mosquito Free Country : ఏంటి మామా..! ప్రపంచంలో దోమలు లేని దేశముందా..! మ్యూజియంలో పెట్టి చూపిస్తారా..!!

Published : Sep 18, 2025, 10:05 PM IST

mosquito Free Country : ప్రపంచంలో అసలు దోమలు, పాములు లేని దేశం ఒకటుందని మీకు తెలుసా? ఇంతకూ ఆ దేశమేది? అక్కడ ఎందుకు ఈ జీవులు ఉండవు? ఇలాంటి ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. 

PREV
15
ఈ దేశంలో దోమలే ఉండవు

mosquito Free Country : వర్షాకాలం వచ్చిదంటే చాలు భారతదేశలో దోమల బెడద ఎక్కువ అవుతుంది. వీటివల్ల అనేక రోగాలు వ్యాపిస్తుంటాయి... ఒక్కోసారి ఈ దోమకాటు ప్రాణాపాయం కావచ్చు. అందుకే ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు స్వయంగా ప్రభుత్వాలే రంగంలోకి దిగి దోమల నివారణ కోసం వందలకోట్లు ఖర్చు చేస్తుంటాయి. కేవలం ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఈ దోమల సమస్య ఉంది... ఒక్క దేశంలో తప్ప. అసలు దోమంటూ కనిపించని దేశం ఒకటుందని మీకు తెలుసా? ఆ దేశమేది? అక్కడ దోమలెందుకు ఉండవు? అనే ఆసక్తికర విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

25
దోమలు లేని దేశమేదో తెలుసా?

ప్రపంచంలో చాలా వింతలు విడ్డూరాలు కలిగిన దేశాలున్నాయి. అందులో ఐస్ ల్యాండ్ ఒకటి. ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా కనిపించే కొన్ని ప్రాణులు కనిపించవు. ఇందులో దోమలు కూడా ఉన్నాయి. ఈ దేశంమొత్తం వెతికినా ఒక్కటంటే ఒక్క దోమ కనిపించదు. అందుకే ఇక్కడి ప్రజలకు అసలు దోమలంటే ఎలా ఉంటాయో కూడా తెలీదు. వీటిని చూడాలంటే మ్యూజియంకు వెళ్లి చూడాలి. దేశంలోని నేచురల్ హిస్టరీ మ్యూజియంలో దోమల అవశేషాలను అక్కడి ప్రజల సందర్శనార్థం ఉంచారు.

35
ఐస్ ల్యాండ్ లో దోమలు లేకపోవడానికి కారణాలు

1. ఐస్ ల్యాండ్ అత్యంత చల్లని వాతావరణం కలిగిన దేశం. ఇక్కడ మనుషులు జీవించేందుకు కొన్నిప్రాంతాలు మాత్రమే అనువైనవి... మిగతా ప్రాంతాలు మంచుకొండలు, అగ్నిపర్వతాలతో నిండి ఉంటాయి. ఇలాంటి వాతావరణంలో దోమలు బ్రతకలేవు.

2. నిల్వవుండే నీటిలో దోమల లార్వా వేగంగా పెరుగుతుంది. కానీ ఐస్ ల్యాండ్ లో నీరు నిల్వవుండే ప్రదేశాలు చాలా తక్కువ... ఉన్నకొన్ని చెరువులు, సరస్సులు చల్లని వాతావరణం కారణంగా ఎక్కువకాలం గడ్డకట్టి ఉంటాయి. కాబట్టి దోమల సంతానోత్పత్తి జరగదు.

3. ఐస్ ల్యాండ్ జనాభా కూడా చాలా తక్కువ. కాబట్టి పంటలు కూడా ఎక్కువగా పండించే పరిస్థితి ఉండదు. కాబట్టి ఇళ్లలోనే కాదు బయట కూడా దోమలు ఉండవు.

45
ఐస్ ల్యాండ్ లో పాములు కూడా ఉండవు...

ఐస్ ల్యాండ్ కేవలం దోమలే కాదు పాములు కూడా కనిపించవు. దోమల మాదిరిగానే పాములు పెరిగేందుకు కూడా ఈ భూభాగం అనుకూలంగా ఉండదు. అత్యంత చల్లని వాతావరణ పరిస్థితుల్లో పాముల బ్రతకలేవు... అందుకే ఐస్ ల్యాండ్ 'స్నేక్ ఫ్రీ' కంట్రీగా మారింది. అంటే దోమల వల్ల రోగాలు వచ్చి, పాము కాటు వల్ల ప్రాణాలు పోయే ప్రమాదం ఐస్ ల్యాండ్ లో ఉండదన్నమాట.

55
ఐస్ ల్యాండ్ లోనే దోమలు, పాములు ఎందుకుండవు?

ఐస్ ల్యాండ్ మాదిరిగా చల్లని వాతావరణం ఉండే దేశాలు ప్రపంచంలో చాలా ఉన్నాయి. కానీ అక్కడ కొన్నిరకాల దోమ, పాము జాతులు కనిపిస్తాయి. కానీ ఈ ఒక్క దేశంలోనే అసలు వాటి ఆనవాళ్లే ఉండవు. ఇక్కడ మాత్రమే ఎందుకు దోమలు, పాములు బ్రతకవన్నది ఇప్పటికీ మిస్టరీనే. 

ఇక్కడ శీతల వాతావరణమే కాదు మట్టి, నీటిలో కొన్ని ప్రత్యేక రసాయనాలు ఉన్నాయని... అందువల్లే దోమలు, పాములు బ్రతకలేవని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు... కానీ సైంటిఫిక్ గా మాత్రం ఇవేవీ రుజువుకాలేదు. కానీ ఎలాగైతేనేం ఐస్ ల్యాండ్ ప్రజలకు దోమలు, పాముల బాధ లేదు.

Read more Photos on
click me!

Recommended Stories