Snakes : శీతాకాలంలో పాములు ఎక్కువగా కనిపించవు… ఒకవేళ కనిపిస్తే గుంపులు గుంపులగా కనిపిస్తాయి. ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసా? ఆందుకు ఓ ఆసక్తికరమైన కారణం ఉంది.
ప్రపంచంలోని అత్యంత విషపూరిత జీవులలో ఒకటిగా పిలిచే పాములు వేసవి, వర్షాకాలంలో చురుకుగా తిరుగుతాయి. కానీ చలికాలం రాగానే అకస్మాత్తుగా మాయమవుతాయి. ఈ సమయంలో పాములు ఏం చేస్తాయి? ఎక్కడికి వెళ్తాయి? అనే ప్రశ్న చాలా మందిలో తలెత్తుతుంది. కానీ దీని వెనుక ఉన్న శాస్త్రీయ కారణం ఆసక్తికరంగా ఉంటుంది.
27
పాముల హైబర్నేషన్ (శీతకాల నిద్ర)
పాములకు మనలా వెచ్చని రక్తం ఉండదు... వాటిని శీతల రక్త జీవులు అంటారు. బయటి వాతావరణం చల్లగా ఉంటే వాటి శరీరం కూడా చల్లబడుతుంది. శరీరం వేడిని ఉత్పత్తి చేయదు. అందుకే చల్లని వాతావరణంలో పాములు నెమ్మదిగా, బద్ధకంగా ఉంటాయి. వాటికి కదలడానికి శక్తి ఉండదు. ఎక్కువ శక్తిని వృథా చేయకుండా ఉండేందుకు అవి హైబర్నేట్ చేయడానికి ఎంచుకుంటాయి.
37
నిద్రలోకి మూన్నాలుగు నెలలు..
అవును… చలికాలం మొదలైనప్పుడు పాములు 3 నుంచి 4 నెలలు లేదా అంతకంటే ఎక్కువ కాలం నిద్రలోకి వెళ్తాయి. ఈ సమయంలో అవి ఆహారం, నీరు లేకుండా ఉండగలవు.
చలికాలంలో ఉష్ణోగ్రత బాగా తగ్గినప్పుడు పాములు వెచ్చదనం, రక్షణ కోసం సురక్షితమైన ప్రదేశాలను వెతుకుతాయి. అవి సాధారణంగా నేలలోని లోతైన పగుళ్లు, పాత బొరియలు, రాళ్ల కింద లేదా చెట్ల వేర్ల వంటి వెచ్చని ప్రదేశాలలో దాక్కుంటాయి.
57
పాముల శీతాకాల నిద్ర
ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కొన్నిసార్లు వెచ్చగా ఉండేందుకు చాలా పాములు ఒకేచోట కలిసి నిద్రపోతాయి. పాము శీతకాల నిద్రలోకి వెళ్లినప్పుడు దాని శ్వాస, హృదయ స్పందన నెమ్మదిస్తుంది. వాటి జీర్ణవ్యవస్థ కూడా పూర్తిగా ఆగిపోతుంది. వాతావరణం మారి, ఉష్ణోగ్రత పెరిగినప్పుడు అవి మేల్కొని మళ్లీ చురుకుగా మారతాయి.
67
కళ్లు తెరిచే నిద్రపోతాయా?
పాముల కళ్లు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. అందుకే అవి ఎప్పుడూ నిద్రపోవని చాలామంది అనుకుంటారు. కానీ ఇది కేవలం అపోహ మాత్రమే. నిజానికి పాములకు కనురెప్పలు ఉండవు. వాటి కళ్లపై పారదర్శక పొర ఉంటుంది. ఇది వాటిని దుమ్ము, ధూళి నుంచి కాపాడుతుంది. అందుకే పాములు నిద్రపోతున్నప్పుడు లేదా హైబర్నేషన్‌లో ఉన్నప్పుడు కూడా వాటి కళ్లు తెరిచే ఉంటాయి.
77
భారత్‌లో అత్యంత విషపూరితమైనవి
ప్రపంచవ్యాప్తంగా 3,000 కంటే ఎక్కువ పాము జాతులు ఉన్నప్పటికీ ఒక నివేదిక ప్రకారం, మన దేశంలో 69 ప్రమాదకరమైన పాములు ఉన్నాయి. వీటిలో 29 సముద్ర పాములు, 40 భూమిపై నివసించేవి. కింగ్ కోబ్రా, కట్లపాము వంటివి భారతదేశంలో అత్యంత విషపూరితమైనవిగా చెబుతారు.