మూడో రోజు పక్కింటి వాళ్లు ఆరేసిన దుస్తులను చూసిన భార్య ఒక్కసారిగా షాక్ అవుతుంది. 'ఇదేంటి ఈ రోజు దుస్తులు ఇంత శుభ్రంగా ఉన్నాయి. కనీసం ఇప్పుడు అయినా బాగా ఉతకడం వచ్చిందేమో. ఎవరో నేర్పి ఉంటారు కదా? లేదా నేను మాట్లాడింది రహస్యంగా విని ఉంటారా.?' అని చెబుతుంది.
అప్పుడు భర్త ఇచ్చిన సమాధానం ఆమెను ఆశ్చర్యానికి గురి చేస్తుంది. "ఈరోజు నేను ఉదయమే లేచి మన కిటికీ తుడిచాను' అని చెబుతాడు. అంటే ఇన్ని రోజులు ఆమె చూస్తున్న కిటికీలు శుభ్రంగా లేని కారణంగానే దుస్తులు మురికిగా కనిపించాయన్నమాట.