భూమిపై నక్షత్రాలు..
రాత్రిపూట ఆకాశంలో మెరుస్తూ కనిపించే నక్షత్రాలు చూడటానికి చాలా అందంగా ఉంటాయి. ఒకేసారి, ఆకాశంలోని నక్షత్రాలు భూమిపైకి వస్తే ఎలా ఉంటుంది? అది కూడా సముద్ర తీరంలో మీ పాదాల కింద మెరుస్తూ కనిపిస్తే ఇంకెంత అందంగా ఉంటుంది. ఇలాంటి ప్లేస్ నిజంగానే భూమిపై ఉంది.
సాధారణంగా మనం బీచ్ కి వెళ్తే.. తెల్లటి ఇసుక, చిన్న చిన్న పెంకులు, గవ్వలు కనిపిస్తాయి. కానీ, జపాన్ లోని ఓ బీచ్ కి వెళ్తే.. మనకు ఇసుకలో నక్షత్రాలు కనిపిస్తాయి. ఆ బీచ్ ఇసుక సాధారణంగా అన్ని బీచ్ ల్లా ఉండదు. అచ్చం చిన్న చిన్న నక్షత్రాల ఆకారంలో ఆ బీచ్ లోని ఇసుక మెరుస్తూ కనిపిస్తుంది. అందుకే, ఈ బీచ్ ని స్టార్ శాండ్ అని పిలుస్తారు. జపనీస్ లో హోషిజునా అని కూడా పిలుస్తారు. అసలు, నక్షత్రాలు భూమి మీద ఎలా కనిపిస్తాయి? ఒకటి, రెండు కాదు.. ఆ బీచ్ లోని ఇసుక మొత్తం ఈ నక్షత్రాలతోనే కనిపిస్తుంది.. అదెలా సాధ్యం..? దీని వెనక సీక్రెట్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం...