Sunday: ఆదివారం పని చేస్తే జైలుకు వెళ్లాల్సిందే.. చట్టం చేసిన ప్రభుత్వం

Published : Mar 06, 2026, 10:48 AM IST

Sunday: ప్రపంచంలో ప్రతి దేశానికి తనకు తాను ప్రత్యేకమైన చట్టాలు ఉంటాయి. కొన్ని దేశాల్లో సాధారణంగా కనిపించే పనులు, మరికొన్ని దేశాల్లో నేరంగా ప‌రిగ‌ణిస్తారు. అలాంటిదే టోంగా అనే దేశం. ఈ చిన్న ద్వీప దేశంలో ఉన్న వింత చ‌ట్టం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

PREV
15
టోంగా దేశం ఎక్కడ ఉంది?

టోంగా పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న చిన్న ద్వీప దేశం. ఇది అనేక చిన్న ద్వీపాలతో కూడిన రాజ్యంగా ప్రసిద్ధి చెందింది. జనాభా తక్కువగా ఉన్నప్పటికీ, అక్కడి ప్రజలు తమ సంప్రదాయాలను, మత విశ్వాసాలను గౌరవంగా పాటిస్తారు. ఈ దేశం ప్రధానంగా క్రైస్తవ మతాన్ని అనుసరించే ప్రజలతో నిండి ఉంది. అందుకే మతపరమైన ఆచారాలు అక్కడి చట్టాలపై కూడా ప్రభావం చూపాయి.

25
ఆదివారం పని చేయడం ఎందుకు నిషేధం?

టోంగా రాజ్యాంగం ప్రకారం ఆదివారం రోజును సబ్బాత్ డే (పవిత్ర విశ్రాంతి దినం)గా భావిస్తారు. ఈ రోజున సాధారణ వ్యాపారాలు, పనులు చేయకూడదు. ఆదివారం రోజున దుకాణాలు, కార్యాలయాలు, వ్యాపారాలు, ఇతర వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించడం నిషేధం. ఎవరు బహిరంగంగా పని చేస్తూ కనిపించినా, అది చట్టాన్ని ఉల్లంఘించినట్లే. ఇలాంటి సందర్భాల్లో జరిమానా విధించవచ్చు. కొన్నిసార్లు తీవ్రమైన పరిస్థితుల్లో జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉంటుంది.

35
కొన్ని సేవలకు మాత్రం మినహాయింపు

ఈ నియమం కఠినంగా ఉన్నప్పటికీ, ప్రజలకు అవసరమైన అత్యవసర సేవలకు మాత్రం మినహాయింపు ఉంది. ఉదాహరణకు..

* ఆసుపత్రులు, వైద్య సేవలు

* పోలీస్, భద్రతా సేవలు

* విద్యుత్, నీటి సరఫరాతో పాటు ప‌లు అత్యవసర సేవలకు ఈ నిబంధ‌న నుంచి మిన‌హాయింపు ఉంటుంది. ఈ సేవలు నిలిచిపోతే ప్రజలకు ఇబ్బందులు కలుగుతాయి. అందుకే వీటిని ఆదివారం నియమం నుంచి మినహాయించారు.

45
ఈ చట్టం వెనుక మతపరమైన కారణం

టోంగా దేశ ప్రజలలో ఎక్కువ మంది క్రైస్తవులు. క్రైస్తవ సంప్రదాయం ప్రకారం ఆదివారం రోజు ప్రార్థనతో పాటు విశ్రాంతికి కేటాయించిన పవిత్ర దినంగా భావిస్తారు. అందుకే ఆ రోజున ప్రజలు చర్చిలకు వెళ్లి ప్రార్థనలు చేస్తారు. కుటుంబంతో సమయం గడుపుతారు. సాధారణ పనుల నుంచి దూరంగా ఉండటం అక్కడి సంప్రదాయం. ఈ మతపరమైన విశ్వాసాల ఆధారంగా ప్రభుత్వం ఈ చట్టాన్ని అమలు చేసింది.

55
ఇతర దేశాలతో పోలిస్తే టోంగా ప్రత్యేకత ఏంటి.?

ప్రపంచంలోని కొన్ని దేశాల్లో కూడా ఆదివారం రోజున కొంత పరిమితులు ఉంటాయి. ఉదాహరణకు జర్మనీ, పోలాండ్ వంటి దేశాల్లో కొన్ని ప్రాంతాల్లో ఆదివారం రోజున దుకాణాలు మూసివేస్తారు. అయితే అక్కడ పని చేయడం నేరంగా పరిగణించరు. కానీ టోంగా దేశంలో మాత్రం ఈ నియమం చాలా కఠినంగా అమలు అవుతుంది. ఎందుకంటే అది రాజ్యాంగంలోనే పేర్కొన్న చట్టం.

Read more Photos on
click me!

Recommended Stories