కొబ్బ‌రి నూనె డ‌బ్బాలు ఈ ఆకారంలో ఉండ‌డానికి ఎలుక‌లు కార‌ణ‌మ‌ని తెలుసా.?

Published : Jan 06, 2026, 12:36 PM IST

Interesting Facts: ఏ కంపెనీ కొబ్బ‌రి నూనె డ‌బ్బ‌లైనా దాదాపు ఒకే ఆకారంలో ఉంటాయి. అయితే మొద‌ట్లో ఇవి వేరే షేప్‌లో ఉండేవి. కానీ ఎలుక‌ల కార‌ణంగా వీటి ఆకారం మారింద‌ని మీకు తెలుసా.? డ‌బ్బ ఆకారానికి ఎలుక‌లకు సంబంధం ఏంట‌నేగా మీ సందేహం. 

PREV
15
మొదట్లో టిన్ డబ్బాల్లో

ఒకప్పుడు కొబ్బ‌రి నూనెను టిన్ డబ్బాల్లో విక్రయించేవారు. అవి బలంగా ఉండేవి కాబట్టి ఎలాంటి సమస్యలు ఉండేవి కాదు. టిన్ డ‌బ్బాలు తుప్పు ప‌ట్ట‌డం, త‌ర్వాత ప్లాస్టిక్ వాడకం పెరగడంతో కంపెనీలు టిన్ డబ్బాల స్థానంలో ప్లాస్టిక్ ప్యాకింగ్‌కి మారాయి. అప్పుడు కొబ్బ‌రి నూనెను చతురస్ర (స్క్వేర్) ఆకారపు ప్లాస్టిక్ డబ్బాల్లో నింపడం మొదలుపెట్టారు.

25
ప్లాస్టిక్ డబ్బాలు మారిన వెంటనే మొదలైన స‌మ‌స్య‌

కొబ్బ‌రి నూనె వాసనకు ఎలుక‌లు చాలా త్వరగా ఆకర్షితమవుతాయి. దుకాణాలు, గోదాముల్లో పెట్టిన స్క్వేర్ ప్లాస్టిక్ డబ్బాలను ఎలుక‌లు కొరికి లోపలికి చొచ్చుకుపోయేవి. దీనివల్ల ఆయిల్ లీక్ అవడం, మొత్తం డబ్బా పనికిరాకపోవడం వంటి సమస్యలు వచ్చాయి. దుకాణదారులకు భారీ నష్టం వ‌చ్చింది.

35
స్క్వేర్ డబ్బాలు ఎలుక‌ల‌కు ఎందుకు ఈజీ అయ్యాయి?

స్క్వేర్ ఆకారంలో ఉండే డబ్బాలకు మూలలు ఉంటాయి. ఆ మూలల్ని ఎలుక‌లు తమ పళ్లతో సులభంగా కొరికేయగలవు. ఒకసారి చిన్న రంధ్రం పడితే చాలు, లోపల ఉన్న కొబ్బ‌రి నూనె వాసన మరింత బయటికి వస్తుంది. అప్పుడు మరిన్ని ఎలుక‌లు చేరి డబ్బాను పూర్తిగా నాశనం చేసేవి.

45
గుండ్రని బాటిల్ ఐడియా ఎలా పుట్టింది?

ఈ సమస్యకు పరిష్కారంగా మరికో (Marico) కంపెనీ ఒక కొత్త ఆలోచన చేసింది. నారియల్ ఆయిల్‌ను గుండ్రని (రౌండ్) ఆకారపు ప్లాస్టిక్ బాటిళ్లలో నింపడం మొదలుపెట్టింది. గుండ్రని బాటిల్‌కు మూలలు ఉండవు కాబట్టి ఎలుక‌లు కొరికే అవకాశం తగ్గిపోయింది. అలాగే ప్యాకింగ్‌ను మరింత బిగుతుగా చేసి ఆయిల్ వాసన బయటికి రాకుండా చేశారు.

55
చిన్న మార్పే పెద్ద పరిష్కారం అయింది

మరికో చేసిన ఈ చిన్న “ఇంజినీరింగ్ మార్పు” పెద్ద సమస్యను పూర్తిగా పరిష్కరించింది. ఎలుక‌ల‌ బెడద తగ్గింది, దుకాణదారుల నష్టం ఆగిపోయింది. అప్పటి నుంచి పారాచూట్ వంటి ప్రముఖ బ్రాండ్‌లతో పాటు దాదాపు అన్ని కంపెనీలు కొబ్బ‌రి నూనెను గుండ్రని బాటిళ్లలోనే విక్రయిస్తున్నాయి. ఇలా ఎలుక‌ల కార‌ణంగా తీసుకున్న ఒక చిన్న నిర్ణయం… కొబ్బ‌రి నూనె ప్యాకింగ్‌లో పెద్ద మార్పు తీసుకొచ్చింది.

Read more Photos on
click me!

Recommended Stories