మండుతున్న ఎండల్లో మీ శరీరాన్ని చల్లగా ఉంచే ఆహారాలు ఇవే..

First Published | Jun 13, 2023, 10:38 AM IST

మండుతున్న ఎండల వల్ల ఒంట్లో వేడిమి బాగా పెరుగుతుంది. ఇది ఎన్నో సమస్యల ప్రమాదాల్ని పెంచుతుంది. మరి ఈ సీజన్ లో శరీరం చల్లగా ఉండేందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

Image: Getty

ఎండాకాలం మామిడి పండ్ల సీజన్. ఇవి తీయగా, టేస్టీగా ఉంటాయి. కానీ మామిడి పండ్లు శరీరంలో వేడిని పెంచుతాయి. అందుకే ఈ సీజన్ లో మామిడి పండ్లను అతిగా తినకూడదు. మరి ఈ సీజన్ లో శరీర వేడిని తగ్గించుకోవడానికి ఎలాంటి ఆహారాలను తినాలో ఇప్పుడు తెలుసుకుందాం..

Image: Getty

కీరదోసకాయ

మండుతున్న ఎండల వేడిలో మీరు కీరదోసకాయ లాగ చల్లగా ఉండాలనుకుంటున్నారా? అయితే మీ సలాడ్ లో ఈ రుచికరమైన, క్రంచీ కీరదోసకాయను జోడించండి. కీరదోసకాయలో కేలరీలు, పిండి పదార్థాలు, ఉప్పు, కొవ్వు, కొలెస్ట్రాల్ అన్నీ తక్కువగా ఉంటాయి. అంతేకాదు వీటిలో 95% వాటర్ కంటెంట్ ఉంటుంది. వీటిని తిటే మన శరీరం హైడ్రేట్ గా ఉంటుంది. మండుతున్న ఎండల్లో శరీరం చల్లగా ఉండేందుకు కీరదోసకాయను తప్పకుండా తినాలి
 


Image: Getty

పుచ్చకాయ

అత్యంత హైడ్రేటింగ్ ఎండాకాలం ఆహారాలలో పుచ్చకాయ ఒకటి. పుచ్చకాయలో ఎన్నో ఔషదగుణాలు దాగున్నాయి. దీనిలో గుండెను ఆరోగ్యంగా ఉంచే లైకోపీన్ ఉంటుంది. తీయని, రుచికరమైన ఈ పండును సలాడ్ లో ఆలివ్ నూనెతో తీసుకోండి.ఈ సీజన్ లో పుచ్చకాయను తింటే మీరు ఆరోగ్యంగా, హైడ్రేట్ గా ఉంటారు. 

corn

మొక్కజొన్న

మొక్కజొన్నలో కార్బ్ ఎక్కువగా ఉంటుంది. వీటిలో ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. అయినప్పటికీ దీనిలో ప్రోటీన్, కొవ్వు కంటెంట్ తక్కువగా ఉంటాయి. దీనిని సైడ్ డిష్ లేదా చిరుతిండిగా తినొచ్చు. కంటిశుక్లం, వయస్సు-సంబంధిత మాక్యులర్ క్షీణత నుంచి రక్షించే కెరోటినాయిడ్లు లుటిన్, జియాక్సంతిన్ మొక్కజొన్నలో పుష్కలంగా ఉంటాయి. 
 

చెర్రీస్

చెర్రీలు కూడా ఎండాకాలంలో మన ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. వీటిలో పాలీఫెనాల్స్ సమృద్ధిగా ఉంటాయి. సెల్యులార్ నష్టం నుంచి రక్షించే, మంటను తగ్గించే, సాధారణ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే మొక్కల సమ్మేళనాలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. 
 

Image: Getty Images

ఖర్బూజ

ఎండాకాలంలో ఖచ్చితంగా తినాల్సిన పండ్లలో ఖర్జూజా ఒకటి. ఖర్జూజను ఈ ఎండాకాలంలో సైడ్ డిష్ గా తప్పకుండా తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీనిలో విటమిన్ సి కూడా పుష్కలంగా ఉంటాయి. 

Latest Videos

click me!