Motivational Quotes: మీ కథలో మీరే హీరో.. ఒక్క ఓటమితో జీవితం ఆగిపోదు, నిరాశ పడకండి

Published : Mar 03, 2026, 10:34 AM IST

Motivational Quotes: మన కథలో మనమే హీరో. ఆ హీరో ఎలాంటి విజయాలు సాధించాలో, ఎలాంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉండాలి మనమే నిర్ణయించుకోవచ్చు. మీరు మీ ఆలోచనలను మార్చుకుంటే మీ కథలో మీరు పెద్ద హీరో అవ్వడం ఖాయం. 

PREV
15
మంచి ఆలోచనలతో ముందుకు

చిన్న ఓటమికి కుంగిపోతారు కొందరు. పరీక్షల్లో తప్పితే జీవితం పై ప్రేమనే వదిలేస్తారు మరికొందరు. మంచి చెడు అన్నది పరిస్థితుల్లో ఉండదు.. మన ఆలోచనల్లో ఉంటుంది. మీరు కష్టాన్ని సమస్యగా చూస్తే అది గుదిబండలా కనిపిస్తుంది.. అదే అవకాశంగా చూడండి విజయానికి దారిలా అనిపిస్తుంది. ప్రపంచ ప్రసిద్ధి కవి, నాటక కర్త అయిన విలియం షేక్స్‌పియర్ జీవితాన్ని మార్చగల శక్తివంతమైన, స్ఫూర్తివంతమైన కొటేషన్లను అందించారు. ఆయన ఆలోచనలు కేవలం పదాలు కాదు.. అవి మనసును మార్చే మంత్రాలు. వీటిని అర్థం చేసుకుంటే అవి శక్తివంతమైన సందేశాలుగా మారుతాయి.

25
మీరే హీరో

షేక్స్‌పియర్ చెప్పిన ప్రకారం ఈ జీవితమే ఒక నాటక రంగం. ప్రతిరోజూ మీరు ఎన్నో పాత్రలు పోషించాల్సి రావచ్చు. అందులో కొన్నిసార్లు ఓడిపోయే మనిషి పాత్ర కావచ్చు, కొన్నిసార్లు విజయాన్ని సాధించే హీరో పాత్ర కావచ్చు.. కానీ గుర్తుంచుకోండి ప్రతి సీను ముగిసిపోయిన తర్వాత మరొక కొత్త సీన్ కచ్చితంగా మొదలవుతుంది. కాబట్టి ఓడిపోయినప్పుడు ఆ ఓటమి జీవితానికి ముగింపు కాదు.. ఓటమి వెనుక గెలుపు కూడా వచ్చేందుకు సిద్ధంగా ఉంటుంది.

35
కలల కోసం కష్టపడండి

ఏమీ చేయకుండా ఒకచోట కూర్చుని ఆలోచిస్తే.. సంతోషాలు, విజయాలు వాటంతట అవే మీ జీవితంలోకి రావు. మొదట కలలు కనాలి. ఆ కలలను నిజం చేసుకునేందుకు శ్రమించాలి. ఈరోజు మీరు చేసే చిన్న ప్రయత్నం రేపు పెద్ద విజయానికి కారణం అవుతుంది. అలానే త్వరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. అలా తీసుకునే నిర్ణయాలు కొన్నిసార్లు పైనుంచి కిందకు లాగేస్తాయి. సహనంగా, స్పష్టంగా, ధైర్యంగా వేసే అడుగులు విజయానికి మెట్లుగా మారుతాయి. నెమ్మదిగా అయినా సరే నిలకడగా ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించండి.

45
నిత్య విద్యార్థిలా ఉండండి

ప్రపంచంలో అన్నీ తెలిసినవాడు, అన్నీ వచ్చిన వారు ఎవరూ ఉండరు. ప్రతి వ్యక్తి నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది. ఏదో ఒక కొత్త విషయం నేర్చుకోవడానికి మిగిలే ఉంటుంది. కాబట్టి ప్రతిరోజూ కొత్తగా ఏదైనా నేర్చుకోవడానికి ప్రయత్నించండి. మిమ్మల్ని మీరు విద్యార్థిగానే భావించండి. అహంకారం కాకుండా వినయమే మీకు నిజమైన శక్తిని అందిస్తుంది. మీ వినయం మీకు స్నేహితులను, బంధువులను దగ్గర చేస్తుంది. అలాగే వారి సాయం మీకు సంపదగా మారే అవకాశం ఉంటుంది.

55
ఓటమి వెనుక విజయం

ఎంత చీకటి అయినా సూర్యుడు వచ్చాక పారిపోవాల్సిందే. జీవితంలో ఓటమి వెనకే విజయం, చీకటి వెనుకే వెలుగు వస్తాయి. ఈరోజు మీరు కష్టపడొచ్చు రేపు కచ్చితంగా సంతోషంగా ఉండే రోజు వస్తుంది. ఆ భావంతో మీరు జీవిస్తే మీలో కుంగుబాటే రాదు. మీకున్న డబ్బు, పేరు, ప్రతిష్ట ఇవన్నీ తాత్కాలికమైనవే. కానీ నిజాయితీగా కష్టపడితే వచ్చే గెలుపు, ఆనందం మాత్రం శాశ్వతంగా నిలిచిపోతాయి. నిత్యం సందేహాలతోనే నడుచుకుంటూ వెళితే గమ్యాన్ని చేరుకోవడం కష్టంగా మారుతుంది. మీకున్న అనుమానాలన్నీ పక్కన పెట్టండి. అనుకున్న పని కోసం ధైర్యంగా ముందుకు అడుగు వేయండి మీ విజయం మీ రాక కోసం ఎదురు చూస్తూ ఉంటుంది.

Read more Photos on
click me!

Recommended Stories