UPSC Interview Tricky Questions: అభ్యర్థి ప్రాథమిక పరిజ్ఞానాన్ని, తార్కిక ఆలోచనను పరీక్షించేలా యూపిఎస్సి ఇంటర్వ్యూ ప్రశ్నలు ఉంటాయి. ఇవి సులభంగా కనిపించినా బాగా ఆలోచింపజేస్తాయి… ఇలాంటి 5 ట్రిక్కీ ప్రశ్నలు, వాటి సమాధానాలు ఇక్కడ చదవండి.
ప్రశ్న : పిల్లలకు నేర్పించే టేబుల్స్‌ను తెలుగులో ఏమంటారు?
జవాబు: పిల్లలకు నేర్పించే మ్యాథ్స్ టేబుల్స్‌ను తెలుగులో 'ఎక్కాలు' అంటారు. గుణకారం, కూడికలపై అవగాహన కల్పిస్తే పిల్లలు ఎక్కాలను సులభంగా నేర్చుకుంటారు.
25
ప్రశ్న: కొత్త జిల్లాను ఏర్పాటు చేసే అధికారం ఎవరికి ఉంటుంది?
జవాబు: కొత్త జిల్లాను ఏర్పాటు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. పరిపాలన అవసరాలు, జనాభా, అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం కొత్త జిల్లాను ఏర్పాటు చేయవచ్చు.
35
ప్రశ్న: గోరింటాకు పెట్టుకుంటే చేతులు ఎర్రగా ఎందుకు మారతాయి?
జవాబు: గోరింటాకులో 'లాసోన్' అనే సహజ రసాయనం ఉంటుంది. ఇది చర్మంలోని కెరాటిన్ ప్రోటీన్‌తో చర్య జరిపి, చేతులకు ఎరుపు లేదా ముదురు గోధుమ రంగును ఇస్తుంది.
ప్రశ్న: GI ట్యాగ్ అంటే ఏమిటి? దానిని ఎందుకు ఇస్తారు?
జవాబు: GI ట్యాగ్ అంటే జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్. ఒక ప్రత్యేక ప్రాంతానికి చెందిన ఉత్పత్తి నాణ్యత, గుర్తింపును బట్టి ఈ ట్యాగ్ ఇస్తారు. ఇది నకిలీలను అరికట్టి, స్థానిక ఉత్పత్తులకు అంతర్జాతీయ గుర్తింపునిస్తుంది.
55
ప్రశ్న: జంగల్, అడవికి మధ్య తేడా ఏమిటి?
జవాబు: అడవి (Forest), జంగల్ (Jungle) ఒకేలా అనిపించినా, వాటి మధ్య తేడా ఉంది. ప్రభుత్వం నోటిఫై చేసిన ప్రాంతాన్ని అడవి అంటారు. జంగల్ అనేది సహజంగా పెరిగే చిట్టడవులు.. ప్రభుత్వం నోటిఫై చేసివుండదు. జంగల్ అనేది హిందీ పదం.