెరుగుతాయి. ఇది రక్తంలో టెస్టోస్టెరాన్ హార్మోన్ల పెరుగుదలకు దారితీస్తుంది. ఈ హార్మోన్ జుట్టు కుదుళ్లను కుంచించుకుపోయేలా చేస్తుంది. జుట్టు రాలడాన్ని పెంచుతుంది. కాబట్టి చక్కెర పానీయాలు, స్వీట్లు, బేకరీ పదార్థాలు మానేయడం మంచిది. 

28
మద్యం:

మద్యం అధికంగా సేవించడం వల్ల శరీరం పోషకాలను గ్రహించదు. ముఖ్యంగా జుట్టు పెరుగుదలకు అవసరమైన ఐరన్, జింక్, ఫోలిక్ యాసిడ్, బి విటమిన్లు వంటి పోషకాలను మద్యం.. శరీరం నుంచి బయటకు పంపుతుంది. మద్యం శరీరంలో నీటి శాతాన్ని తగ్గిస్తుంది. దానివల్ల జుట్టు పొడిబారడం, రాలిపోవడం వంటి సమస్యలు వస్తాయి. 

38
డైట్ సోడా:

డైట్ సోడాలో ఆస్పర్టేమ్ వంటి కృత్రిమ స్వీటెనర్లు ఉంటాయి. ఈ కృత్రిమ స్వీటెనర్లు జుట్టు రాలడాన్ని కలిగిస్తాయని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.  

48
జంక్ ఫుడ్:

జంక్ ఫుడ్‌లో అధిక కొవ్వులు, సోడియం, ప్రాసెస్ చేసిన పదార్థాలు ఉంటాయి. ఇవి శరీరంలో వేడిని పెంచి.. హెయిర్ ఫోలికల్స్‌ను దెబ్బతీస్తాయి. జంక్ ఫుడ్‌లో పోషకాలు తక్కువగా ఉండటం వల్ల జుట్టుకు అవసరమైన విటమిన్లు, ఖనిజాలు లభించవు. దీంతో జుట్టు బలహీనపడి రాలిపోతుంది.

58
గుడ్డులోని తెల్లసొన:

పచ్చి కోడిగుడ్డు తెల్లసొనలో 'అవిడిన్' అనే ప్రోటీన్ ఉంటుంది. ఈ అవిడిన్.. జుట్టు పెరుగుదలకు అవసరమైన ‘బయోటిన్’ అనే విటమిన్ ను శరీరం గ్రహించకుండా నిరోధిస్తుంది. బయోటిన్ లోపం జుట్టు రాలడాన్ని కలిగిస్తుంది. కాబట్టి పచ్చి కోడిగుడ్డు తెల్లసొనను తినకపోవడం మంచిది. కోడిగుడ్డును ఉడికించి తిన్నప్పుడు ఈ సమస్య ఉండదు.  

68
కొన్ని రకాల చేపలు:

కొన్ని రకాల చేపల్లో పాదరసం అధికంగా ఉండవచ్చు. అధిక పాదరసం తీసుకోవడం వల్ల జుట్టు రాలిపోతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. షార్క్, స్వోర్డ్ ఫిష్, కింగ్ మాకేరెల్ వంటి పెద్ద, దీర్ఘకాలం జీవించే చేపల్లో పాదరసం అధికంగా ఉంటుంది. కాబట్టి చేపలు తినేటప్పుడు జాగ్రత్తగా ఎంచుకోవాలి.

78
గింజలు:

కొన్ని గింజలు… ముఖ్యంగా సెలీనియం అధికంగా ఉండే బ్రెజిల్ నట్స్ వంటివి అతిగా తీసుకోవడం వల్ల జుట్టు రాలే సమస్య పెరుగుతుంది. కాబట్టి ఇలాంటి గింజలను మితంగా తినడం మంచిది.

88
అధిక సప్లిమెంట్స్:

విటమిన్లు, ఖనిజాలు జుట్టు పెరుగుదలకు అవసరమైనప్పటికీ, అధిక సప్లిమెంట్స్ దుష్ప్రభావాలను కలిగిస్తాయి. విటమిన్ ఎ లేదా సెలీనియం వంటి కొన్ని విటమిన్లను అధికంగా తీసుకోవడం వల్ల జుట్టు రాలిపోతుంది.  వైద్యుడిని సంప్రదించకుండా అధిక సప్లిమెంట్స్ తీసుకోకపోవడం మంచిది. 

Read more Photos on
click me!

Recommended Stories