మన భావోద్వేగాలకు, మనం తీసుకునే ఆహారాలకు దగ్గరి సంబంధం ఉంటుంది. కొన్ని ఆహారాలు మనల్ని శక్తివంతంగా, తాజాగా ఉంచుతాయి. శరీర ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తాయి. అలాగే కోపం వంటి ప్రతికూల భావోద్వేగాలను పెంచే ఆహారాలు కూడా ఉన్నాయి. మనం కోపంగా ఉన్నప్పుడు ఏవి పడితే అవి అసలే తినకూడదు. ఎందుకంటే కొన్ని ఆహారాలు మన కోపాన్ని, ఒత్తిడిని ఇంకా పెంచుతాయి. మరి కోపంగా ఉన్నప్పుడు వేటిని తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..
women angry
నిపుణుల ప్రకారం.. కోపం వచ్చినప్పుడు ఆహారాన్ని తినడం సహజమే. కానీ ఈ టైంలో కడుపు నిండిన తర్వాత కూడా తింటూనే ఉంటారు. ఏదేమైనా మీరు ఒత్తిడికి గురైనప్పుడు మీరు తినే ఆహారం మిమ్మల్ని శారీరకంగానే కాదు మానసికంగా ఇబ్బందిని కలిగిస్తుంది. కోపంగా ఉన్నప్పుడు మీరు అతిగా తినే అవకాశం ఉంటుంది. ఇది మంచి అలవాటు కాదు. ఇది విరేచనాలు, ఉబ్బరం, యాసిడ్ రిఫ్లక్స్ వంటి జీర్ణ సమస్యలను కలిగిస్తుంది. కోపంగా ఉన్నప్పుడు వేటిని తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..
కెఫిన్
కెఫిన్ ఎక్కువగా ఉండే ఆహారాలు, పానీయాలను తీసుకోకపోవడమే మంచిది. కాఫీ, ఎనర్జీ డ్రింక్స్, బ్లాక్ టీ, కొన్ని సోడాలు వంటి కెఫిన్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ భావోద్వేగాలను పెంచుతాయి. అలాగే నాడీ వ్యవస్థను ప్రేరేపిస్తాయి. ఇది ఆందోళన, చంచలత, చిరాకు భావాలను పెంచుతుంది. కెఫిన్ మీ నిద్ర విధానాలకు కూడా ఆటంకం కలిగిస్తుంది. ఇది నిద్రలేకుండా చేస్తుంది. అలాగే మీ మానసిక స్థితిని మరింత దిగజార్చుతుంది.
చక్కెర ఆహారాలు
క్యాండీలు, చాక్లెట్లు, చక్కెర పానీయాలు, డెజర్ట్లతో సహా ఎక్కువ చక్కెర ఉన్న ఆహారాలు మీ రక్తంలో చక్కెర స్థాయిల్లో వేగంగా హెచ్చుతగ్గులకు దారితీస్తాయి. ఇది ఒంట్లో శక్తి తగ్గడం, మూడ్ స్వింగ్స్, చిరాకు వంటి భావనలకు దారితీస్తుంది. చక్కెరను ఎక్కువగా తీసుకోవడం వల్ల మీ మొత్తం ఆరోగ్యం దెబ్బతింటుంది.
fast food
ప్రాసెస్ చేసిన లేదా ఫాస్ట్ ఫుడ్స్
ఈ రకమైన ఆహారాల్లో అనారోగ్యకరమైన కొవ్వులు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి శరీరంలో మంటను కలిగిస్తాయి. అలాగే న్యూరోట్రాన్స్మిటర్ల సమతుల్యతకు భంగం కలిగిస్తాయి. ఇది మీ మానసిక స్థితి, భావోద్వేగ స్థితిని ప్రభావితం చేస్తుంది. అంతేకాదు ప్రాసెస్ చేసిన, ఫాస్ట్ ఫుడ్స్ క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మీ శరీరంలో శక్తి తగ్గినట్టుగా అనిపిస్తుంది. ఇది కోపాన్ని పెంచుతుంది.
Image: Getty
ఆల్కహాల్
కొంతమంది కోపాన్ని లేదా ఒత్తిడిని తగ్గించుకోవడానికి మందును తాగుతుంటారు. కానీ ఇలా తాగకపోవడమే మంచిది. ఎందుకంటే ఆల్కహాల్ ఒక నిరాశాజనకం. ఇది మీరు నిర్ణయం తీసుకోవడాన్ని దెబ్బతీస్తుంది. ప్రతికూల ఆలోచనలను కలిగిస్తుంది. అలాగే మీకు నిద్రలేకుండా చేస్తుంది. దీనివల్ల చిరాకు పెరుగుతుంది. కోపం రెట్టింపు అవుతుంది.
spicy foods
స్పైసీ ఫుడ్స్
కారంగా ఉండే ఆహారాలు శరీర ఉష్ణోగ్రతను పెంచుతాయి. అలాగే "ఫైట్ లేదా ఫ్లైట్" ప్రతిచర్య మాదిరిగానే శారీరక ప్రతిస్పందనను ప్రేరేపిస్తాయి. ఇది కొంతమందిలో కోపం లేదా ఒత్తిడి భావాలను ఎక్కువ చేస్తుంది. అంతేకాదు కారంగా ఉండే ఆహారాలు జీర్ణ అసౌకర్యాన్ని కలిగిస్తాయి. ఇది నిరాశ లేదా చికాకు భావాలను పెంచుతాయి.
Image: Getty
ప్రాసెస్ చేసిన కార్బోహైడ్రేట్లు
వైట్ బ్రెడ్, పాస్తా, పేస్ట్రీలు వంటి శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉన్న ఆహారాలు రక్తంలో చక్కెర స్థాయిలను వేగంగా పెంచుతాయి. లేదా తగ్గిస్తాయి. ఇది మూడ్ స్వింగ్స్, చిరాకు, భావోద్వేగ స్థిరత్వం తగ్గడానికి దారితీస్తుంది. ఇది కోపాన్ని పెంచుతుంది.