Salary: అమెరికాలో చెత్త ఏరుకునేవారి జీతం ఎంత ఉంటుందో తెలుసా? ఏ జాబ్ కి ఎంత శాలరి వస్తుంది?

Published : Jul 13, 2026, 08:00 AM IST

Salary: అమెరికా అంటే చాలు ఎగేసుకుంటూ వెళ్లిపోతుంటారు యువత. అక్కడ సంపాదన ఎక్కువగా ఉంటుందని నమ్ముతారు. బాగా సంపాదించవచ్చు అనుకుంటారు. మరి మెరికాలో చెత్త ఏరుకునేవాడు ఎంత సంపాదిస్తాడో తెలుసా? షాక్ అవుతారు?

PREV
16
అమెరికా వైపు యువత చూపు..

ఎక్కువ జీతం, కాస్ట్లీ లైఫ్ స్టైల్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది యువత అమెరికా (USA) వైపు మొగ్గు చూపుతుంటారు. ఇండియా నుండి కూడా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు, డాక్టర్లు, లాయర్లు వంటి ఉన్నత స్థాయిలో ఉన్నవారు అక్కడికి వెళ్లి స్థిరపడుతుంటారు. అయితే, అమెరికాలో కేవలం పెద్ద ఉద్యోగాలకే కాకుండా, చిన్న చిన్న పనులు చేసే వారికి కూడా గౌరవప్రదమైన శాలరీలు లభిస్తాయి. అక్కడ ఏ ఉద్యోగానికి ఎంత జీతం ఉంటుంది, ముఖ్యంగా సమాజంలో కీలకంగా ఉండే చెత్త ఏరుకునే వారి సంపాదన ఎంత, వారికి నెల జీతాలు ఉంటాయా? విదేశాల్లో ఏ ఉద్యోగాలకు ఎంత జీతం లభిస్తుందో తెలుసా? ఓ యూట్యూబర్ చెప్పిన వివరాల ప్రకారం చూస్తే.

26
అమెరికాలో చెత్త ఏరుకునే వారి సంపాదన

అమెరికాలో ఇళ్ల వద్ద చెత్త సేకరించే (Trash Collectors) పనులను ఎంతో గౌరవంగా భావిస్తారు. వీరికి లభించే వేతనం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. అమెరికాలో ఈ తరహా పనులకు గంటల ప్రాతిపదికన (Hourly Based) చెల్లింపులు జరుగుతాయి. సాధారణంగా ఒక గంటకు కనీసం 15 డాలర్లు ($15) లేదా అంతకంటే ఎక్కువ లభిస్తుంది. ఈ లెక్కన చూసుకుంటే, అమెరికాలో ఎలాంటి చిన్న పని లేదా క్లీనింగ్ పని చేసినా నెలకు కనీసం రూ. 1.5 లక్షల నుండి 2 లక్షల రూపాయల వరకు సులభంగా సంపాదించవచ్చు. కొంతమంది 4 లక్షల వరకూ సంపాదిస్తుంటారు.

36
పెద్ద ఉద్యోగుల జీతాల వివరాలు

అమెరికాలో విద్యా అర్హత, అనుభవం ఉన్న ఉన్నత స్థాయి నిపుణులకు భారీ స్థాయిలో జీతాలు అందుతాయి. ఓ యూట్యూబర్ చెప్పిన వివరాల ప్రకారం వారి నెలసరి సంపాదన ఇండియన్ కరెన్సీలో సుమారుగా చూసుకుంటే.. చాలా మందికి వారి ఉద్యోగాన్ని బట్టి మారుతుంటుంది. ముందుగా డాక్టర్ల జీతాలు చూసుకుంటే... సాధారణ వైద్యులకు అమెరికాలో నెలకు సుమారు 21 లక్షల వరకు లేదా అంతకంటే ఎక్కువ జీతం లభిస్తుంది. అలాగే పశువైద్య (వెటర్నరీ) డాక్టర్లు నెలకు 7 లక్షల వరకు సంపాదిస్తారు. ఇక లాయర్ల విషయానికి వస్తే.. అమెరికాలో న్యాయవాదులకు మంచి డిమాండ్ ఉంది. జూనియర్ లాయర్లు నెలకు రూ. 5 నుండి 6 లక్షలు సంపాదిస్తే, సీనియర్ లాయర్లు ఏకంగా రూ. 15 నుండి 20 లక్షల వరకు ఆర్జిస్తారు.

46
సాఫ్ట్‌వేర్లు ఎంత సంపాదిస్తుంటారంటే?

