మనం రాత్రి ఆలస్యంగా పడుకున్నా… ఉదయం తొందరగా లేసినా ముఖంలో నిద్రమత్తు కనిపిస్తుంది. రోజంతా ఇబ్బందిగా ఫీలవుతాం. అలాంటిది ఓ వ్యక్తి ఏకంగా 60 ఏళ్ళుగా నిద్రపోవడం లేదట. అతడెవరు? ఎందుకు నిద్రపోవడం లేదు? ఆ స్టోరీ ఏమిటి?
Viral News : మనిషికి కడుపునిండా ఫుడ్, కంటినిండా ఉంటే చాలు ఆరోగ్యంగా, ఆనందంగా జీవించగలడు. సరిపడా నిద్ర లేకపోతే అనేక అనారోగ్య సమస్యలు వస్తుంటాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తుంటారు. గంట రెండుగంటలు ఆలస్యంగా నిద్రపోతేనే ప్రాణాంతకమైన ఆరోగ్య సమస్యలు వస్తాయి... అలాంటి ఒకటి రెండ్రోజులు కాదు... నెలలు, సంవత్సరాలు కాదు... ఏకంగా ఆరు దశాబ్దాలకు పైగా అసలు నిద్రన్నదే లేకుండా ఓ వ్యక్తి జీవిస్తున్నాడంటే మీరు నమ్మగలరా..? నమ్మి తీరాలి.. ఎందుకంటే ఆ వ్యక్తి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాడు. దాదాపు అరవై ఏళ్లుగా (అర్దశతాబ్దానికి పైగా) కంటిమీద కునుకున్నదే వేయని ఆ స్పెషల్ వ్యక్తిగురించి తెలుసుకుందాం.
25
60 ఏళ్లుగా నిద్రపోలేదు...
వియత్నాంలోని ఓ మారుమూల పల్లెటూరిలో 80 ఏళ్ళ రైతు థాయి ఎన్గోక్ నివసిస్తున్నాడు. అతడు 20 ఏళ్ల వయసులో ఉండగా నిద్రపోవడం మానేశాడు... అంటే దాదాపు 60 ఏళ్ళకు పైగా అతడు పడుకున్నదే లేదు. అయితే అతడు ఏదో సరదాకి, రికార్డుల కోసమో పడుకోవడం లేదని అనుకుంటే పొరపడినట్లే... హాయిగా రెస్ట్ తీసుకుందామని అనుకున్నా నిద్ర పట్టదట. ఇలా 1962 నుండి ఇప్పటివరకు ఎన్గోక్ నిద్రలేని రాత్రులు గడుపుతున్నాడు... ఆశ్చర్యకరంగా అతడు నిద్రపోకపోయినా సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాడు.
35
యువకుడిగా ఉండగానే నిద్రకు దూరం
థాయ్ ఎన్గోస్ 20 ఏళ్ల యుక్త వయసులో ఉండగా ఓసారి అనారోగ్యం భారిన పడ్డాడు. కొన్నిరోజులు జ్వరంతో బాధపడిన అతడు కోలుకున్నాడు. అయితే అప్పట్నుంచి నిద్రకు దూరమయ్యాడు... మొదట సాధారణంగా నిద్ర పట్టడం లేదని భావించాడు.. కానీ రోజులు గడుస్తున్నా నిద్రలేకపోవడంతో ఎన్గోస్ వైద్యులను సంప్రదించాడు. వాళ్లు కూడా ఎన్గోస్ కు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని... సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాడని నిర్దారించారు. ఎందుకు అతడికి నిద్ర రావడంలేదో మాత్రం గుర్తించలేకపోయారు.
ఇలా ఎన్గోస్ యుక్త వయసు నుండి ముసలితనం వరకు నిద్రన్నదే ఎరుగడు.. ఒకటి రెండు కాదు దాదాపు 60 ఏళ్లుగా అతడు పడుకోవడమే చూడలేదని కుటుంబసభ్యులు, ఇరుగుపొరుగువారు చెబుతుంటారు. కానీ ఇప్పటివరకు అతడి ముఖం నిద్రలేనట్లుగా కనిపించడం, శరీరం అలసిపోవడం కానీ జరగలేదని చెబుతున్నారు. ఎన్గోస్ నిద్రలేని రాత్రులు ఆ గ్రామస్తులనే వైద్యులనూ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.
ఇటీవల ఓ యూట్యూబ్ ట్రావెలర్ ఈ థాయ్ ఎన్గోస్ గురించి తెలుసుకున్నాడు... అతడి గురించి ప్రపంచానికి తెలియజేయాలని భావించాడు. దీంతో వెంటనే వియత్నాం వెళ్ళి ఎన్గోస్ కలిశాడు.. ఓ రోజంతా అతడితోనే గడిపాడు. అతడు చురుగ్గా వ్యవసాయ పనులు చేసుకోవడం నుండి తీసుకునే అహారం వంటి అన్నింటిని తన కెమెరాలో బంధించాడు.
చివరకు అసలైన టాస్క్ మొదలయ్యింది... రోజంతా విరామంలేకుండా పనిచేసిన ఎన్గోస్ ను రాత్రి తదేకంగా కెమెరా కంటితో పరిశీలించాడు యూట్యూబర్. కానీ ఎన్గోస్ పడుకోవడం కాదు కదా కన్ను వాల్చినట్లుగా కూడా రికార్డు కాలేదు. ఇలా రాత్రంతా మేలుకునే ఉన్న ఎన్గోస్ ఉదయం ఎలాంటి అలసట లేకుండా యధావిధిగా తన పనుల్లో నిమగ్నమవడం చూసి ఆశ్చర్యపోవడం యూట్యూబర్ వంతయ్యింది. ఈ వీడియోను సోషల్ మీడియాలో పెట్టగా వైరల్ గా మారింది.. ఎన్గోస్ గురించి ప్రపంచానికి తెలిసింది.
55
నెటిజన్లు ఆసక్తికర కామెంట్స్
ఎన్గోస్ 60 ఏళ్ళుగా నిద్రలేకుండా ఆరోగ్యంగా జీవిస్తున్న వ్యవహారంపై నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు. 'అతడికి అందరికంటే ఎక్కువ సమయం ఇచ్చాడు దేవుడు... రోజులో 24 గంటలను పరిపూర్ణంగా వాడుకునేది ఇతడొక్కడే అయివుంటాడు'' అని ఓ నెటిజన్ కామెంట్ చేస్తున్నాడు. మరొకరేమో ''ఇతడు హాయిగా నిద్రపోడానికి అనర్హుడు... ఇది వరంకాదు శాపం'' అంటున్నాడు. ఇలా థాయి ఎన్గోస్ దశాబ్దాలుగా నిద్రలేకుండా గడపడం మెడికల్ మిరాకిల్ మారింది. ప్రపంచస్థాయి వైద్యులు సైతం ఇతడి పరిస్థితికి సరైన వివరణ ఇవ్వలేకపోతున్నారు.