ఒక పెద్ద అడవిలో ఒక పెద్ద మర్రి చెట్టు ఉండేది. ఆ చెట్టు కింద ఎలుకల గుంపు, చెట్టు తొర్రలో పిల్లి, చెట్టు పై కొమ్మల్లో పక్షులు నివసించేవి. మూడు వేర్వేరు జాతులకు చెందినవి అయినా.. అవన్నీ మంచి స్నేహితులు. ఒకరికొకరు కొంచెం కూడా హాని చేసుకోవు. పైగా ఒకరికి మరొకరు సహాయం చేసి... కలిసిమెలిసి జీవించేవి.
పిల్లి ఎలుకను తినేది కాదు, పక్షులు పిల్లిని చూసి భయపడేవి కాదు. ప్రపంచంలోనే అత్యంత అరుదైన స్నేహం వీరిది అంటూ అడవి మొత్తం చర్చించుకునేవారు. ఇవన్నీ కలిసి వంట చేసుకోవడం, కలిసి తింటూ జీవించేవి. పక్షులన్నీ కలిసి..పుల్లలు ఏరుకొని వచ్చేవి, ఎలుకలు గింజలు తెచ్చేవి. పిల్లి వంట చేసేది. ఒక్కొక్కరు ఒక్కో పాత్ర చేసి.. సంతోషంగా జీవించేవి. వారి స్నేహాన్ని చూసి మిగిలిన జంతువులన్నీ కుళ్లుకునేవి.
అయితే... వీరి స్నేహాన్ని విడగొట్టాలని ఓ నక్క ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇవన్నీ కలిసి ఉంటే.. తాను వాటిని తినలేనని.. విడగొట్టి.. వాటిని తినేయాలని ప్లాన్ వేస్తుంది.