Andhra Village: ఈ గ్రామంలోకి చెప్పులతో అడుగు పెడితే అంతే సంగతులు.. కలెక్టర్ అయినా చెప్పులు విప్పాల్సిందే

Published : Oct 18, 2026, 10:34 AM IST

Andhra Village: ఆంధ్రప్రదేశ్ లోని ఒక విచిత్ర గ్రామం ఇది. ఈ ఊళ్లోకి ఎవరూ కూడా చెప్పులు వేసుకుని కనిపించరు. బయట నుంచి ఎవరు వచ్చినా ఊరి చివర చెప్పులు విప్పి వెళ్లాల్సిందే. ఆఖరికి కలెక్టరయినా చెప్పులు విప్పే గ్రామంలో అడుగుపెడతారు.

PREV
13
ఆంధ్రలో వింతైన గ్రామం

ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వింత గ్రామాల్లో ఇది ఒకటి.ఈ గ్రామంలో ఎవరూ చెప్పులు వేసుకుని కనిపించరు. బయటికి నుంచి వచ్చిన వారు ఊరి చివర చెప్పులు విప్పి గ్రామంలో అడుగుపెట్టాలి. అలాంటి ఒక ఆచారాన్ని తిరుపతి జిల్లా పాకాల మండలంలోని 'వేమన ఇండ్లు' గ్రామంలో పాటిస్తున్నారు. ఈ ఊరిలో ఎవరూ కాళ్లకు చెప్పులు వేసుకోరు. బడికి పోయే చిన్న పిల్లల నుంచి కాలేజీ కుర్రాళ్ల వరకు అందరూ వందల కిలోమీటర్లు నడిచినా కాళ్లకు చెప్పులు లేకుండానే తిరుగుతారు. చివరకు బెంగళూరు లాంటి పెద్ద నగరాల్లో ఉద్యోగాలు చేసినవాళ్లు కూడా చెప్పులు ముట్టలేదు. పాలవేకరి కులానికి చెందిన 25 కుటుంబాలు నివసించే ఈ ఊరిలో, వెంకటేశ్వర స్వామిపై ఉన్న అమితమైన భక్తితోనే చెప్పులు వేసుకోవడం మానేశామని చెబుతున్నారు. ఊరు దాటి వేరే ప్రాంతాలకు వెళ్లినా వారు బయట తిండి తినరు, కనీసం నీళ్లు కూడా తాగరు. బయటి వ్యక్తులు ఎవరైనా పొరపాటున తాకితే చాలు, వెంటనే స్నానం చేసి బట్టలు మార్చుకున్న తర్వాతే ఇంట్లోకి అడుగుపెడతారు.

23
వారికి గ్రామంలోకి ప్రవేశం లేదు

ఈ ఊళ్లోకి బయట నుంచి ఎవరు వచ్చినా సరే.. చివరకు ఎమ్మెల్యే, ఎమ్మార్వో లేదా జిల్లా కలెక్టర్ అయినా ఊరి సరిహద్దులోనే చెప్పులు విప్పేసి లోపలికి నడవాల్సిందే. ఈ వింత నిబంధనతో పాటు ఇక్కడ దారుణమైన వివక్ష కూడా అమలవుతోంది. గ్రామంలోకి దళితులకు అస్సలు ప్రవేశం లేదు, వారితో మాట్లాడటానికి కూడా ఊరివాళ్లు ఇష్టపడరు. పక్క ఊరి నుంచి పనిమీద ఎవరు వచ్చినా ఇళ్ల లోపలికి రానివ్వకుండా బయటే నిలబెట్టి మాట్లాడతారు. ఆడవాళ్లకు నెలసరి వచ్చినప్పుడు ఊరి బయట కట్టిన ఒక చిన్న గదిలోనే ఉంచుతారు. రాజ్యాంగం అంటరానితనాన్ని నిషేధించినా, ఇక్కడ మాత్రంఈ వివక్ష కొనసాగుతోంది.

33
ఆసుపత్రికి కూడా వెళ్లరు

ఇక రోగాలు, రొప్పులొచ్చినా వీరు ఆసుపత్రుల ముఖం చూడరు. విషపూరితమైన పాము కాటేసినా సరే, గ్రామంలోని పుట్ట చుట్టూ తిరిగితే తగ్గిపోతుందని నమ్ముతారు. ఊళ్లో ఎవరూ కనీసం కరోనా వ్యాక్సిన్ కూడా వేసుకోలేదు. ఆడవాళ్లు కాన్పుల కోసం కూడా ఆసుపత్రికి వెళ్లడం ఇక్కడ పూర్తిగా నిషిద్ధం. డిగ్రీలు చదివిన యువకులు ఉన్నా, బయట తిండి పడదనో, ఆచారాలు పాడవుతాయనో ఉద్యోగాలు చేయకుండా వ్యవసాయమే చూసుకుంటున్నారు. చెప్పులు వేసుకోని భక్తి పేరుతో ప్రాణాల మీదికి తెచ్చుకునే మూఢనమ్మకాలు, మనుషుల మధ్య గోడలు కట్టే వివక్ష ఇంకా కొనసాగడంపై అధికారులు తప్పకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

Read more Photos on
click me!

Recommended Stories