Healthy Snacks: ఈ 7 రకాల స్నాక్స్ ని ఏ టైంలో అయినా తినచ్చు తెలుసా?

Published : May 29, 2025, 04:22 PM IST

ఆరోగ్యంగా ఉండడానికి ఆహారం ఎంత ముఖ్యమో.. అది తినే టైం కూడా అంతే ముఖ్యం. కొన్ని రకాల ఆహారాలను నిర్దిష్ట సమయంలో తింటేనే ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతుంటారు. కానీ కొన్ని రకాల స్నాక్స్‌ని మాత్రం ఎప్పుడైనా తినచ్చు. అవెంటో ఇక్కడ చూద్దాం.  

PREV
17
పండ్లు, నట్ బటర్ :

పండ్లు.. విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్‌తో నిండి ఉంటాయి. ఆపిల్, అరటి వంటి పండ్లతో బాదం బటర్, పీనట్ బటర్ వంటి నట్ బటర్‌లను కలిపి తినడం చాలా మంచిది. నట్ బటర్‌లో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు ఉంటాయి. ఇవి ఆకలిని నియంత్రిస్తాయి.

27
పెరుగు, బెర్రీలు :

పెరుగులో ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. ఇది ఎముకల ఆరోగ్యానికి మంచిది. స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ, రాస్ప్బెర్రీ వంటి బెర్రీలు యాంటీ ఆక్సిడెంట్లతో నిండి ఉంటాయి. చక్కెర లేని పెరుగులో బెర్రీలు కలిపి తినడం ఆరోగ్యానికి మంచిది.

37
ఉడికించిన శనగలు :

ఉడికించిన శనగలు రుచిగా ఉంటాయి. వాటిలో ఫైబర్, ప్రోటీన్, ఖనిజాలు ఉంటాయి. ఉడికించిన శనగల్లో ఉప్పు, కారం, నిమ్మరసం కలిపి తినవచ్చు. ఇది చాలా ఆరోగ్యకరమైన స్నాక్.

47
నట్స్ :

బాదం, పిస్తా, వాల్‌నట్, జీడిపప్పు వంటి వాటిలో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్, ఫైబర్ ఉంటాయి. గుమ్మడికాయ విత్తనాలు, పొద్దు తిరుగుడు విత్తనాలు, చియా విత్తనాలు.. శరీరానికి అవసరమైన ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలతో పాటు ఇతర ముఖ్యమైన పోషకాలను అందిస్తాయి.

57
కూరగాయలు, హమ్మస్ :

క్యారెట్, దోసకాయ, క్యాప్సికమ్ వంటి పచ్చి కూరగాయలు విటమిన్లు, ఫైబర్‌తో నిండి ఉంటాయి. హమ్మస్ అనేది శనగలు, ఆలివ్ నూనె, నిమ్మరసం వంటి వాటితో తయారు చేసిన క్రీమీ డిప్. ఇందులో ప్రోటీన్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. కాబట్టి కూరగాయలను హమ్మస్ తో కలిపి తినచ్చు.

67
ఉడికించిన గుడ్లు :

గుడ్లు.. ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలతో నిండి ఉంటాయి. ఇవి కండరాలను బలోపేతం చేయడానికి, ఆకలిని నియంత్రించడానికి సహాయపడతాయి. ఒక పెద్ద సైజు ఉడికించిన గుడ్డులో దాదాపు 70-80 కేలరీలు, 6 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది.

77
పాప్‌కార్న్ :

పాప్ కార్న్ ఆరోగ్యానికి మంచిది. తక్కువ నూనెతో, ఉప్పు లేకుండా ఇంట్లోనే పాప్‌కార్న్ చేసుకొని తినడం ఆరోగ్యకరం. బయట తయారు చేసినవాటికి దూరంగా ఉండటమే మంచిది.

Read more Photos on
click me!

Recommended Stories