Fruits: తెలుగు వారికి పోర్చుగీస్ వారు పరిచయం చేసిన పండు పేరేమిటో తెలుసా?

Published : Oct 18, 2026, 09:22 AM IST

Fruits: తెలుగు వారికి కొన్ని పండ్లను పోర్చుగీసు వారు పరిచయం చేశారు. వారు పరిచయం చేయకపోతే మనకి ఆ పండ్ల రుచి మనకు తెలియవు. ఏ పండ్లు మనకు పోర్చుగీసు వారి వల్ల పరిచయం అయ్యాయో ఇక్కడ ఇచ్చాము.

PREV
13
పోర్చుగీస్ వారు పరిచయం చేసిన పండ్లు

ఈ రోజు మనం ఎంతో ఇష్టంగా తినే పండ్లో ఎన్నో ఉన్నాయి. ఆ పండ్లేవి మన దేశంలో పుట్టినవి కాదు. మన తెలుగు నేలపై పండినవి కాదు. కొన్ని వందల ఏళ్ల క్రితం విదేశాల నుంచి మన దేశానికి వచ్చాయి. వాటిలో పైనాపిల్, బొప్పాయి, జామపండు ముఖ్యమైనవి. ఈ పండ్లు భారతదేశానికి చేరుకోవడం వెనుక పోర్చుగీస్ వ్యాపారుల పాత్ర ఉంది. 16వ శతాబ్దంలో పోర్చుగీస్ వారు సముద్ర మార్గాల ద్వారా భారతదేశానికి వచ్చి వ్యాపారం చేసేవారు. ఆ సమయంలో అమెరికా ఖండానికి చెందిన పలు పంటలు, పండ్లను భారతదేశానికి తీసుకొచ్చారు. అలా అక్కడ్నించి తెలుగు రాష్ట్రాలకు కూడా చేరాయి. విదేశాల నుంచి వచ్చిన పండ్లు క్రమంగా మన దేశంలోని వేర్వేరు ప్రాంతాలకు విస్తరించాయి. ఇప్పుడు మన మార్కెట్లలో సులభంగా దొరికే ఈ పండ్లు ఒకప్పుడు భారతీయులకు కొత్తవే కావడం విశేషం.

23
పైనాపిల్

పైనాపిల్‌ను బ్రెజిల్ నుంచి భారతదేశానికి తీసుకొచ్చినట్లు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. 1548 ప్రాంతంలో ఈ పండు భారతదేశానికి చేరినట్లు సమాచారం. పోర్చుగీస్ వారు పాలించిన గోవా ప్రాంతంలో పైనాపిల్ సాగు వేగంగా విస్తరించింది. 16వ శతాబ్దంలోనే అక్కడి మార్కెట్లలో ఈ పండు విరివిగా లభించేది. ఆ తర్వాత దేశంలోని ఇతర ప్రాంతాలకు కూడా పైనాపిల్ సాగు విస్తరించింది. దీని తీపి రుచి, ప్రత్యేకమైన వాసన ప్రజలను ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం పైనాపిల్‌ను నేరుగా తినడంతో పాటు రసాలు, స్వీట్లు, ఐస్‌క్రీములు, ఇతర ఆహార పదార్థాల తయారీలోనూ ఉపయోగిస్తున్నారు.

33
బొప్పాయి, జామ పండు

బొప్పాయి కూడా అమెరికా ఖండం నుంచి భారతదేశానికి చేరిన పండే. పోర్చుగీస్ వ్యాపారులు 16వ శతాబ్దంలో ఈ పండును భారతదేశానికి తీసుకొచ్చినట్లు చారిత్రక సమాచారం ఉంది. తర్వాత జామపండు కూడా 17వ శతాబ్దం ప్రారంభంలో మన దేశానికి చేరింది. ఈ మూడు పండ్లను భారతదేశానికి పరిచయం చేయడంలో పోర్చుగీస్ వారి పాత్ర ఉందని చరిత్ర చెబుతోంది. నేడు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ పండ్లు విరివిగా పండుతున్నాయి. రైతులకు ఆదాయం అందించడంతో పాటు ప్రజలకు అందుబాటు ధరల్లో లభిస్తున్నాయి. ఒకప్పుడు విదేశాల నుంచి వచ్చిన పండ్లు ఇప్పుడు మన ఆహారంలో భాగమయ్యాయి. వందల ఏళ్ల క్రితం సాగిన సముద్ర ప్రయాణాలు, వ్యాపార సంబంధాలు మన ఆహారపు అలవాట్లను ఎలా మార్చాయో ఈ పండ్ల చరిత్ర తెలియజేస్తోంది.

Read more Photos on
click me!

Recommended Stories