బరువు తగ్గకపోవడానికి 12 రకాల కారణాలు ఉంటాాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.హార్మోన్ల అసమతుల్యత, జీవక్రియ మందకూడటం, నిద్రలేమి, కార్టిసాల్, గట్ హెల్త్ లోపాలు కీలకమని నిపుణులు చెబుతున్నారు.
ఆహారం నియంత్రణ, వ్యాయామం, స్వీయ నియంత్రణ అన్నీ పాటించినా, బరువు తగ్గడంలో సమస్యలు ఎదురవుతున్నాయా? బహుశా దీని వెనుక ఆరోగ్యపరమైన లోతైన కారణాలు ఉండవచ్చు. సలాడ్లు తిన్నా, వాకింగ్ చేసినా, ఇంకా బరువు తగ్గకపోతే... ఇవిగో దాని వెనుక ఉండే 12 ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు.
213
ఇన్సులిన్ నిరోధకత
ఇన్సులిన్‌ను శరీరం సరైన విధంగా గ్రహించకపోతే, చక్కెర కణాల్లోకి వెళ్లకుండా రక్తంలోనే ఉంటుంది. ఇది పొట్ట చుట్టూ కొవ్వును నిల్వచేసేలా చేస్తుంది.
313
థైరాయిడ్ మందగమనం
తక్కువ స్థాయిలో పని చేసే థైరాయిడ్ జీవక్రియ రేటును తగ్గిస్తుంది. అలసట, బద్దకంగా ఉండడం వంటి లక్షణాలతో ఇది గుర్తించకుండా పోవచ్చు.
మితిమీరిన ఒత్తిడి వల్ల కార్టిసాల్ పెరగడం, శరీరాన్ని కొవ్వును నిల్వచేసేలా చేస్తుంది. తీపి పదార్థాలు తినాలనే కోరిక విపరీతంగా పెరుగుతుంది.
513
దీర్ఘకాలిక మంట (Chronic Inflammation)
అనారోగ్యకరమైన ఆహారం, ఒత్తిడి వల్ల శరీరంలో ఉండే మంట ఆకలి, జీవక్రియపై ప్రభావం చూపుతుంది.
613
పేగు ఆరోగ్య లోపం
పేగులో మంచిబాక్టీరియా తగ్గిపోతే, జీవక్రియ మందగమనం, ఇన్సులిన్ సమస్యలు వస్తాయి. ఇది బరువు నిలిచిపోయేలా చేస్తుంది.
713
పోషక లోపాలు
విటమిన్ డి, బి12, మెగ్నీషియం వంటి పోషకాలు తక్కువైతే, శరీర శక్తి వినియోగం, కేలరీ బర్న్ నెమ్మదిస్తుంది.
813
విషపదార్థాల భారం (Toxic Load)
కాలేయం ఎక్కువ విష పదార్థాలతో నిండిపోతే, కొవ్వును తొలగించకుండానే నిల్వ చేస్తుంది. ఇది బరువు తగ్గడాన్ని ఆపేస్తుంది.
913
జీవక్రియ మార్పులు
ఎక్కువకాలం తక్కువ కేలరీలు తీసుకోవడం వల్ల శరీరం తక్కువ శక్తినే ఉపయోగించేలా మారుతుంది. దీనివల్ల తిన్నదంతా కొవ్వుగా మారే ప్రమాదం ఉంటుంది.
1013
అధిక వ్యాయామం
శరీరానికి విశ్రాంతి లేకుండా ఎక్కువ శ్రమిస్తే కార్టిసాల్ పెరిగి, బరువు తగ్గడం బ్లాక్ అయిపోతుంది. కండరాలు కూడా తగ్గుతాయి.
1113
హార్మోన్ల అసమతుల్యత
ఈస్ట్రోజెన్, టెస్టోస్టెరాన్, ప్రొజెస్టెరాన్ వంటి హార్మోన్లు అదుపులో లేకపోతే బరువు నిలిచిపోతుంది. ఇది మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది.
1213
నిద్రలో లోపం
నిద్ర సరిగా లేకపోతే ఆకలి హార్మోన్లు లెప్టిన్, గ్రెలిన్ అసమతుల్యంగా మారి, అధికంగా తినే అలవాటు పెరుగుతుంది.
1313
శక్తి సమతుల్యత లోపం
కేలరీలు తగ్గించడం మాత్రమె కాకుండా, శరీరంలో శక్తిని ఎలా గ్రహిస్తుంది, నిల్వ చేస్తుంది అన్నదానిపై కూడా ప్రభావం చూపుతుంది. దీనిపై నిద్ర, ఒత్తిడి, జన్యుపరమైన అంశాలు ప్రభావితం చేస్తాయి.