Fact: వ‌ర్షం ప‌డే ముందే ఉరుములు, మెరుపులు ఎందుకు వ‌స్తాయి.? అస‌లు లాజిక్ ఏంటో తెలుసా

Published : Jun 30, 2025, 03:35 PM IST

వ‌ర్షాకాలం వ‌చ్చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో వ‌ర్షాలు కురుస్తున్నాయి. ఇక వ‌ర్షా కాలం సాయంత్రం కాగానే ఆకాశం ఒక్క‌సారిగా మారిపోతుంది. ఉరుములు, మెరుపులు రావ‌డం స‌ర్వ‌సాధార‌ణం. ఇంత‌కీ వ‌ర్షం ప‌డే స‌మ‌యంలో మెరుపులు ఎందుకు వ‌స్తాయో తెలుసా.? 

PREV
16
వ‌ర్షంలో క‌నిపించే భ‌యంక‌ర‌మైన దృశ్యాలు

వర్షాకాలం అనగానే అంద‌రికీ సంతోషంగా అనిపిస్తుంది. పిల్లలు నీటిలో ఆడుకోవ‌డం, రైతులకు పంటల ఆశ – ఇవన్నీ మనకు చాలా సంతోషం కలిగించే విషయాలే. కానీ మరోవైపు, భారీ వర్షాలు, వరదలు, రోడ్లపై నీరు నిలిచిపోవడం, గాలి దెబ్బలకు చెట్లు, విద్యుత్ పోల్స్ పడిపోవడం వంటి దృశ్యాలు కూడా మనం చూస్తూనే ఉంటాము. ఈ వర్షాల మధ్య మరో భయంకరమైన దృశ్యం ఉరుములు, మెరుపులు. పిడుగులు పడడం వల్ల ప్రతీ ఏడాది ఎందరో ప్రజలు ప్రాణాలు కోల్పోతుంటారు.

26
మేఘాల మ‌ధ్య ఏం జ‌రుగుతుంది.?

మనం చూస్తున్న మేఘాలు వాస్తవానికి చిన్న చిన్న నీటి బిందువులు లేదా మంచు కణాలతో తయారవుతాయి. ఈ మేఘాలు గాల్లో ప్రయాణిస్తున్నప్పుడు, ఆ గాలిలోని కణాలతో ఘర్షణకు గురవుతాయి. 

ఈ సంఘర్షణ వల్ల కొన్ని మేఘాలు ధనాత్మక (positive) చార్జ్‌తో, మరికొన్ని ఋణాత్మక (negative) చార్జ్‌తో నిలుస్తాయి. ఇలా విద్యుత్ ఛార్జ్‌తో భిన్నంగా ఉన్న రెండు మేఘాలు ఒకదానికొకటి దగ్గరైతే, వాటి మధ్య పెద్ద మొత్తంలో విద్యుత్ ఉత్పత్తి అవుతుంది.

36
మెరుపు ఎలా ఏర్పడుతుంది?

రెండు భిన్న ఛార్జ్‌లతో ఉన్న మేఘాలు ఒకదానికొకటి ఢీకొన్నప్పుడు, మిలియన్ల వోల్టుల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఈ విద్యుత్ కొన్నిసార్లు భూమివైపు దూసుకొస్తుంది. దీన్ని మనం మెరుపు (lightning) అని పిలుస్తాము. ఇది ఒక రకమైన నేచురల్ ఎలక్ట్రికల్ డిశ్చార్జ్. మెరుపు పడే వేళ, అది గాలిలోని కణాలను వేడెక్కించేస్తుంది.

46
ఉరుము శబ్దం ఎందుకు వస్తుంది?

గాలిలో ఒక్కసారిగా వేడి పెరగడం వల్ల, అది వేగంగా విస్తరిస్తుంది. ఇది గాలిలో ఒత్తిడి మార్పులకు దారితీస్తుంది. ఈ ఒత్తిడి మార్పుల వల్ల భారీ శబ్దం ఏర్పడుతుంది. దీనినే ఇదే ఉరుము (thunder) అంటారు. ఇది శబ్ద తరంగాల రూపంలో మన చెవులకు వినిపిస్తుంది. కొన్నిసార్లు మేఘాల్లో గాలి చాలా వేగంగా కదలడంతో భారీగా శ‌బ్ధం వ‌స్తుంది.

56
ముందు మెరుపు.. తరువాతే ఉరుము సౌండ్‌ ఎందుకు?

ఎప్పుడైనా గమనించారా.. ముందు మెరుపు కనిపిస్తుంది, ఆ తర్వాతే ఉరుము వినిపిస్తుంది. దీని వెనక గల కారణం శాస్త్రీయమే. కాంతి వేగం సెకనుకు సుమారు 3 లక్షల కిలోమీటర్లు. కానీ ధ్వని వేగం సెకనుకు కేవలం 343 మీటర్లే ఉంటుంది. అందుకే, మెరుపు పడిన వెంటనే అది మన కంటికి కనిపిస్తుంది కానీ ఉరుము శబ్దం కొంచెం ఆలస్యంగా చెవికి వినిపిస్తుంది.

ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే, మీరు మెరుపు చూశాక శబ్దం వచ్చే వరకు లెక్కపెడితే, 3 సెకన్లకు దాదాపు 1 కిలోమీటర్ దూరంలో పిడుగు పడిందని అంచనా వేయొచ్చు. ఉదాహరణకు, మీరు మెరుపు తర్వాత 6 సెకన్లకు ఉరుము వింటే అది 2 కిలోమీటర్ల దూరంలో పడిందన్న అర్థం.

66
పిడుగుల స‌మ‌యంలో తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు

వర్షాకాలంలో మెరుపులు, ఉరుముల పరిస్థితుల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. పిడుగు పడే అవకాశాలున్నప్పుడు బయట ఉండవద్దు. చెట్ల కింద అస్సలు నిల‌బ‌డ‌కూడ‌దు. మొబైల్ ఫోన్ లేదా మెటల్ వస్తువులు వాడ‌కూడ‌దు. ఓపెన్ ఫీల్డ్ లేదా నీటి లోతట్టు ప్రాంతాల్లో ఉండొద్దు. బహిరంగ ప్రదేశాల్లో మెటల్ రాడ్స్, అంబ్రెలాలు ప‌ట్టుకొని నిల‌బ‌డ‌కూడ‌దు.

Read more Photos on
click me!

Recommended Stories