School Fee: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన స్కూల్.. ఏడాది స్కూల్ ఫీజ్ తో లగ్జరీ విల్లా కొనుక్కోవచ్చు..!

Published : Jul 17, 2026, 09:38 AM IST

School Fee: ప్రపంచంలో అత్యంత ఖరీదైన స్కూల్ ఏదో తెలుసా? ఈ స్కూల్లో చదవాలంటే.. పేరెంట్స్ ఫీజులు ఎంత కట్టాలో తెలుసా? అసలు.. ఆ స్కూల్లో ఫీజు అంత ఎక్కువ ఎందుకు ఉంది? కారణం ఏంటి..?

PREV
13
ఈ స్కూల్ గురించి విన్నారా?

ఈ రోజుల్లో పిల్లల స్కూల్ ఫీజులు కట్టడానికి పేరెంట్స్ నానా తిప్పలు పడుతున్నారు. చిన్న చిన్న స్కూల్స్ లో కూడా లక్షల రూపాయల ఫీజులు కట్టించుకుంటున్నారు. మరీ దారుణంగా నర్సరీ, ఎల్ కేజీ, యూకేజీలకు కూడా లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్న రోజులు ఇవి. ఈ ఫీజులకే వామ్మో.... వాయ్యో అంటుంటే.. కోటి రూపాయల ఫీజు కట్టించుకునే స్కూల్ ఒకటి ఉందని మీకు తెలుసా? ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన స్కూల్ ఇది. ఆ స్కూల్ ఎక్కడ ఉంది? ఆ స్కూల్ ఫీజు అంత ఎక్కువ ఎందుకు ఉంది? ఈ వివరాలు ఇప్పుడు చూద్దాం...

23
ఖరీదైన స్కూల్ ఎక్కడ ఉంది?

ప్రపంచంలోని అత్యంత ఖరీదైన స్కూల్ స్విట్జర్లాండ్ లో ఉంది. ఇది ఒక బోర్డింగ్ స్కూల్. దీని పేరు ఇన్ స్టిట్యూట్ లే రోసే. ఈ స్కూల్లో చదవాలంటే సంవత్సరానికి తక్కువలో తక్కువ రూ.1.3 కోట్ల నుంచి రూ.1.5 కోట్ల వరకు ఖర్చు అవుతుంది. ఈ స్కూల్ ని 1880లో స్థాపించారు. దీనిని ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బోర్డింగ్ స్కూల్స్ లో ఒకటిగా చెబుతారు. ఈ స్కూల్లో సామాన్యులు చదవలేరు. ప్రపంచంలోని అనేక రాజకుటుంబాలకు చెందిన పిల్లలు, బిలీనియర్ల పిల్లలు, ప్రముఖ వ్యాపారవేత్తల కుటుంబాలకు చెందిన పిల్లలు మాత్రమే ఇక్కడ చదువుతూ ఉంటారు. ఇక ఈ స్కూల్లో ట్యూషన్ ఫీజుతో పాటు.. హాస్టల్ , భోజనం, స్పోర్ట్స్, ఇతర స్పెషల్ ట్రైనింగ్స్ కూడా ఉంటాయి. వీటన్నింటికీ కలిపి 1.5కోట్లు వసూలు చేస్తారు.

33
ఈ స్కూల్లో స్పెషాలిటీ ఇదే...

ఈ స్కూల్లో మన దగ్గర స్కూల్స్ లాగా 30 , 40 మంది స్టూడెంట్స్ ఉండరు. చాలా తక్కువ మంది స్టూడెంట్స్ ఉంటారు. ఒక్కో స్టూడెంట్ మీద టీచర్లు ప్రత్యేక శ్రద్ధ పెడతారు. వారికి అన్ని సబ్జెక్టుల విషయంలో కేర్ తీసుకుంటారు. చదువుతో పాటు.. మ్యూజిక్, ఆటలపై కూడా అంతే శ్రద్ధ చూపిస్తారు. అన్నీ నేర్పించడానికి ప్రయత్నిస్తారు. ఇక.. ఈ స్కూల్ కి రెండు క్యాంపస్ లు ఉన్నాయి. వేసవి కాలంలో ఒక క్యాంపస్ లో, చలికాలంలో మరో క్యాంపస్ లో చదువు నేర్పిస్తారు. ఈ స్కూల్లో అడ్మిషన్ దొరకడం కూడా అంత ఈజీ కాదు. కేవలం డబ్బు ఉన్నంత మాత్రాన.. ఇక్కడ అడ్మిషన్ ఇవ్వరు. వారి టాలెంట్ కి పరీక్ష పెట్టి.. ఆ తర్వాత మాత్రమే ఇస్తారు. ఇక్కడ విద్య విధానం కూడా చాలా భిన్నంగా ఉంటుంది. ప్రపంచంలోని బెస్ట్ టీచర్లు ఇక్కడ శిక్షణ ఇస్తారు. పిల్లలకు అన్ని రకాల సౌకర్యాలు అందిస్తారు. అందుకే... ఫీజు అంత ఎక్కువగా ఉంటుంది.

Read more Photos on
click me!

Recommended Stories