Telugu

Health Tips: జిమ్‌కి వెళ్లట్లేదా? ఇంట్లోనే ఈ సింపుల్ వ్యాయామాలు చేయండి

Telugu

ఇంటినే వ్యాయామశాలగా

వర్షంలో బయటకు వెళ్లకపోయినా, వ్యాయామాలు చేయడం ఆపకండి. ఇంట్లోనే మీ కోసం మినీ జిమ్‌ను సృష్టించుకోవచ్చు. కావలసిందల్లా సంకల్పమే. 

Image credits: Getty
Telugu

వార్మప్ తప్పని సరి

వ్యాయామం ప్రారంభించే ముందు శరీరం వేడెక్కడం (వార్మప్) తప్పని సరి. 30 సెకన్ల జంపింగ్ జాక్స్ అలాంటి వార్మప్ చేయడం వల్ల హృదయ స్పందన రేటు పెరుగుతుంది. కండరాలు యాక్టివ్ అవుతాయి.

Image credits: Getty
Telugu

స్క్వాట్స్

ప్రతీ రోజు 15 నుంచి 20 స్క్వాట్స్ చేయాలి. ఇవి చేయడం వల్ల శరీరం మొత్తం బలంగా మారి శరీర పనితీరు మెరుగ్గా అవుతుంది. కాబట్టి, రెగ్యులర్‌గా చేయడం మంచిది.

Image credits: Getty
Telugu

పుష్ అప్స్

శరీరానికి సరైన ఆకారం ఇవ్వడానికి ఉత్తమ వ్యాయామం పుష్-అప్స్. ఇవి ఛాతీ, భుజాలు, చేతులు, కోర్ కండరాలను బలోపేతం చేస్తాయి. మీ సామర్థ్యాన్ని బట్టి సంఖ్యను పెంచండి. 

Image credits: Getty
Telugu

ప్లాంక్

ప్లాంక్ అనేది కోర్ కండరాలను బలోపేతం చేసే వ్యాయామం. ఇది శరీర బరువును నేలపై ఉంచి, క్రమంగా బాడీ బ్యాలెన్స్ ను వెన్నుభాగం పైకి తీసుకరావడం. ఇవి డైలీ 10 -15 సెట్స్ చేయండి. 

Image credits: Getty
Telugu

జాగింగ్

ఇంట్లో పరుగెత్తడం కొంచెం వింతగా అనిపించవచ్చు, కానీ కొవ్వు తగ్గడానికి పది నిమిషాలు ఉన్న చోటే జాగింగ్ చేయండి. ఇలా చేస్తే..రక్త ప్రసరణ మెరుగుపడి.. గుండె పనితీరు బాగుపడుతుంది. 

Image credits: Getty
Telugu

యోగా

మనస్సు, శరీరం, శ్వాసల అద్భుతమైన కలయిక యోగా. సూర్య నమస్కారాలు, భుజంగాసనం, వజ్రాసనం వంటి యోగాసనాలు జీర్ణక్రియకు మెరుగుపర్చడమే కాకుండా ఏకాగ్రత పెంచడానికి ఉపయోగపడుతుంది.

Image credits: Getty

Health Tips: ఎముకలు ఆరోగ్యంగా, బలంగా ఉండాలంటే.. ఈ ఫుడ్స్‌ తప్పనిసరి !

Milk : రోజూ రాత్రి పాలు తాగితే.. శరీరంలో ఇన్ని మార్పులు జరుగుతాయా?

Diabetes: పరగడుపున ఈ సూపర్ ఫుడ్స్‌ తింటే.. షుగర్ ఇట్టే తగ్గుతుంది!

Kidney Health: మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలా? ఈ ఆహారాల జోలికి పోకండి..