
తెలంగాణ అనగానే మనకు చారిత్రక కట్టడాలు, నవాబుల నగర వైభవం, అందమైన సరస్సులు, ప్రాచీన ఆలయాలు, పచ్చని ప్రకృతి దృశ్యాలు గుర్తుకొస్తాయి. పర్యాటకులకు అన్ని రకాల అనుభూతులను అందించే అద్భుతమైన రాష్ట్రం తెలంగాణ. అయితే, మీరు తెలంగాణలో తప్పక విజిట్ చేయాల్సిన 10 బెస్ట్ టూరిజం డెస్టినేషన్స్ ఏవో మీకు తెలుసా? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.
హైదరాబాద్ అనగానే అందరికీ ముందుగా గుర్తుకొచ్చేది చార్మినార్. నగరంలోని ప్రాచీన కట్టడమైన చార్మినార్‌తో పాటు దాని చుట్టూ ఉండే లాడ్ బజార్ చాలా ఫేమస్. సిటీలోని అన్ని ప్రాంతాల నుండి రోడ్డు మార్గం ద్వారా చార్మినార్ చేరుకోవడం చాలా ఈజీ. అక్టోబర్ నుంచి ఫిబ్రవరి మధ్య వాతావరణం కూల్‌గా ఉంటుంది కాబట్టి ఉదయం లేదా సాయంత్రం వేళల్లో ఇక్కడికి వెళ్లడం బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది.
అలాగే హైదరాబాద్ చరిత్రను చాటిచెప్పే మరో అద్భుతం గోల్కొండ కోట. ఇక్కడి రాయల్ ఆర్కిటెక్చర్, చారిత్రక నేపథ్యం సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. హైదరాబాద్ సెంట్రల్ సిటీ నుంచి క్యాబ్స్ లేదా బస్సుల్లో సులభంగా కోటకు వెళ్లవచ్చు. అక్టోబర్ నుండి ఫిబ్రవరి వరకు ఇక్కడ పర్యటించడానికి వాతావరణం చాలా అనుకూలంగా ఉంటుంది.
హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న హుస్సేన్ సాగర్ లేక్ వ్యూస్, బూటింగ్, మధ్యలో ఉండే ఎత్తైన బుద్ధుని విగ్రహం పర్యాటకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. నగరంలోని ఏ ప్రాంతం నుంచైనా రోడ్డు మార్గంలో సులభంగా హుస్సేన్ సాగర్ చేరుకోవచ్చు. ముఖ్యంగా సన్‌సెట్ సమయంలో ఇక్కడికి వెళ్తే అద్భుతమైన వ్యూ ఆస్వాదించవచ్చు. దీనికి కూడా అక్టోబర్ - ఫిబ్రవరి మధ్య సమయం చాలా అనుకూలం.
ఫిల్మ్ లవర్స్ కోసం ప్రపంచంలోనే అతిపెద్ద ఫిల్మ్ సిటీ అయిన రామోజీ ఫిల్మ్ సిటీ సూపర్ డెస్టినేషన్. సినిమా సెట్స్, పచ్చని గార్డెన్స్, రకరకాల షోలు ఇక్కడ అందరినీ అలరిస్తాయి. హైదరాబాద్ మెయిన్ సిటీ నుంచి రోడ్డు మార్గంలో దాదాపు గంట వ్యవధిలో ఇక్కడికి చేరుకోవచ్చు. సైట్‌సీయింగ్ చేయడానికి అక్టోబర్ నుండి ఫిబ్రవరి సీజన్ పర్ఫెక్ట్.
హైదరాబాద్ నిజాం రాజుల వైభవాన్ని, రాజభవనాల అందాలను కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది చౌమహల్లా ప్యాలెస్. రాయల్ పాస్ట్ ఎక్స్పీరియన్స్ చెయ్యడానికి ఈ ప్యాలెస్ సరైన ప్రదేశం. సెంట్రల్ హైదరాబాద్ నుండి రోడ్డు మార్గంలో ఇక్కడికి ఈజీగా వెళ్లవచ్చు. అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు ఇక్కడ పర్యటించడం చాలా హాయిగా ఉంటుంది.
అలాగే కాకతీయుల వైభవానికి ప్రతీకగా నిలిచే వరంగల్ కోట తెలంగాణ చరిత్రలో ప్రత్యేకమైనది. ఈ కోట హైదరాబాద్ నుంచి దాదాపు 150 కిలోమీటర్ల దూరంలో ఉంది. రోడ్డు, రైలు మార్గాల ద్వారా వరంగల్ కోటకు సులభంగా చేరుకోవచ్చు. ఇక్కడి కట్టడాలను చూడటానికి అక్టోబర్ నుండి మార్చ్ వరకు వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది.
కళాత్మక చెక్కడాలు, అద్భుతమైన శిల్పకళా రీతులతో అలరించే రామప్ప దేవాలయం ప్రపంచ స్థాయి గుర్తింపు పొందింది. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్‌గా నిలిచిన ఈ దేవాలయం వరంగల్ నగరం నుండి రోడ్డు మార్గంలో సుమారు 70 కిలోమీటర్ల దూరంలో ములుగు జిల్లాలో ఉంది. అక్టోబర్ నుంచి మార్చ్ మధ్య కాలంలో ఈ చారిత్రక ఆలయాన్ని సందర్శించడం చాలా అనుకూలంగా ఉంటుంది.
ములుగు జిల్లాలోనే ఉన్న లక్నవరం చెరువు ప్రకృతి ప్రేమికులకు స్వర్గధామం. ఇక్కడి చిన్న చిన్న దీవులు, ప్రసిద్ధ లక్నవరం సస్పెన్షన్ బ్రిడ్జ్ పర్యాటకులను కట్టిపడేస్తాయి. వరంగల్ నుంచి రోడ్డు మార్గంలో ఇక్కడికి వెళ్లవచ్చు. అక్టోబర్ నుంచి ఫిబ్రవరి కాలంలో ఇక్కడి వ్యూస్ చాలా అద్భుతంగా ఉంటాయి.
ప్రకృతి ప్రేమికులు, ట్రెక్కింగ్ ఇష్టపడే వారి కోసం వికారాబాద్‌లోని అనంతగిరి హిల్స్ పర్ఫెక్ట్ లొకేషన్. హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో చాలా తక్కువ సమయంలో ఇక్కడికి చేరుకోవచ్చు. అక్టోబర్ నుంచి ఫిబ్రవరి మధ్య వాతావరణం ప్రశాంతంగా, ఆహ్లాదకరంగా ఉంటుంది.
చివరగా, కృష్ణా నదిపై నిర్మించిన నాగార్జున సాగర్ డ్యామ్, అద్భుతమైన లేక్ వ్యూస్, బోటింగ్, బౌద్ధ వారసత్వ ప్రదేశాలకు నిలయం. హైదరాబాద్ నుండి రోడ్డు మార్గంలో సుమారు 4 గంటల ప్రయాణంతో సాగర్ చేరుకోవచ్చు. అక్టోబర్ నుండి ఫిబ్రవరి వరకు నాగార్జున సాగర్ పర్యటనకు అనువైన సమయం.