Rainy season: ఈ త‌ప్పుల వ‌ల్లే వ‌ర్షాకాలంలో ఇంట్లోకి పాములు వ‌స్తాయి.. వెంట‌నే ఇలా చేయండి

Published : Jul 01, 2025, 01:23 PM IST

వ‌ర్షాకాలం వ‌చ్చిందంటే చాలు పాములు, తేళ్లు ఇంట్లోకి వ‌స్తుంటాయి. వేస‌విలో రాళ్ల‌లో దాగి ఉన్న పాములు వ‌ర్షాలు మొద‌లు కావ‌డంతో బ‌య‌ట‌కు వ‌స్తాయి. అయితే ఇంట్లోకి పాములు రాకుండా ఉండాలంటే కొన్ని జాగ్ర‌త్తలు తీసుకోవాలి. 

PREV
15
వర్షాకాలంలో పాముల బెడద

వర్షాకాలం ప్రారంభమైనప్పటి నుంచే పాములు, తేళ్లు వంటి విషపూరిత జీవులు మన ఇళ్లకు దగ్గరగా వస్తుంటాయి. ప్రధానంగా తేమ, చీకటి, దాక్కునే ప్రదేశాల కోసం ఇవి మన ఇంట్లోకి ప్ర‌వేశిస్తాయి. కొన్ని సంద‌ర్భాల్లో ఈ హానిక‌ర ప్రాణుల వ‌ల్ల ప్రాణాలు పోయే ప్ర‌మాదం కూడా ఉంటుంది. ముఖ్యంగా రాత్రివేళల్లో, మెట్లు, వాష్‌రూమ్‌ల దగ్గర, గోడల అంచుల్లో పాములు, తేళ్లు ఎక్కువ‌గా క‌నిపిస్తాయి.

25
అస‌లు పాములు, తేళ్లు ఇంట్లోకి ఎందుకొస్తాయి.?

వ‌ర్షం ప‌డిన వెంట‌నే భూమి లోప‌ల వాతావ‌ర‌ణం వేడుక్కుతోంది. దీంతో పాములు, తేళ్లు వాటి గూళ్లు వదిలి పైకి వస్తాయి. అనంత‌రం ర‌క్ష‌ణ కోసం పాత చెక్కల కుప్పలు, ఇంటి గోడల ఫౌండేషన్ వద్ద, నీరు నిలిచే ప్రాంతాల వైపు వెళ్తుంటాయి. తేమ, చీకటిగా ఉండే ప్రదేశాలపై వాటికి ఆకర్షణ ఎక్కువగా ఉంటుంది.

35
ఇంట్లోకి పాము వస్తే ఏం చేయాలి.?

పాము లేదా తేలు ఇంట్లోకి వచ్చినప్పుడు తొందరపడి అరవటం, దాన్ని కర్రతో కొట్టకూడ‌దు. ఇలా చేయ‌డం వ‌ల్ల పాము గంద‌ర‌గోళానికి గురై మ‌రింత వేగంగా పరిగెత్త‌డం లేదా మ‌న‌పైకే అటాక్ చేయొచ్చు. వెంట‌నే స్నేక్ క్యాచ‌ర్ల‌కు స‌మాధానం అందించాలి. దాదాపు పాములు వ్య‌క్తుల‌ను కాటు వేయ‌వు, వాటి భ‌ద్ర‌త‌కు ప్ర‌మాదం క‌లుగుతుంద‌ని భావించిన త‌రుణంలో అటాక్ చేస్తుంది.

45
ఈ జాగ్ర‌త్త‌లు తీసుకోండి.

ఇంట్లో పాములు రాకుండా ఉండాలంటే ఇంటి చుట్టూ నీరు నిల్వ కాకుండా చూడాలి. డ్రైనేజీ లైన్లను తరచూ శుభ్రంగా ఉంచాలి. గోడల్లో పగుళ్లు ఉంటే వాటిని మూసేయండి. చెక్కల కుప్పలు, రాళ్ల గుట్టలు ఇంటి దగ్గర పెట్టవద్దు. బాత్‌రూమ్‌, స్టోర్ రూమ్‌లో ఎప్పుడూ వెలుగు ఉండేలా చూడండి.

55
పాములు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి.?

కొన్ని నేచుర‌ల్ టిప్స్ ద్వారా పాములు ఇంట్లోకి రాకుండా జాగ్ర‌త్త‌ప‌డొచ్చు. ఇలాంటి కొన్ని నేచుర‌ల్ టిప్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

* వెల్లుల్లి, నిమ్మరసం నీటిలో కలిపి ఇంటి మూలల్లో స్ప్రే చేయండి. ఈ వాసన పాములకు అసహ్యంగా ఉంటుంది.

* కర్పూరం, ఆవ నూనె కలిపిన మిశ్రమాన్ని మూలల్లో ఉంచడం వల్ల వాటి ఘాడ‌త‌కు పాములు ద‌రి చేర‌వు.

* బంతి పువ్వు మొక్క నాటడం వల్ల దాని వాసన వల్ల తేలు, పాము వంటి జీవులు దూరంగా ఉంటాయి.

* వేపా ఆకుల పొడి చల్లడం వల్ల తేళ్లు అటువైపు రావు.

Read more Photos on
click me!

Recommended Stories