Dussehra Holidays : ఆ స్కూల్స్ స్టూడెంట్స్ కి రేపట్నుంచే దసరా సెలవులు ప్రారంభం

Published : Sep 19, 2025, 11:18 AM IST

Dussehra Holidays : తెెలంగాణ ప్రభుత్వం సెప్టెంబర్ 21 నుండి అక్టోబర్ 3 వరకు దసరా సెలవులు ప్రకటించింది. కానీ కొన్ని స్కూళ్లకి సెప్టెంబర్ 20 నుండి అక్టోబర్ 5 వరకు సెలవులు వస్తున్నాయి. అదెలాగో ఇక్కడ తెలుసుకుందాం. 

PREV
15
దసరా సెలవులపై విద్యార్థులు ఎగిరిగంతేసే సమాచారం

Dussehra Holidays : తెలుగు విద్యార్థులు ఎగిరిగంతేసే సమాచారం... తెలంగాణకు చెందిన కొన్ని స్కూళ్లలో రేపట్నుంచే (సెప్టెంబర్ 20, శనివారం) దసరా సెలవులు ప్రారంభం కానున్నాయి. తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబర్ 21 నుండి దసరా సెలవులు ప్రారంభం అవుతాయని ప్రకటించిందిగా... మరి సెప్టెంబర్ 20 నుండి సెలవులేంటని అనుకుంటున్నారా? అయితే మీరు స్టోరీ పూర్తిగా చదవాల్సిందే.

25
ఆ తెలంగాణ స్కూళ్లకు సెప్టెంబర్ 20 నుండే దసరా సెలవులు

తెలంగాణలో మరీముఖ్యంగా హైదరాబాద్ లో కార్పోరేట్, ఐటీ ఉద్యోగుల పిల్లలు చదివే కొన్ని ప్రైవేట్ స్కూళ్ళకి ప్రతి శని, ఆదివారం సెలవు ఉంటుంది. తల్లిదండ్రులకు వీకెండ్ లో రెండ్రోజులు సెలవు ఉంటుంది కాబట్టి వారితో గడిపేందుకు పిల్లలకు కూడా సెలవులు ఇస్తుంటారు. ఇలా వీకెండ్ లో రెండ్రోజులు సెలవులిచ్చే స్కూళ్లు హైదరాబాద్ లో చాలా ఉన్నాయి. అలాంటి విద్యాసంస్థల్లో చదివే స్టూడెంట్స్ కి దసరా సెలవులు ఓరోజు ముందుగానే అంటే సెప్టెంబర్ 20 నుండే ప్రారంభం అవుతాయి.

ఇక మరికొన్ని ప్రైవేట్ స్కూళ్లలో ఇవాళ్టితో (సెప్టెంబర్ 19) పరీక్షలు ముగుస్తున్నాయి. కాబట్టి రేపు చివరి వర్కింగ్ డే కాబట్టి దసరా, బతుకమ్మ వేడుకల నిర్వహించేందుకు ప్లాన్ చేశాయి. అంటే ఈ స్కూల్ విద్యార్థులకు కొద్దిసేపు దసరా వేడుకల తర్వాత ఇంటికి పంపిస్తారు. ఎలాంటి క్లాసులు, పరీక్షలు ఉండవు... కాబట్టి ఓ రకంగా ఇది సెలవు అనే చెప్పాలి. ఇలా సెప్టెంబర్ 20 శనివారం చాలా విద్యాసంస్థల్లో దసరా సెలబ్రేషన్స్ నిర్వహిస్తున్నాయి… కాబట్టి ఆ స్కూల్స్ కేవలం హాఫ్ డే నడుస్తాయి. 

35
తెలంగాణలో దసరా సెలవులు

ప్రభుత్వ ప్రకటన ప్రకారం తెలంగాణలోని అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ విద్యాసంస్థలకు సెప్టెంబర్ 21 నుండే దసరా సెలవులు ప్రారంభం అవుతాయి. దసరా పండగ తర్వాతే తిరిగి విద్యాసంస్థలు తెరుచుకునేది... అంటే అక్టోంబర్ 3వరకు సెలవులు కొనసాగుతాయి, అక్టోబర్ 4 నుండి విద్యాసంస్థలు తిరిగి పున:ప్రారంభం అవుతాయి. మొత్తంగా ఈ దసరా పండక్కి తెలంగాణలో అన్ని స్కూళ్లకు అధికారికంగా 13 రోజులు సెలవులు ఉన్నాయి.

ప్రతి వీకెండ్ లో శని, ఆదివారం సెలవులుండే స్కూల్ విద్యార్థులకు మాత్రం దసరా సెలవులు 16 రోజులు రానున్నాయి. సెప్టెంబర్ 20, అక్టోబర్ 4,5 వీకెండ్ సెలవులు దసరా సెలవులతో కలిసిరానున్నాయి.. అందుకే అందరు విద్యార్థుల కంటే వీరికి ఓ మూడ్రోజులు సెలవులు అదనంగా వస్తున్నాయి.

45
ప్రైవేట్ స్కూల్స్, కాలేజీలకు ప్రభుత్వం హెచ్చరిక

సిలబస్ కాలేదనో, మంచి ర్యాంకులు సాధించేలా విద్యార్థులను రెడీ చేస్తామనో చెబుతూ కొన్ని విద్యాసంస్థలు సెలవుల్లో క్లాసులు, స్టడీ అవర్స్ నిర్వహిస్తుంటాయి. ఇలా దసరా సెలవుల్లో క్లాసులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలంగాణ విద్యాశాఖ హెచ్చరిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ స్కూల్స్ అయితే సెప్టెంబర్ 21 నుండి అక్టోబర్ 3 వరకు.. జూనియర్ కాలేజీలు అయితే సెప్టెంబర్ 28 నుండి అక్టోబర్ 5 వరకు సెలవులు ఇవ్వాల్సిందేనని... విద్యార్థులకు క్లాసులకు రావాలని ఒత్తిడి చేయరాదని ప్రభుత్వం సూచిస్తోంది. కావాలంటే విద్యార్థులకు సెలవుల్లో చదువునేందుకు హోంవర్క్ ఇవ్వాలి… అలాకాదని క్లాసులు నిర్వహిస్తామంటే ఇబ్బందులు తప్పవని ప్రభుత్వం హెచ్చరిస్తోంది. 

55
ఆంధ్ర ప్రదేశ్ లో దసరా సెలవులు

మరో తెలుగు రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్ లో కూడా దసరా సెలవులు ఎక్కువగానే ఉన్నాయి... కానీ తెలంగాణలో ఉన్నన్ని కాదు. ఏపీలో ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు సెప్టెంబర్ 24 నుండి అక్టోబర్ 2 వరకు దసరా సెలవులు ఇచ్చారు... అంటే దసరా తర్వాతి రోజు స్కూళ్లు తెరుచుకుంటాయి. మొత్తంగా 9 రోజులు మాత్రమే ఏపీ స్కూల్ విద్యార్థులకు దసరా సెలవులు ఇచ్చారు. ఇక జూనియర్ కాలేజీలకు మరింత తక్కువ రోజులు సెలవులు ఇచ్చారు.

Read more Photos on
click me!

Recommended Stories