IRCTC South India Tour: ఒక్క టికెట్‌తో రామేశ్వరం, అరుణాచలం సహా 7 పుణ్యక్షేత్రాల దర్శనం.. ఐఆర్‌సీటీసీ బంపర్ ఆఫర్

Published : Jun 03, 2026, 11:38 AM IST

IRCTC South India Tour: ఐఆర్‌సీటీసీ దివ్య దక్షిణ యాత్ర ప్యాకేజీని ప్రకటించింది. రూ. 15,600 ప్రారంభ ధరతో రామేశ్వరం, కన్యాకుమారి, అరుణాచలం సహా 7 పుణ్యక్షేత్రాలను సందర్శించవచ్చు. ఈ క్రేజీ రైల్వే టూర్ వివరాలు మీకోసం.

PREV
16
దివ్య దక్షిణ యాత్ర విత్ అరుణాచలం: తక్కువ ఖర్చులోనే రామేశ్వరం, కన్యాకుమారి వెళ్ళిపోవచ్చు

సౌత్ ఇండియాలోని ఫేమస్ టెంపుల్స్ చూడాలని ప్లాన్ చేస్తున్నారా? రామేశ్వరం, కన్యాకుమారి బీచ్‌లు, గుడులు చుట్టేయాలని ఉందా? అయితే మీకు ఒక గుడ్ న్యూస్. ఐఆర్‌సీటీసీ (IRCTC) ఒక అదిరిపోయే టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది. దీని పేరు 'దివ్య దక్షిణ యాత్ర విత్ అరుణాచలం' (Divya Dakshin Yatra With Arunachalam). ఈ ప్యాకేజీ ద్వారా చాలా తక్కువ బడ్జెట్‌లోనే దక్షిణ భారతదేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శించవచ్చు.

భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు (Bharat Gaurav Tourist Train) ద్వారా ఈ యాత్ర సాగుతుంది. ఇందులో 2AC, 3AC తో పాటు స్లీపర్ క్లాస్ సీట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. మొత్తం 8 రాత్రులు, 9 రోజుల పాటు సాగే ఈ టూర్ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలు, టికెట్ ధరలు గమనిస్తే..

26
జూలై 20 నుంచి ప్రయాణం ప్రారంభం

ఈ స్పెషల్ టూర్ ప్యాకేజీ మొత్తం 8 రాత్రులు, 9 రోజుల పాటు సాగుతుంది. ఈ ప్రయాణం జూలై 20వ తేదీన ప్రారంభం అవుతుంది. ఈ టూరిస్ట్ రైలులో మొత్తం 702 సీట్లు ఉన్నాయి. ఇందులో స్లీపర్ క్లాస్ కింద 160 సీట్లు, థర్డ్ ఏసీ కింద 490 సీట్లు, సెకండ్ ఏసీ కింద 52 సీట్లు కేటాయించారు. ఈ రైలు తెలంగాణలోని సికింద్రాబాద్ స్టేషన్ నుంచి బయలుదేరుతుంది.

తెలుగు రాష్ట్రాల్లోని ప్రయాణికులకు బోర్డింగ్, డీబోర్డింగ్ చాలా ఆప్షన్లు ఇచ్చారు. సికింద్రాబాద్, చార్లపల్లి, జనగాం, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, మధిర, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట స్టేషన్లలో ప్రయాణికులు ఈ రైలు ఎక్కవచ్చు లేదా దిగవచ్చు.

36
ఈ ప్యాకేజీలో కవర్ అయ్యే 7 ముఖ్యమైన ప్రాంతాలు ఇవే

ఈ 9 రోజుల టూర్‌లో దక్షిణ భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ పొందిన 7 ధార్మిక, పర్యాటక ప్రాంతాలను చూపిస్తారు. రామేశ్వరం, కన్యాకుమారి వెళ్లాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఈ యాత్రలో అరుణాచలం (తిరువణ్ణామలై), చిదంబరం, తిరుచ్చి, తంజావూరు, రామేశ్వరం, మదురై, కన్యాకుమారి వంటి ప్రముఖ ప్రాంతాలను కవర్ చేస్తారు.

46
IRCTC South India Tour: సందర్శించే ప్రముఖ దేవాలయాలు ఇవే

ఈ ప్రయాణంలో భక్తులు సౌత్ ఇండియాలోని ఎంతో ఫేమస్ టెంపుల్స్ దర్శించుకోవచ్చు. తిరువణ్ణామలైలోని అరుణాచలేశ్వర స్వామి గుడి, చిదంబరంలోని నటరాజ స్వామి ఆలయం, తిరుచ్చిలోని శ్రీ రంగనాథస్వామి టెంపుల్ చూపిస్తారు.

వీటితో పాటు తంజావూరులోని బృహదీశ్వరాలయం, రామేశ్వరంలోని రామనాథస్వామి ఆలయం, మదురైలోని మీనాక్షి అమ్మవారి గుడి, కన్యాకుమారిలోని రాక్ మెమోరియల్, కుమారి అమ్మన్ టెంపుల్‌ను సందర్శించవచ్చు.

56
IRCTC South India Tour: టికెట్ ధరల వివరాలు ఇవే

ఈ టూర్ ప్యాకేజీ ధరలు మీరు ఎంచుకునే క్లాస్‌ను బట్టి ఉంటాయి. పెద్దవారికి ధరలు ఇలా ఉన్నాయి..

• స్లీపర్ క్లాస్: రూ. 15,600

• థర్డ్ ఏసీ: రూ. 23,100

• సెకండ్ ఏసీ: రూ. 29,500

5 నుంచి 11 ఏళ్ల లోపు పిల్లలకు టికెట్ ధరలు ఇలా ఉన్నాయి..

• స్లీపర్ క్లాస్: రూ. 14,600

• థర్డ్ ఏసీ: రూ. 21,900

• సెకండ్ ఏసీ: రూ. 28,100

66
ఈ టూర్ లో ప్రయాణికులకు లభించే సదుపాయాలు ఏమిటి?

ఈ ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీ తీసుకున్న వారికి ప్రయాణంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తారు. ప్రయాణికులకు రోజూ మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, రాత్రి డిన్నర్ అందిస్తారు. దీంతో పాటు ప్రయాణికులందరికీ ట్రావెల్ ఇన్సూరెన్స్ సదుపాయం కూడా ఈ ప్యాకేజీలోనే ఇంక్లూడ్ అయి ఉంటుంది.

అలాగే యాత్ర పొడవునా ప్రయాణికులకు సహాయం చేయడానికి, గైడ్ చేయడానికి ప్రొఫెషనల్ టూర్ ఎస్కార్ట్స్ అందుబాటులో ఉంటారు.

Read more Photos on
click me!

Recommended Stories