Somnath Temple Mystery: గుజరాత్‌లోని సోమనాథ్ ఆలయం దేశంలోని 12 జ్యోతిర్లింగాలలో మొదటిది. ఈ శక్తివంతమైన క్షేత్ర చరిత్ర, అద్భుతమైన వాస్తుశిల్పం, పర్యాటక వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
17 సార్లు ధ్వంసం చేసినా మళ్ళీ నిలబడింది.. సోమనాథ్ టెంపుల్ పవర్ మామూలుది కాదు బాస్!
గుజరాత్ తీరంలో ఉన్న సోమనాథ్ ఆలయం కేవలం ఒక దేవాలయం మాత్రమే కాదు, అది భారతీయుల ఆత్మగౌరవానికి ప్రతీక. పరమశివుని 12 జ్యోతిర్లింగాలలో మొదటిదిగా వెలుగొందుతున్న ఈ క్షేత్రం వెనుక వేల ఏళ్ల చరిత్ర, అంతుచిక్కని సైన్స్, అద్భుతమైన వాస్తుశిల్పం దాగి ఉన్నాయి. అసలు సోమనాథ్ ఆలయం ఎందుకు అంత పవర్ ఫుల్? అక్కడ ఏముంది?
26
చంద్రుడి శాపం పోగొట్టిన ఆది జ్యోతిర్లింగం
పురాణాల ప్రకారం, ఈ ఆలయాన్ని స్వయంగా చంద్రుడు (సోముడు) నిర్మించాడు. తన మామగారైన దక్ష ప్రజాపతి ఇచ్చిన శాపం వల్ల చంద్రుడి కాంతి తగ్గిపోయినప్పుడు, ఈ ప్రదేశంలోనే శివుడి కోసం తపస్సు చేసి తన వెలుగును తిరిగి పొందాడని పురాణాలు చెబుతున్నాయి. అందుకే దీనికి సోమనాథ్ అనే పేరు వచ్చింది. ఋగ్వేదం, పురాణాల్లో దీనిని 'ప్రభాస క్షేత్రం' అని పిలిచారు. చంద్రుడి కళలకు, ఇక్కడి ఆధ్యాత్మిక శక్తికి దగ్గరి సంబంధం ఉంటుందని భక్తుల నమ్మకం.
36
ప్రపంచం అంచున అద్భుతమైన లోకేషన్
సోమనాథ్ ఆలయం కేవలం సముద్ర తీరాన ఉండటమే కాదు, భౌగోళికంగా ఒక అద్భుతమైన పాయింట్ వద్ద ఉంది. ఆలయ ప్రాంగణంలో ఉన్న బాణస్తంభం మీద ఒక ఆసక్తికరమైన విషయం రాసి ఉంటుంది. ఈ స్తంభం నుండి దక్షిణ ధ్రువం వరకు మధ్యలో ఎక్కడా భూమి అన్నదే తగలదు.
అంటే సుమారు 10,000 కిలోమీటర్ల మేర కేవలం సముద్రం మాత్రమే ఉంటుంది. వేల ఏళ్ల క్రితమే మన పూర్వీకులు ఈ విషయాన్ని గుర్తించి అక్కడ స్తంభాన్ని ప్రతిష్ఠించడం నిజంగా గూస్ బంప్స్ తెప్పించే విషయం. శాటిలైట్ డేటా కూడా ఇదే విషయాన్ని ఇప్పుడు కన్ఫర్మ్ చేసింది.
సోమనాథ్ చరిత్ర చాలా పెయిన్ ఫుల్ గా ఉంటుంది. ఈ ఆలయం వద్ద ఉన్న సంపదను, ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను చూసి ఓర్వలేక ఎంతోమంది విదేశీయులు దీనిపై దాడి చేశారు. మహ్మద్ గజనీ వంటి వారు ఆలయాన్ని లూటీ చేసి, పూర్తిగా ధ్వంసం చేశారు.
కానీ, ఎన్నిసార్లు పడగొట్టినా, భారతీయులు మళ్ళీ మళ్ళీ అంతకంటే గ్రాండ్ గా నిర్మించారు. ఇప్పుడు మనం చూస్తున్న ఆలయం స్వాతంత్య్రం వచ్చిన తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ చొరవతో 1947లో ప్రారంభమై, 1950లో పూర్తయింది. ఇది మన సంస్కృతి పట్టుదలకు నిదర్శనం.
56
అబ్బురపరిచే వాస్తుశిల్పం: మారు గుర్జర స్టైల్
ఈ ఆలయాన్ని మారు గుర్జర అనే శైలిలో నిర్మించారు. ఆలయ శిఖరం 155 అడుగుల ఎత్తులో ఉండి, పైన భారీ రాగి కలశంతో మెరిసిపోతుంటుంది. ఆలయ గోడలపై దేవుళ్లు, దేవతలు, పువ్వులు, జంతువుల శిల్పాలను అత్యంత కళాత్మకంగా చెక్కారు.
లోపల ఉన్న సభామంటపం చాలా విశాలంగా, శివుని గాథలను గుర్తుకు తెచ్చేలా ఉంటుంది. ఆలయానికి దగ్గరలోనే కపిల, హిరణ్, సరస్వతీ నదులు కలిసే త్రివేణి సంగమం ఉంది. భక్తులు ఇక్కడ స్నానం చేసి స్వామివారిని దర్శించుకోవడం ఆచారంగా వస్తోంది.
66
టూరిస్ట్ గైడ్: మీరు వెళ్ళినప్పుడు ఇవి మిస్ అవ్వకండి
మీరు సోమనాథ్ వెళ్లాలనుకుంటే కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. ఆలయం ఉదయం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు తెరిచి ఉంటుంది. రోజుకు మూడుసార్లు (ఉదయం 7, మధ్యాహ్నం 12, సాయంత్రం 7 గంటలకు) హారతి ఇస్తారు. ఆ సమయంలో అక్కడ ఉండే వైబ్రేషన్స్ వేరే లెవల్ లో ఉంటాయి. ముఖ్యంగా సాయంత్రం 7:45 నుండి 8:45 మధ్యలో జరిగే 'లైట్ అండ్ సౌండ్ షో' అస్సలు మిస్ అవ్వద్దు. దీనికి బిగ్ బీ అమితాబ్ బచ్చన్ గొంతు అందించడం విశేషం. ఇది ఆలయ చరిత్రను మన కళ్లముందు ఉంచుతుంది.