ఇండియా నుంచే కాదు చాలా దేశాల నుంచి అమెరికాకు ఎక్కువగా వెళ్లేది సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు. ఇండియాలో చదువకుని, పై చదువుల కోసం అమెరికాకు ఎక్కువగా యువత వెళ్తుంటారు. అక్కడ పార్టైమ్ జాబ్ చేస్తూ.. పోస్ట్ గ్రాడ్యూయేషన్ పూర్తి చేసి.. ఎక్కువ జీతాలు వస్తాయన్న ఆశతో అక్కడే కొన్నాళ్లు జాబ్ చేసుకుంటుంటారు. కొంత మంది అయితే అక్కడే సెటిల్ అవుతుంటారు. 

ఇక సాఫ్ట్‌వేర్ రంగంలో సగటు ఉద్యోగికి నెలకు రూ. 4 నుండి 5 లక్షల వరకూ జీతాలు ఉంటాయి. సీనియర్లు అయితే.. 10 లక్షలపైనే సంపాదిస్తుంటారు. ఇక ఇందులో కాంట్రాక్ట్ బేస్ మీద పనిచేసే వారికి రూ. 6 నుండి 7 లక్షల వరకు జీతం ఉంటుంది.విమాన పైలట్లకు నెలకు సుమారు రూ. 15 నుండి 16 లక్షల వరకు వేతనం ఉంటుంది. యూనివర్సిటీ ప్రొఫెసర్లకు నెలకు రూ. 7 నుంచి 8 లక్షల వరకు డిమాండ్ ఉంటుంది. ఎంత సంపాదించినా.. అక్కడ వారికి తగ్గట్టు ఖర్చులు కూడా అలాగే ఉంటాయి. టాక్స్ లు విపరీతంగా ఉంటాయి.

56
అమెరికాలో మిడిల్ క్లాస్ ఉద్యోగుల సంపాదన ఎంత?

అమెరికా ఆర్థిక వ్యవస్థలో చిన్న ఉద్యోగాలకు కూడా సమానమైన స్థాయి ఉంటుంది, ఆదాయం కూడా ఎక్కువగానే ఉంటుంది. అమెరికాలో పెద్ద పెద్ద 16-వీలర్ ట్రక్కులను నడిపే డ్రైవర్లకు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లతో సమానంగా లేదా అంతకంటే ఎక్కువ జీతం లభిస్తుంది. ట్రక్ డ్రైవర్లు నెలకు 5 లక్షలకు పైగానే సంపాదిస్తారు. ఇక అమెరికాలో టీచర్లకు చాలా తక్కువ జీతాలు ఉంటాయి. వారు నెలకు 3 లక్షల నుంచి 4 లక్షల వరకూ మాత్రమే సంపాదించగలుగుతారు. బ్యాంక్ ఉద్యోగస్థులు, బార్బర్లు, టైలర్లు 2 లక్షల నుంచి 4 లక్షల వరకూ వారి వారి పనులను బట్టి సంపాదించుకుంటారు.

66
టిప్పుల రూపంలో ఎక్కువ సంపాదన..

ఇక ఇండియా తో పాటు ఇతర దేశాల నుంచి అమెరికా వెళ్లి.. పార్టైమ్ జాబ్ గా..వెయిటర్ ఉద్యోగాలు చేసేవారు ఎక్కువగా సంపాదిస్తుంటారు. వారి జీతం నెలకు లక్ష నుంచి రెండు లక్షల వరకూ ఉంటుంది. కానీ టిప్స్ రూపంలో వారికి ఎక్కువగా డబ్బులు వస్తుంటాయి. జీతం ప్లస్ టిప్పు కలిపి నెలకు నాలుగు లక్షల వరకూ వారు సంపాదిస్తుంటారు. అమెరికాలో శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది.

అక్కడ ఏ పని చేసినా నెలకు కనీసం లక్ష రూపాయల ఆదాయం దాటిపోతుంది. అక్కడ నివసించే వారు కేవలం ఒకే ఉద్యోగానికి పరిమితం కాకుండా, రోజులో వివిధ రకాల పార్ట్-టైమ్ పనులు చేస్తూ భారీగా సంపాదిస్తుంటారుః. భార్యాభర్తలు, అలాగే 18 ఏళ్లు దాటిన పిల్లలు కూడా స్వతంత్రంగా పనిచేస్తూ కుటుంబానికి ఆసరాగా నిలుస్తారు.

Read more Photos on
click me!

Recommended Stories