French Fries: ఫ్రెంచ్ ఫ్రైస్ ఫ్రాన్స్‌లో పుట్టకపోయినా ఆ పేరెందుకు వచ్చింది?

Published : Jul 13, 2026, 11:35 AM IST

French Fries: ఫ్రెంచ్ ఫ్రైస్ పేరు వింటేనే నోరూరిపోతుంది. ఇప్పుడంటే అవి చిరుతిండి..కానీ ఒకప్పుడు అవే ప్రధాన భోజనం. ఇవి మావంటే మావని మూడు దేశాలు కొట్టుకుంటున్నాయి. కోర్టులో కేసులు కూడా నడుస్తున్నాయి.

PREV
13
ఫ్రెంచ్ ఫ్రైస్ చరిత్ర

ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ ఇష్టపడే స్నాక్ ఏదైనా ఉందంటే అది 'ఫ్రెంచ్ ఫ్రైస్'. వేడివేడిగా, కరకరలాడే ఈ ఆలూ ముక్కలను చూస్తే తినేయాలనిపిస్తుంది. అయితే మనందరికీ ఎంతో ఇష్టమైన ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ ఎక్కడ పుట్టాయన్నది ఇప్పటికీ సందేహమే. వీటి వెనుక చాలా చరిత్ర ఉంది. వీటి పేరులో 'ఫ్రెంచ్' అని ఉన్నప్పటికీ, దీనిని తామే కనిపెట్టామంటూ ఫ్రాన్స్, బెల్జియం, స్పెయిన్ దేశాలు దశాబ్దాలుగా వాదించుకుంటున్నాయి. 2005లో ఒక కళాకారుడు ఆర్ట్ గ్యాలరీలో రెండు ఫ్రెంచ్ ఫ్రైస్ లను శిలువ రూపంలో పెట్టారు. అవి ఒకరోజు కనిపించకుండా పోయాయి. దీంతో కోర్టు వరకు కేసు చేరి ఆ కళాకారుడికి 21 లక్షల రూపాయలు చెల్లించమని ఆర్ట్ గ్యాలరీకి ఫైన్ పడింది.

23
ఫ్రెంచ్ ఫ్రైస్ ఎక్కడ పుట్టాయి?

ఫ్రెంచ్ ఫ్రైస్ పుట్టుకకు సంబంధించి ప్రధానంగా ఎన్నో కథనాలు ప్రచారంలో ఉన్నాయి. మొదటిది బెల్జియం దేశానికి చెందిన కథ. అక్కడి 'మీయూస్' నది తీరంలో నివసించే ప్రజలు నదిలోని చిన్న చిన్న చేపలను నూనెలో వేయించుకుని తినేవారు. అయితే శీతాకాలంలో నది మొత్తం గడ్డకట్టుకుపోయి చేపలు దొరికేవి కావు. అందుకే వాటికి బదులు బంగాళాదుంపలను పొడవుగా కోసి చేపల్లాగే నూనెలో వేయించడం ప్రారంభించారు. మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో అక్కడికి వచ్చిన అమెరికన్ సైనికులు ఈ వంటకాన్ని రుచి చూశారు. ఆ ప్రాంతంలోని ప్రజలు ఫ్రెంచ్ భాష మాట్లాడటంతో, అమెరికన్లు దీనికి 'ఫ్రెంచ్ ఫ్రైస్' అని పేరు పెట్టారని బెల్జియం వాసులు చెబుతున్నారు. అయితే 1780ల కాలంలోనే ప్యారిస్‌లోని ప్రసిద్ధ 'పాంట్ నెఫ్' వంతెనపై వీధి వ్యాపారులు వీటిని విక్రయించేవారని కాబట్టి ఫ్రాన్సే దీని పుట్టిల్లు అని ఫ్రెంచ్ చరిత్రకారులు వాదిస్తున్నారు. మరోవైపు దక్షిణ అమెరికా నుండి బంగాళాదుంపలను మొదటిసారి ఐరోపాకు తీసుకొచ్చింది స్పెయిన్ దేశస్థులే కాబట్టి నూనెలో వేయించే సాంప్రదాయం తమకే ఉందని స్పెయిన్ వాసులు కూడా వాదిస్తున్నారు. కాబట్టి ఫ్రెంచ్ ఫ్రైస్ ఎక్కడ పుట్టాయో ఇప్పటివరకు తేలలేదు.

33
ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా తినాలి?

అమెరికా దేశానికి ఫ్రెంచ్ ఫ్రైస్ తెలిసింది మాత్రం మాజీ అధ్యక్షుడు థామస్ జెఫర్సన్‌ వల్లే. 1780ల కాలంలో ఆయన ఫ్రాన్స్‌లో ఉన్నప్పుడు తన చెఫ్‌కు ఈ వంటకం తయారీలో శిక్షణ ఇప్పించి మరీ అమెరికాలో దీనిని పరిచయం చేశారు. అయితే అప్పట్లో ఇవి ఇప్పటిలా పొడవాటి ముక్కలుగా కాకుండా గుండ్రంగా లేదా నిమ్మకాయ తొక్కల ఆకారంలో ఉండేవి. 1920ల నాటికి ఇవి ఫ్రెంచ్ ఫ్రైస్ గా మారాయి. ఈ రోజుల్లో ప్రతి దేశానికి ఫ్రెంచ్ ఫ్రైస్ పరిచయమే. అమెరికన్లు దీనిని టొమాటో కెచప్‌తో తింటే, ఫ్రెంచ్ ప్రజలు ఆవాల పేస్ట్‌తో, బ్రిటిష్ వారు వెనిగర్‌తో, బెల్జియం ప్రజలు మయోనైస్‌తో తింటారు.

Read more Photos on
click me!

Recommended Stories