India Map Sri Lanka : ఇండియా మ్యాప్‌లో శ్రీలంక ఎందుకు ఉంటుందో తెలుసా? అసలు సీక్రెట్ ఇదే

Published : Jun 20, 2026, 08:36 AM IST

Why Sri Lanka is Shown in India Map: భారతదేశ మ్యాప్ చూసినప్పుడు శ్రీలంక కూడా కనిపిస్తుంటుంది. శ్రీలంక కూడా కూడా ఒక దేశం.. మరి ఇండియా మ్యాప్‌లో శ్రీలంక ఎందుకు ఉంటుంది? దీని వెనుక ఉన్న అంతర్జాతీయ సముద్ర చట్టం, భౌగోళిక కారణాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

PREV
15
ఇండియా మ్యాప్‌లో శ్రీలంక ఉండటానికి కారణాలు ఏంటి?

మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. స్కూల్ బుక్స్‌లో అయినా, ఆఫీస్ వాల్స్ మీద అయినా.. ఇండియా మ్యాప్ ఎక్కడ కనిపించినా కింద చిన్నగా శ్రీలంక దేశం కూడా కనిపిస్తుంది. చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది.. శ్రీలంక అనేది వేరే దేశం కదా, మరి మన దేశం మ్యాప్‌లో దాన్ని ఎందుకు చూపిస్తారు?

దీని వెనుక ఏవైనా పొలిటికల్ గొడవలు ఉన్నాయా? అంటే అస్సలు లేవు. శ్రీలంక పూర్తి స్వేచ్ఛ ఉన్న ఒక స్వతంత్ర దేశం. మరి మన మ్యాప్‌లో ఎందుకు పెడతారు? దీని వెనుక ఒక ఇంటర్నేషనల్ లా, మన రెండు దేశాల మధ్య ఉన్న దూరం మెయిన్ రీజన్స్. ఆ ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

25
ఐక్యరాజ్యసమితి సముద్ర చట్టం

ఇండియా మ్యాప్‌లో శ్రీలంకను చూపించడానికి అతిపెద్ద టెక్నికల్ రీజన్ ఒక ఇంటర్నేషనల్ లా. ఐక్యరాజ్యసమితి 1982లో 'యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ ది లా ఆఫ్ ది సీ' (UNCLOS) అనే ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ అంతర్జాతీయ ఒప్పందం ప్రకారం.. సముద్ర తీరం ఉన్న ఏ దేశానికైనా, వారి తీరం నుండి 200 నాటికల్ మైళ్ల (దాదాపు 370 కిలోమీటర్లు) వరకు సముద్రంపై హక్కు ఉంటుంది.

దీనినే ఎక్స్‌క్లూజివ్ ఎకనామిక్ జోన్ అని పిలుస్తారు. ఈ చట్టం ప్రకారం.. ఏదైనా దేశం తన అధికారిక మ్యాప్‌ను పబ్లిష్ చేసినప్పుడు, ఆ 200 నాటికల్ మైళ్ల పరిధిలోకి వచ్చే సముద్ర సరిహద్దులను, దాని పక్కనే ఉండే భౌగోళిక ప్రాంతాలను మ్యాప్‌లో క్లియర్‌గా చూపించడం రూల్.

35
ఇండియాకు చాలా దగ్గరగా శ్రీలంక

ఇక రెండో రీజన్.. శ్రీలంక మన దేశానికి చాలా అంటే చాలా దగ్గరగా ఉండటం. ఇండియాకు, శ్రీలంకకు మధ్య ఉన్న పాక్ స్ట్రెయిట్ చాలా ఇరుకైనది. తమిళనాడులోని ధనుష్కోడి నుండి శ్రీలంకలోని మన్నార్ ద్వీపానికి మధ్య ఉన్న దూరం కేవలం 18 నాటికల్ మైళ్లు మాత్రమే అంటే దాదాపు 33 కిలోమీటర్లు.

ఐక్యరాజ్యసమితి రూల్ ప్రకారం మన దేశం 200 నాటికల్ మైళ్ల వరకు మ్యాప్ వేయాలి. కానీ శ్రీలంక కేవలం 18 నాటికల్ మైళ్ల దూరంలోనే ఉంది. అంటే ఇండియా సముద్ర సరిహద్దుల పరిధిలోకి శ్రీలంక ఈజీగా వచ్చేస్తుంది. అందుకే శ్రీలంకను వదిలేసి ఇండియా సౌత్ మ్యాప్‌ను పర్ఫెక్ట్‌గా గీయడం అస్సలు కుదరదు.

45
మిగిలిన దేశాలకు ఈ రూల్ వర్తించదా?

ఈ రూల్ మిగిలిన పొరుగు దేశాలకు కూడా వర్తిస్తుంది, కానీ కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్ వంటి దేశాలు ఇండియాతో భూమి సరిహద్దులను పంచుకుంటాయి. కాబట్టి మ్యాప్ గీసేటప్పుడు నేచురల్‌గా ఆ ల్యాండ్ బోర్డర్స్ కనిపిస్తాయి.

కానీ శ్రీలంక అలా కాదు, అది సముద్రంలో ఉన్న ఒక దీవి. అందుకే ఐక్యరాజ్యసమితి సముద్ర చట్టం చెప్పిన సముద్ర నియమాలను ఫాలో అవుతూ, మన మెరైన్ బౌండరీలను కరెక్ట్‌గా చూపించడం కోసం శ్రీలంకను కూడా ఇండియా మ్యాప్ ఫ్రేమ్‌లో యాడ్ చేస్తారు.

55
ఇది కేవలం భౌగోళిక నియమం మాత్రమే

చాలా మంది అనుకునేలా ఇది ఎలాంటి పొలిటికల్ క్లెయిమ్ కాదు. శ్రీలంకపై ఇండియాకు ఎలాంటి హక్కులు లేవు, ఉండవు కూడా. కేవలం ఇంటర్నేషనల్ కార్టోగ్రాఫిక్ రూల్స్ ప్రకారం ఇండియా మ్యాప్ కంప్లీట్ అవ్వాలంటే శ్రీలంకను చూపించడం తప్పనిసరి. అందుకే అఫీషియల్, కమర్షియల్ లేదా ఎడ్యుకేషనల్ మ్యాప్స్.. ఇలా ఏ ఇండియా మ్యాప్ చూసినా శ్రీలంక దేశం భారత్ కు కింద కనిపిస్తుంటుంది.

Read more Photos on
click me!

Recommended Stories